Athletics Federation of India
-
‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ నామినీల్లో నీరజ్ చోప్రా
మోంటెకార్లో (మొనాకో): ఈ ఏడాది ‘ప్రపంచ పురుషుల ఉత్తమ అథ్లెట్’ పురస్కారం రేసులో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిలిచాడు. 2023 సంవత్సరానికిగాను ‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 11 అథ్లెట్లను నామినీలుగా ప్రకటించింది. నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఆసియా క్రీడల్లో తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మూడు పద్ధతుల్లో ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈ–మెయిల్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్స్ కౌన్సిల్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ సభ్యులు... ఆన్లైన్ విధానంలో అభిమానులు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. అక్టోబర్ 28వ తేదీతో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. నవంబర్ 13, 14 తేదీల్లో టాప్–5 ఫైనలిస్ట్‌లను... డిసెంబర్ 11న తుది విజేతలను ప్రకటిస్తారు. -
#GurbachanRandhawa: వయసు భారం.. అందుకే రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి గుర్బచన్ సింగ్ రణ్‌ధావా రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వయసు భారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు 84 ఏళ్ల రణ్‌ధావా వివరించారు. 1962 ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రణ్‌ధావా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ‘వయసు పైబడటంతో వందశాతం నా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. భారత అథ్లెటిక్స్‌కు మంచి రోజులు వచ్చాయి. నీరజ్ చోప్రా రూపంలో మనకూ ఒక ఒలింపిక్ చాంపియన్ లభించాడు’ అని రణ్‌ధావా పేర్కొన్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన రణ్ధావాకు 1961లో ‘అర్జున అవార్డు’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించాయి. -
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా
Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్ ఆదిల్ సుమారివాలా ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాల చేత మాజీ అధ్యక్షుడు నరిందర్ బత్రా రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సుమారివాలా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు జరిగే వరకు సుమారివాలా ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు సుమారివాలా అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఈ నియామకం జరిగినట్లు ఐవోఏ వెల్లడించింది. కాగా, భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో ఓ ఒలింపియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదిల్ సుమారివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో (100 మీటర్ల రన్నింగ్) ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత -
రన్నర్ రాంబాయి.. 105 నాట్అవుట్
వయసు సెంచరీ దాటిన తరువాత రెండు అడుగులు వేయాలంటే.. కర్ర, మంచం, కుర్చి, వాకర్ వంటివాటి సాయం తప్పక తీసుకోవాల్సిందే. అటువంటిది హరియాణాకు చెందిన 105 ఏళ్ల ‘రాంబాయి’ బామ్మ అత్యంత వేగంగా పరుగెత్తి జాతీయ రికార్డులను తిరగరాయడమేగాక, రెండు స్వర్ణపతకాలను అవలీలగా గెలుచుకుంది. శాకాహారం మాత్రమే తీసుకునే ఈ బామ్మ ఇంతటి లేటువయసులో ఎంతో చలాకీగా ఉంటూ యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. జూన్ 15న అథ్లెటిక్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వడోదరాలో నిర్వహించిన ప్రారంభ నేషనల్ ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వంద మీటర్ల దూరాన్ని కేవలం 45.40 సెకన్లలో పరుగెత్తి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది రాంబాయి. గతంలో 101 ఏళ్ల మన్ కౌర్ ఇదే వంద మీటర్ల దూరాన్ని 74 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. కౌర్‌కంటే వేగంగా పరుగెత్తిన రాంబాయి ఈ రికార్డుని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఆదివారం (జూన్19)న నిర్వహించిన రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకనులలో పూర్తిచేసి మరో స్వర్ణపతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టింది రాంబాయి బామ్మ. చిన్నప్పటి నుంచి రేసుల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. పరుగు పందెంలో పాల్గొనడానికి అవకాశం రావడంతో... గతేడాదిలో రన్నింగ్ సాధన మొదలు పెట్టి రేసులలో పాల్గొనడం ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో వారణాసిలో తొలిసారి పరుగు పందెంలో పాల్గొంది. అక్కడ రాంబాయి రన్నింగ్ బావుండడంతో..ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో జరిగే పోటీల్లో పాల్గొని డజనకు పైగా పతకాలను గెలుచుకుంది. తాజాగా వడోదరలో వందేళ్లకు ౖపైబడిన వారికి నిర్వహించే పరుగు పందెంలో ఎంతో చలాకీగా పాల్గొని రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఉత్సాహంతో.. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కలలు కంటూ పాస్‌పోర్టును సిద్ధం చేసుకుంటోంది ఈ సెంచరీ బామ్మ. రాంబాయి కుటుంబంలో ఆమె ఒక్కరే కాకుండా కొంతమంది కుటుంబ సభ్యులు సైతం వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన వారే. రాంబాయి 62 ఏళ్ల కూతురు సంత్రా దేవి రిలే రేస్‌లో స్వర్ణ పతకం, కుమారులు ముఖ్తార్ సింగ్, వధు భటెరీలు రెండు వందల మీటర్ల రేస్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పాలు పెరుగు... రాంబాయి శాకాహారి. అరకేజీ పెరుగు,అరలీటరు పాలు, పావుకేజీ వెన్న, జొన్న పిండితో చేసిన బ్రెడ్‌ను రోజువారి ఆహారంగా తీసుకుంటుంది. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి రోజూ పొలంలో పనిచేయడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తుంది. సొంత పొలంలో పండిన పంటనే ఆహారంగా తీసుకోవడం, క్రమం తప్పని నడకతో వయసు సెంచరి దాటినప్పటికీ.. యాక్టివ్‌గా ఉంటోంది. అవకాశం ఇవ్వలేదు... ‘నేను ఎప్పుడో పరుగెత్తాలని అనుకున్నాను. కానీ నాకెవరు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నా మనవరాలు షర్మిలతో వచ్చి ఇక్కడ పాల్గొన్నాను. మా కుంటుబంలో ఎక్కువ మంది క్రీడారంగంలో రాణిస్తున్నారు. ఈ రోజు నేను కూడా వారి జాబితాలో చేరాను. షర్మిల కూడా పతకాలు గెలుచుకుంది. పాలు పెరుగు, చుర్మాలే నన్ను గెలిపించాయి. ఇవే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి’ అని రాంబాయి చెప్పింది. -
‘కామన్వెల్త్’కు జ్యోతి
న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరఫున 37 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే బృందం వివరాలను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) గురువారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో సారి కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగుతున్నాడు. 2018లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన పోటీల్లో నీరజ్ స్వర్ణం సాధించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజి తొలిసారి సీడబ్ల్యూజీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల వరుసగా మూడు జాతీయ రికార్డులతో జ్యోతి అద్భుత ఫామ్‌లో ఉంది. అన్నింటికి మించి హైజంప్‌లో జాతీయ రికార్డు సాధించడంతో పాటు సులువుగా క్వాలిఫయింగ్ మార్క్‌ను అందుకున్న తేజస్విన్ శం కర్ను ఏఎఫ్ఐ ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. గత వారమే అతను యూఎస్‌లో ఎన్సీఏఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో 2.27 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం సాధించాడు. నిబంధనల ప్రకారం ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో తేజస్విన్ పాల్గొని ఉండాల్సి ఉందని... అతను ఈ ఈవెంట్‌కు దూరంగా ఉండేందుకు కనీసం తమనుంచి అనుమతి తీసుకోకపోవడం వల్లే పక్కన పెట్టామని ఏఎఫ్ఐ అధ్యక్షుడు ఆదిల్ సమరివాలా స్పష్టం చేశారు. -
భారత అథ్లెట్స్‌పై దిగ్గజ లాంగ్ జంపర్ సంచలన ఆరోపణలు
భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్.. లెజెండరీ లాంగ్ జంపర్.. 2003 వరల్డ్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ భారత అథ్లెట్స్‌పై సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో బ్యాన్ చేసిన చాలా రకాల నిషేధిత డ్రగ్స్‌ను కొందరు అథ్లెట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పంచుతున్నారని ఆరోపించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన ఏఎఫ్ఐ రెండు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంజూ జార్జీ ఈ వ్యాఖ్యలు చేసింది. ''భారతదేశంలో నిషేధించబడిన అనేక డ్రగ్స్ పదార్థాలను విదేశాల నుంచి కొందరు అథ్లెట్లు విరివిగా తీసుకువస్తున్నారు. తాము వాడడమే కాకుండా మిగతా అథ్లెట్లకు నిషేధిత డ్రగ్స్ పంచడం దారుణం. వద్దని చెప్పాల్సిన కోచ్‌లే దగ్గరుండి డ్రగ్స్ అందజేస్తున్నారు. తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకే కొందరు అథ్లెట్లు ఇలాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారు. దేశంలో అథ్లెట్స్ నిషేధిత డ్రగ్స్ వాడకంలో పెరుగుదల ఆందోళనకరమైన విషయం'' అని పేర్కొంది. కాగా ఏఎఫ్ఏ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా మాట్లాడుతూ.. ''అంజూ బాబీ జార్జీ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాము. అథ్లెట్ల పరీక్షకు సంబంధించిన డోపింగ్ టెస్ట్‌ను మరింత కఠినతరం చేస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి ఈ విషయాన్ని తెలియజేశాం. డోపింగ్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని వారిని కోరాం అని తెలిపారు. -
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Corona: ఏఎఫ్ఐ మెడికల్ కమిషన్ చైర్మన్ మృతి
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెండిరటా (60) కరోనాతో మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన అరుణ్ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్ఐ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్ సంఘం అరుణ్‌ను నియమించింది. దాంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పనిచేస్తుండటం విశేషం. చదవండి: Monali Gorhe: గంటల వ్యవధిలో తండ్రీకూతురు మృతి -
ఉపాధ్యక్షురాలిగా అంజూ జార్జ్
గురుగ్రామ్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)లో ఆదిల్ సుమరివాలా తన పట్టు నిలుపుకున్నారు. మళ్లీ తనే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత దిగ్గజ అథ్లెట్ అంజూ బాబీజార్జ్ సీనియర్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైంది. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన సీనియర్ ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎన్నికవడం ఏఎఫ్ఐ చరిత్రలో ఇదే మొదటిసారి. గత కార్యవర్గంలో ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరించింది. రెండు రోజుల పాటు జరిగిన సర్వసభ్య సమావేశంలో శనివారం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమరివాలా వరుసగా మూడో సారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2012, 2016లలో కూడా ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇద్దరు... కొత్త కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ సంఘంనుంచి ఇద్దరికి చోటు దక్కింది. సంయుక్త కార్యదర్శిగా ఏవీ రాఘవేంద్ర, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎ.హైమ ఎంపికయ్యారు. -
