మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది ‘ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్’ పురస్కారం రేసులో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడు. 2023 సంవత్సరానికిగాను ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 11 అథ్లెట్‌లను నామినీలుగా ప్రకటించింది.
నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఆసియా క్రీడల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మూడు పద్ధతుల్లో ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ–మెయిల్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ సభ్యులు... ఆన్‌లైన్ విధానంలో అభిమానులు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అక్టోబర్ 28వ తేదీతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 13, 14 తేదీల్లో టాప్–5 ఫైనలిస్ట్‌లను... డిసెంబర్ 11న తుది విజేతలను ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment