నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీలపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) విచారణ జరుపుతున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అయితే, ఏయే సంస్థలపై దర్యాప్తు జరుగుతున్నదీ మాత్రం వెల్లడించలేదు. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన మూడు మారిషస్ ఆధారిత ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్ స్తంభింపచేసిందని వార్తలు రావడం తెలిసిందే. దీంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment