న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి గుర్‌బచన్ సింగ్ రణ్‌ధావా రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వయసు భారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు 84 ఏళ్ల రణ్‌ధావా వివరించారు.
1962 ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రణ్‌ధావా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ‘వయసు పైబడటంతో వందశాతం నా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. భారత అథ్లెటిక్స్‌కు మంచి రోజులు వచ్చాయి. నీరజ్ చోప్రా రూపంలో మనకూ ఒక ఒలింపిక్ చాంపియన్ లభించాడు’ అని రణ్‌ధావా పేర్కొన్నారు.
1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన రణ్‌ధావాకు 1961లో ‘అర్జున అవార్డు’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment