minister of state for finance
-
Banking Laws Amendment Bill: ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024ను ప్రవేశపెట్టింది. ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుండి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రవేశపెట్టారు. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్ డివిడెండ్లను ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్ పరిపాలనా, ఆడిట్ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్íÙప్లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునరి్నర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ఈ బిల్లును గత వారం క్యాబినెట్ ఆమోదించింది. -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
పదేళ్లలో 757 బ్యాంక్ మోసం కేసులు!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులలో బ్యాంకు మోసాలకు సంబంధించిన 757 కేసులు నమోదుచేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ ఈడీ వద్ద నమోదయిన కేసులు 36 అని కూడా ఆయన వెల్లడించారు. అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ఈ కేసులు దాఖలయినట్లు పార్లమెంటుకు ఇచి్చన ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 25వ తేదీ నాటికి రూ. 15,805.91 కోట్ల ఆస్తులు జప్తు జరిగిందని, రుణ బకాయిలకు సంబంధించి రూ. 15,113 కోట్లు బ్యాంకులకు సమకూర్చినట్లు పేర్కొన్నారు. రుణ మోసాలకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ రికవరీ మార్గాలను అనుసరించినట్లు వెల్లడించారు. సివిల్ కోర్టులలో లేదా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లో దావా దాఖలు చేయడం, ఫైనాన్షియల్ ఆస్తుల సెక్యూరిటీ– రీకన్స్ట్రక్షన్ కింద చర్యలు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం అమలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా చర్యలు, చర్చల పరిష్కారం, రాజీ వంటి పలు మార్గాలు ఇందులో ఉన్నాయన్నారు. పది కేసుల్లో 14 మంది దేశం విడిచి పారిపోయినట్లు గుర్తించామన్నారు. వీరిలో ఆరుగురిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా, ఏడుగురిని ప్రకటిత నేరస్థులుగా ప్రకటించామని మంత్రి తెలిపారు. -
డిజిటలైజేషన్, మొండిబకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులు డిజిటలైజేషన్‌పై దృష్టి సారించాలని అలాగే ఒత్తిడితో కూడిన రుణాలపై (మొండిబకాయిలకు దారితీసే అవకాశమున్న ఖాతాలు) నిఘా ఉంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, అన్ని వర్గాలను ఫైనాన్షియల్ చట్రంలోకి తీసుకురావడంపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్యాంకులు నిరర్థక ఆస్తులను సకాలంలో గుర్తించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మొండిబకాయిలకు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) చేయాలి. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయి దృష్టి సారింపు అవసరం. భవిష్యత్తు అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. -
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆర్బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్ఫ్రా ఇంజినీరింగ్ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. 46% తగ్గిన ఎయిడ్స్ 2021 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 24.01 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు కేంద్రం రాజ్యసభకు తెలిపింది. వీరిలో 45% మంది అంటే 10.83 లక్షల మంది మహిళలు కాగా 2% మంది 12 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 51 వేల మంది ఉన్నట్లు పేర్కొంది. అయితే, అత్యధికంగా మహారాష్ట్రలో 3.94 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షల కేసులుండగా తెలంగాణలో 1.56 లక్షల కేసులు నమోదైనట్లు వివరించింది. మొత్తమ్మీద చూస్తే 2010 నుంచి ఎయిడ్స్ కేసుల్లో తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 32%, దేశంలో 46% నమోదైందని తెలిపింది. -
చిక్కుల్లో అదానీ గ్రూప్, విచారణకు సెబీ
నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణ జరుపుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అయితే, ఏయే సంస్థలపై దర్యాప్తు జరుగుతున్నదీ మాత్రం వెల్లడించలేదు. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు మారిషస్ ఆధారిత ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలను ఎన్ఎస్డీఎల్ స్తంభింపచేసిందని వార్తలు రావడం తెలిసిందే. దీంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. -
ఇన్ఫ్రా అభివృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఇవి బహుళ విధాలుగా సానుకూల ప్రభావాలు చూపగలవని ఆయన వివరించారు. భారత్ స్వయం సమృద్ధమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగా ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను నిర్మించుకోవడం కీలకమని ఠాకూర్ వివరించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చే అయిదేళ్లలో ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రూ. 111 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ గత నెలలో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
జీఎస్టీ.. కాస్త టైమ్ పడుతుంది: కేంద్ర మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల వ్యవస్థకు పుల్ స్టాప్ పెడుతూ ఒక దేశం ఒక పన్ను విధానం పేరిట కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సేల్స్ టాక్స్-జీఎస్టీ) జూలై 1 నుంచి అమలులోకి తెచ్చింది. సత్ఫలితాల మాట ఏమోగానీ గందరగోళంగా ఉందంటూ ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కొత్త కోడలు లాంటి జీఎస్టీ అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో నారెడ్కో(NAREDCO) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కోసమే జీఎస్టీని మోదీ సర్కార్ తీసుకొచ్చిందని తెలిపారు. ‘కొత్తగా ఓ కుటుంబంలోకి వచ్చిన కోడలికి సర్దుకుపోవటానికి కాస్త సమయం పడుతుంది. తర్వాతే ఆ కుటుంబం అభివృద్ధి చెందటం ప్రారంభిస్తుంది. అలాగే జీఎస్టీ కూడా దేశానికి కొత్త కోడలు లాంటిదే. ఆర్థిక పురోగతి కోసమే సరైన సమయంలో జీఎస్టీని కేంద్రం తీసుకొచ్చింది. దాని ఫలితం మున్ముంది కనిపిస్తుంది’ అని అర్జున్ రామ్ తెలిపారు. జీఎస్టీ గురించి ప్రజలకు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని ఎస్బీఐ మేనేజింగ్ డైరక్టర్ రజనీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్పందించారు. నోట్ల రద్దుతో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన కేంద్రం జీఎస్టీతో ఈ యేడాది మరో కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. జీఎస్టీతో పరోక్షంగా ప్రజలపై భారం పడకుండానే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ లో అది ఎక్కువగా ఉండబోతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు చేసిన పలు సూచనలను జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అర్జున్ రామ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
టాప్ 10 కార్పొరేట్ గ్రూప్‌ల రుణం 5.73 లక్షల కోట్లు!
రాజ్యసభలో కేంద్రం ప్రకటన... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఈ ఏడాది మార్చి నాటికి టాప్ 10 కార్పొరేట్ గ్రూపులు చెల్లించాల్సిన రుణ మొత్తం రూ.5.73 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభలో మంగళవారం ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. రూ.5 కోట్లకుపైగా రుణం ఉన్న కంపెనీల సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అయితే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు మినహా రుణ సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిబంధనలు అంగీకరించడం లేదనీ వెల్లడించారు. ఎన్పీఏలకు మందగమనమూ కారణమే... మొండిబకాయిల సమస్య పెరగడానికి ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితులు కూడా కారణమని తెలిపారు. ఎన్పీఏలు అధికంగా ఉన్న మౌలిక, ఉక్కు, జౌళి వంటి రంగాలకు పునరుత్తేజానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారంలో కొంత ముందడుగు వేయాలని ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోందని తెలిపారు. అలాగే బ్యాంకింగ్ సత్వర రుణ వసూలు ప్రక్రియకు కొత్తగా ఆరు డెట్ రికవరీ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకూ ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు. చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైతే.. గ్యారెంటార్ మీదా చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం బ్యాంకర్లకు సూచించినట్లు తెలిపారు. రూ.59,547 కోట్ల రుణాల రద్దు... మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, రాజీసహా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2015-16లో రూ.59,547 కోట్ల రుణాలను పద్దుల నుంచి తొలగించినట్లు (మాఫీ) పేర్కొన్నారు. ప్రైవేటు రంగం విషయంలో ఈ మొత్తం రూ.12,017 కోట్లుగా తెలిపారు. విదేశీ బ్యాంకుల విషయంలో ఈ పరిమాణం రూ.1,057 కోట్లు. ప్రముఖ అకౌంట్ హోల్డర్ల రైటాఫ్ వివరాలు అందలేదని ఆర్బీఐ తెలిపిందని మంత్రి వెల్లడించారు. కేవీఐసీ... బలహీన రుణ రికవరీ వ్యవస్థ: కాగ్ ఇదిలావుండగా, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణ రికవరీ వ్యవస్థ, ప్రక్రియ అత్యంత బలహీనంగా ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పార్లమెంటుకు సమర్చించిన ఒక నివేదికలో తెలిపింది. రాబట్టుకోవాల్సిన మొత్తం రూ.551.46 కోట్లని సైతం వెల్లడించింది. -
చావుబాకీలు రూ. 8 లక్షల కోట్లపైనే!
దేశంలోని అన్ని రకాల బ్యాంకులకు ఉన్న చావుబాకీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల పైమాటేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తగినన్ని నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనకున్న మొత్తం వ్యవస్థలో 11.25 శాతం ఈ చావుబాకీలేనని, అయితే ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్లో రూ. 25వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో రూ. 25వేల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2017-18, 2018-19 సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని జయంత్ సిన్హా చెప్పారు.