selection chairman
-
#GurbachanRandhawa: వయసు భారం.. అందుకే రాజీనామా
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి గుర్బచన్ సింగ్ రణ్‌ధావా రాజీనామా చేశారు. గత 18 ఏళ్లుగా ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వయసు భారం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు 84 ఏళ్ల రణ్‌ధావా వివరించారు. 1962 ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో స్వర్ణ పతకం నెగ్గిన రణ్‌ధావా, 1964 టోక్యో ఒలింపిక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో ఐదో స్థానంలో నిలిచారు. ‘వయసు పైబడటంతో వందశాతం నా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నాను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను. భారత అథ్లెటిక్స్‌కు మంచి రోజులు వచ్చాయి. నీరజ్ చోప్రా రూపంలో మనకూ ఒక ఒలింపిక్ చాంపియన్ లభించాడు’ అని రణ్‌ధావా పేర్కొన్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించిన రణ్ధావాకు 1961లో ‘అర్జున అవార్డు’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారం లభించాయి. -
ఎమ్మెస్కే ప్రసాద్‌కు కీలక బాధ్యత
-
ఎమ్మెస్కే ప్రసాద్‌కు కీలక బాధ్యత
ముంబై: భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. బుధవారం ముంబైలో జరిగిన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ వార్షిక సమావేశంలో సందీప్ పాటిల్ స్థానంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలక్షన్ ప్యానల్లో మిగతా సభ్యులుగా దేవాంగ్ గాంధీ, గగన్ కోడా, శరణ్‌దీప్ సింగ్, జతిన్ పరాంజేప్ ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ సౌత్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేల్లో వికెట్ కీపర్‌గా భారత జట్టుకు సేవలందించారు. గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే.. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సౌత్ జోన్ నుంచి జూనియర్ జాతీయ క్రికెట్ సెలక్టర్‌గా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్స్ డైరెక్టర్‌గా, సౌత్‌జోన్ నుంచి సీనియర్ జాతీయ క్రికెట్ సెలెక్టర్‌గా ఆయన పనిచేశారు. ఇప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ప్రమోట్ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.