ఈనెల 31న భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఎన్నికలు
న్యూఢిల్లీ: ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వస్తోన్న భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 31, నవంబర్ 1వ తేదీల్లో ఏఎఫ్ఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తారు. అందులో భాగంగా తొలి రోజు జరిగే సమావేశంలో ఎన్నికలు నిర్వహించి ఆఫీస్ బేరర్లను ఎన్నుకొనేందుకు సిద్ధమయ్యామని ఏఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ఎన్నికైన వారు 2024 వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగిసింది. అయితే కరోనా కారణంతో ఎన్నికలను నిర్వహించలేమంటూ... వారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఏఎఫ్ఐ మే నెలలో నిర్ణయం తీసుకుంది. -
‘ఖేల్‌రత్న’ బరిలో నీరజ్
న్యూఢిల్లీ: భారత మేటి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈసారి కూడా ‘రాజీవ్ ఖేల్‌రత్న’ బరిలో నిలిచాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) 2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల చాంపియన్ అయిన నీరజ్‌ను అత్యున్నత క్రీడా పురస్కారానికి వరుగా మూడో ఏడాదీ నామినేట్ చేసింది. 2016లో ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ అండర్–20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీరజ్ 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్నాడు. గత రేండేళ్లుగా నీరజ్‌ను ఏఎఫ్ఐ నామినేట్ చేస్తున్నప్పటికీ చివరకు ‘ఖేల్‌రత్న’ వరించడం లేదు. 22 ఏళ్ల నీరజ్‌కు 2018లో ‘అర్జున అవార్డు’ దక్కింది. మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్‌తో పాటు ఆసియా క్రీడల స్వర్ణ విజేతలు అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీటర్ల పరుగు), మిడిల్ డిస్టెన్స్ రన్నర్ పి.యు.చిత్రలను ‘అర్జున’ అవార్డుకు సిఫారసు చేసింది. డిప్యూటీ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్‌ను ‘ద్రోణాచార్య’... కుల్దీప్ సింగ్ భుల్లర్, జిన్సీ ఫిలిప్‌లను ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం కోసం ఏఎఫ్ఐ ప్రతిపాదించింది. స్వయంగా దరఖాస్తు చేసుకోండి... ఆటగాళ్లు తమ తమ అర్హతలు, పతకాలు చరిత్రతో సొంతంగా కూడా నామినేట్ చేసుకోవచ్చని క్రీడాశాఖ తెలిపింది. బుధవారంతో ముగియాల్సిన నామినేషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించింది. కరోనా మహమ్మారి విలయతాండవం దృష్ట్యా ఈసారి క్రీడాశాఖ కేవలం ఈ–మెయిల్ల ద్వారానే దరఖాస్తుల్ని కోరుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక అవార్డుల కమిటీ ఎంపిక చేసే విజేతలకు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో అవార్డుల్ని ప్రదానం చేస్తారు. ‘అవార్డులు... ఓ ప్రహసనం’: ప్రణయ్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్)పై స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఈ ఏడాదీ తనను ‘అర్జున’కు నామినేట్ చేయకపోవడంపై ఈ కేరళ ప్లేయర్ ట్విట్టర్లో స్పందించాడు. ‘అవార్డుల నామినేషన్లలో పాత కథే! కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన షట్లర్‌ను విస్మరిస్తారు. దేశం తరఫున ఇలాంటి మెగా ఈవెంట్స్‌లో కనీసం పోటీపడని ఆటగాడినేమో నామినేట్ చేస్తారు. ‘అవార్డులు ఈ దేశంలో ఓ ప్రహసనం...’ అని ట్వీట్ చేశాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రణయ్... అదే ఏడాది వుహాన్‌లో జరిగిన ఆసియా చాంపియన్íషిప్లో కాంస్య పతకం సాధించాడు. ఈ ఏడాది ‘బాయ్’ ప్రతిపాదించిన ముగ్గురిలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం గెలిచారు. కానీ సమీర్‌వర్మ మాత్రం ఇప్పటి వరకు దేశం తరఫున మెగా ఈవెంట్స్‌లో బరిలోకి దిగలేదు. ప్రణయ్‌కు మద్దతుగా భారత మరో స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ వ్యాఖ్యానించాడు. ‘జాతీయ క్రీడా అవార్డుల కోసం దరఖాస్తు చేసే విధానం ఇప్పటికీ అర్థంకాదు. ఈ పద్ధతిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ధైర్యం కోల్పోకుండా దృఢంగా ఉండు సోదరా’ అని ప్రణయ్‌కు కశ్యప్ మద్దతుగా నిలిచాడు. -
ఒక్క ట్వీట్.. నెటిజన్లు ఫిదా
హైదరాబాద్: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమావ గలవని, దాని కోసం ఏఎఫ్ఐ ముందుడుగేసిందని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఏఎఫ్‌ఐపై ఇంతగా ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(జావెలిన్ త్రో) స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దీనిపై ఏఎఫ్ఐ తమ అధికారిక ట్విటర్లో స్పందించింది. ‘పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్‌కు కంగ్రాట్స్. దక్షిణాసియా గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం నిజంగా అభినందనీయం. దశాబ్దాల తర్వాత నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించిన తొలి పాకిస్తాన్ అథ్లెట్‌గా అర్షద్ రికార్డు నెలకొల్పాడు’అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో అర్షద్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని కేవలం క్రీడల మాత్రమే తొలగించగలవు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. ‘రెండు దేశాల మధ్య సయోధ్య, సత్సంబంధాలు తిరిగి పునరుద్దరించుకోవాలంటే కేవలం క్రీడలు మాత్రమే ఉపయోగపడతాయి’అంటూ మరికొంత మంది ట్వీట్ చేశారు. ఇక ముంబై దాడుల అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య తిరిగి శత్రుత్వం తారాస్థాయికి చేరగా.. పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన విషయం తెలిసిందే. -
‘ఖేల్‌రత్న’కు నీరజ్
న్యూఢిల్లీ: స్టార్ జావెలిన్ త్రోయర్, గతేడాది ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా పేరును భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశంలోని అతి కొద్దిమంది ప్రపంచస్థాయి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లలో ఒకడైన నీరజ్ గతేడాది కామన్వెల్త్ క్రీడల్లోనూ స్వర్ణం సాధించడంతో ‘అర్జున అవార్డు’కు ఎంపికయ్యాడు. అప్పుడు కూడా ఖేల్‌రత్నకు పరిశీలనకు పంపినా ఆ పురస్కారం దక్కలేదు. అయితే, కొత్త జాతీయ రికార్డు (88.06 మీటర్లు)తో ఆసియా క్రీడల్లో బంగారు పతకం నెగ్గడంతో మరోసారి ప్రతిపాదించారు. ఈసారి అథ్లెటిక్స్ నుంచి ఏఎఫ్ఐ నీరజ్‌ను మాత్రమే ఖేల్‌రత్నకు పంపింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు తేజీందర్ పాల్‌సింగ్ తూర్ (షాట్‌పుట్), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), మన్జీత్ సింగ్ (800 మీ. పరుగు), స్వప్న బర్మన్ (హెప్టాథ్లాన్)తో పాటు ద్యుతీ చంద్ (100 మీ, 200 మీ. పరుగులో రజతం)లను అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. -
రాంచీలో కాదు భువనేశ్వర్‌లో!
న్యూఢిల్లీ: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహణ నుంచి జార్ఖండ్ తప్పుకుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి 4 వరకు ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో ఈ గేమ్స్ జరగాల్సి ఉంది. అయితే ఆర్థిక కారణాలతో నిర్వహణపై జార్ఖండ్ ప్రభుత్వం తమ అశక్తత తెలపడంతో ఒడిషాకు తరలివెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతినిధుల బృందం పరిశీలించింది. మంగళవారం వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏఎఫ్ఐ కార్యదర్శి సీకే వాల్సన్ తెలిపారు. గతంలో ఈ టోర్నీకి భారత్ రెండు సార్లు ఆతిథ్యమిచ్చింది. 1989లో తొలిసారిగా న్యూఢిల్లీలో జరగ్గా ఆ తర్వాత పుణే (2013) వేదికగా పోటీలు జరిగాయి. -
అథ్లెట్స్ ఖుష్బీర్ కౌర్, మనీశ్‌లపై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళా రేస్‌వాకర్ ఖుష్బీర్ కౌర్ పై వేటు పడింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ఆసియా రేస్ వాకింగ్ చాంపియన్ షిప్ కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి ఆమెను తప్పించింది. జాతీయ చాంపియన్ షిప్లో శనివారం 20 కిలో మీటర్ల ఈవెంట్ నుంచి ఖుష్బీర్ కౌర్ చెప్పాపెట్టకుండా తప్పుకోవడంతో ఏఎఫ్ఐ ఆమెను జాతీయ జట్టు నుంచి తొలగించింది. పంజాబ్‌కు చెందిన 23 ఏళ్ల ఖుషీ్బర్ 2014 ఇంచియోన్ సియా క్రీడల్లో 20 కిలోమీటర్ల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆసియా రేస్ వాకింగ్ ఈవెంట్ జపాన్ లోని నోమిలో వచ్చే నెల 20 నుంచి జరుగనుంది. మరోవైపు ‘రియో ఒలింపియన్ ’ మనీశ్ సింగ్ రావత్‌ను కూడా జాతీయ జట్టు నుంచి ఏఎఫ్ఐ తప్పించింది. జాతీయ చాంపియన్ షిప్లో 20 కిలోమీటర్ల నడక పోటీలో బరిలోకి దిగాల్సిన అతను ముందస్తు సమాచారం ఇవ్వకుండా చివరి నిమిషంలో వైదొలిగాడు. జాతీయ పోటీల్లో పాల్గొనని అథ్లెట్లను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేయబోమని ఏఎఫ్ఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ గుర్బచన్ సింగ్ రణ్‌ధావా స్పష్టం చేశారు. జాతీయ శిబిరాల నుంచి వారిని తొలగించాలని కూడా ఏఎఫ్‌ఐకి సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. వారి కోచ్ అలెగ్జాండర్ ఇచ్చే వివరణను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏఎఫ్ఐ కార్యదర్శి సీకే వాల్సన్ మాట్లాడుతూ ఇలాంటివి పునరావృతవైుతే భవిష్యతు్తలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆట తెలియదు...ఆడించేస్తారట!
చిన్న చిన్న దేశాలూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తుంటే... 125 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. కేవలం ఒలింపిక్స్ సమయంలో నిరాశాజనక ప్రదర్శన ఆధారంగా విమర్శలు చేసే వాళ్లు ఎందరో ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు మాత్రం ఎవరూ చొరవ చూపడంలేదు. ఒక రంగంలో అభివృద్ధి జరగాలంటే ఆ రంగానికి చెందిన నిష్ణాతుల భాగస్వామ్యం అత్యవసరం. కానీ మన దగ్గర మాత్రం ఆట గురించి తెలియనివాళ్లు, ఎప్పుడూ ఆడని వాళ్లు ఆయా సంఘాలకు అధ్యక్షులుగా బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారు. భారత క్రీడా వ్యవస్థలో ఉన్న లోపాలు... మన క్రీడారంగం బాగు పడాలంటే ఏం చేయాలి... తదితర అంశాలపై ఓ అధ్యయనం... ఒక్కరే... ఒక్కరు... భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) అనుబంధంగా ఉన్న 38 క్రీడా సంఘాల్లో ఒక్కటంటే ఒక్క సంఘానికి మాత్రమే మాజీ క్రీడాకారుడు అధ్యక్షుడిగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఉన్న అదిలె సుమరివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగారు. మరో 9 క్రీడా సంఘాల్లో మాజీ, ప్రస్తుత క్రీడాకారులు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 12 క్రీడా సంఘాలు అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల పదవీకాలం గురించి కనీస వివరాలు అందుబాటులో ఉంచలేదు. కేవలం రెండు క్రీడా సంఘాలు మాత్రమే తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించాయి. హాకీ ఇండియాను (34 శాతం) మినహాయిస్తే మిగతా క్రీడా సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం 2 నుంచి 8 శాతంలోపే ఉంది.తొమ్మిది క్రీడా సంఘాలు తమ లక్ష్యాలు, ఉద్దేశాలను తెలియజేయలేదు. 10 క్రీడా సంఘాలు తమ నియమావళిని అందుబాటు లో ఉంచడంలో విఫలమైంది. 10 క్రీడా సంఘాలు తమ అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల విధులు, బాధ్యతలను తెలియజేయలేదు. ఎనిమిది క్రీడా సంఘాల్లో అసలు మహిళలకు ప్రాతినిధ్యమే లేదు. 11 క్రీడా సంఘాలు తమ కార్యవర్గం పదవీకాలం, నియమావళికి సంబంధించిన సమాచారం అందించలేదు. 12 క్రీడా సంఘాలు తమ అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల పదవీకాలానికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచలేదు. మిగతా 15 క్రీడాసంఘాల్లో ఆరు మాత్రమే అధ్యక్ష పదవికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఇండియన్ గోల్ఫ్ యూని యన్ మాత్రమే తమ భవిష్యత్ ప్రణాళికను రూపొందించాయి.16 క్రీడా సంఘాలు తమ ఆర్థిక లావాదేవీలను క్రమం తప్పకుండా ప్రకటించడంలేదు. కేవలం ఫుట్‌బాల్ సమాఖ్య మాత్రమే తమ ఆర్థిక వ్యవహారాలను ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయించింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య మాత్రమే కీలక సభ్యులకు సంబంధించి జీతభత్యాలను వెల్లడించింది. ఏ క్రీడా సంఘం కూడా తమ కార్యవర్గ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో అనే సమాచారాన్ని తెలియజేయలేదు. ఇలా చేస్తే బాగుంటుంది... ►భారత ఒలింపిక్ సంఘంతోపాటు అన్ని క్రీడా సంఘాలు భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేయాలి. ఈ వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాకారం అవుతున్నాయో లేదో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ►అన్ని క్రీడా సంఘాలు తమ ఎన్నికల విధానంలో మార్పులు తేవాలి. అధ్యక్షుడితోపాటు కార్యదర్శి, కోశాధికారి, ఇతర కార్యవర్గ సభ్యులకు నిర్ణీత పదవీకాలాన్ని నిర్ణయించాలి. ఆ పదవీకాలం దాటిపోతే వారు భవిష్యత్‌లో మళ్లీ పోటీ చేయకూడదు. ►ఆయా క్రీడా సంఘాలు తమ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలి. ఎవరికి ఎంతెంత చెల్లిస్తున్నారో, ఖర్చులు ఎంత అవుతున్నాయో అన్ని వివరాలను తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచాలి. ►పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తగ్గించుకోవాలి లేదా వదులుకోవాలి. ఇలాంటివి ఉంటే అన్ని వివరాలను తెలియజేయాలి. ►{Mీడా సంఘాల్లో క్రీడాకారులకు, మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి. ముఖ్యంగా భారత ఒలింపిక్ సంఘంలో పారదర్శకత పెరగాలి. తమ బడ్జెట్ వివరాలు, దేశవిదేశాల పర్యటనలకు ఎవరెవరిని పంపిస్తున్నారు, వారికయ్యే ఖర్చులు సవివరంగా సమర్పించాలి. -
అథ్లెటిక్స్ ఫెడరేషన్‌పై సోర్ట్స్ అథారిటీ విమర్శలు
న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై సోర్ట్స్ అథారిటీ విమర్శల వర్షం గుప్పించింది. చైనాలో జరిగిన రెండో ఆసియన్ యూత్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు ఘోరంగా విఫలం కావడంతో సోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మండిపడింది. నాన్జింగ్కు 27 మంది సభ్యులు వెళ్లగా, 18 మంది ఎటువంటి పోటీ లేకుండా నిష్ర్కమించడంతో స్పోర్ట్స్ ఇండియా విమర్శలకు దిగింది. స్పోర్ట్స్ అథారిటీ డెరైక్టర్ జనరల్ జిజి థాంప్సన్ సోమవారం మాట్లాడుతూ..సభ్యులను ఎంపిక చేసేముందు పొరపాట్లు జరిగిన కారణంగానే అథ్లెటిక్స్ విఫలమైయ్యారన్నారు. ముందుగా ప్రతి ఒక్కరూ టోర్నమెంట్ రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ‘ మనం సెలెక్షన్స్ జరుగుతున్నప్పుడు అతిగా జోక్యం చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయన్నాడు. అథ్లెట్లు ఎంపిక ఆశ్చర్యానికి గురి చేసిందని' థాంప్సన్ తెలిపాడు..