
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) మెడికల్ కమిషన్ చైర్మన్ అరుణ్ కుమార్ మెండిరటా (60) కరోనాతో మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరిన అరుణ్ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు ఏఎఫ్‌ఐ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టీమ్‌కు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా భారత ఒలింపిక్ సంఘం అరుణ్‌ను నియమించింది. దాంతో ఆయన భారత క్రీడాకారుల బృందంతోపాటు టోక్యోకు వెళ్లాల్సి ఉంది. గత 25 ఏళ్లుగా అరుణ్ ఆసియా అథ్లెటిక్స్ సంఘంలో పనిచేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment