ఎమ్మెస్కే ప్రసాద్కు కీలక బాధ్యత | msk prasad appointed as indian cricket new Chairman of Selectors | Sakshi
Sakshi News home page

ఎమ్మెస్కే ప్రసాద్కు కీలక బాధ్యత

Published Wed, Sep 21 2016 1:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

ఎమ్మెస్కే ప్రసాద్కు కీలక బాధ్యత

ఎమ్మెస్కే ప్రసాద్కు కీలక బాధ్యత

ముంబై: భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. బుధవారం ముంబైలో జరిగిన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ వార్షిక సమావేశంలో సందీప్ పాటిల్ స్థానంలో ఎమ్మెస్కే ప్రసాద్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలక్షన్ ప్యానల్లో మిగతా సభ్యులుగా దేవాంగ్ గాంధీ, గగన్ కోడా, శరణ్దీప్ సింగ్, జతిన్ పరాంజేప్ ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ సౌత్ జోన్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఎమ్మెస్కే ప్రసాద్ 6 టెస్టులు, 17 వన్డేల్లో వికెట్ కీపర్గా భారత జట్టుకు సేవలందించారు. గుంటూరుకు చెందిన ఎమ్మెస్కే.. రంజీ ట్రోఫీలో ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సౌత్ జోన్ నుంచి జూనియర్ జాతీయ క్రికెట్ సెలక్టర్గా, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్స్ డైరెక్టర్గా, సౌత్జోన్ నుంచి సీనియర్ జాతీయ క్రికెట్ సెలెక్టర్గా ఆయన పనిచేశారు. ఇప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ప్రమోట్ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement