న్యూఢిల్లీ: బ్యాంకులు డిజిటలైజేషన్‌పై దృష్టి సారించాలని అలాగే ఒత్తిడితో కూడిన రుణాలపై (మొండిబకాయిలకు దారితీసే అవకాశమున్న ఖాతాలు) నిఘా ఉంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, అన్ని వర్గాలను ఫైనాన్షియల్ చట్రంలోకి తీసుకురావడంపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు.
ఈఎస్‌ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్యాంకులు నిరర్థక ఆస్తులను సకాలంలో గుర్తించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మొండిబకాయిలకు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) చేయాలి. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయి దృష్టి సారింపు అవసరం. భవిష్యత్తు అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment