డెబిట్ కార్డ్‌తోనూ ఈఎంఐ స్కీమ్
ముంబై: డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై సమాన నెలవాయిదా (ఈఎంఐ) స్కీమ్‌ను ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది. ఈ తరహా స్కీమ్ దేశంలో ఇదే మొదటిదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్‌వాల్ చెప్పారు.్ర కెడిట్ కార్డ్‌ల ద్వారా వస్తువులను ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయవచ్చని, కానీ డెబిట్ కార్డ్ ద్వారా వస్తువుల కొనుగోళ్లకు ఈఎంఐ స్కీమ్‌ను తొలిసారిగా అందిస్తున్నామని వివరించారు.
అయితే సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కనీసం రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన వారే ఈ స్కీమ్‌కు అర్హులని తెలిపారు. మొదటగా ఈ స్కీమ్‌ను శామ్‌సంగ్ బ్రాండ్ ఉత్పత్తులకు ఆఫర్ చేస్తున్నామని, ఆ తర్వాత ఇతర బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించారు.
ఈఎంఐలను మూడు/ఆరు/తొమ్మిద/ పన్నెండుగా ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈఎంఐ స్కీమ్‌కు సంబంధించి డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై 13 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వివరించారు. ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ స్కీమ్ కారణంగా 2.2 కోట్ల మంది ఐసీఐసీఐ డెబిట్ కార్దుదారులు పండుగల సీజన్ సందర్భంగా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ పొందవచ్చని, కొనుగోళ్ల లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చని తెలిపారు.