దేశంలోని అన్ని రకాల బ్యాంకులకు ఉన్న చావుబాకీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల పైమాటేనని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తగినన్ని నిధులు సమకూరుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మనకున్న మొత్తం వ్యవస్థలో 11.25 శాతం ఈ చావుబాకీలేనని, అయితే ఈ సమస్యను తగిన విధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో రూ. 25వేల కోట్లను కేటాయించారు. ప్రస్తుత, తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో రూ. 25వేల కోట్ల చొప్పున, ఆ తర్వాత 2017-18, 2018-19 సంవత్సరాల్లో రూ. 20 వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని జయంత్ సిన్హా చెప్పారు.
చావుబాకీలు రూ. 8 లక్షల కోట్లపైనే!
Published Fri, Mar 4 2016 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
Advertisement