స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Jun 19 2017 12:53 AM | Last Updated on Wed, Sep 19 2018 8:41 PM

స్టాక్స్‌ వ్యూ - Sakshi

స్టాక్స్‌ వ్యూ

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.427   ;   టార్గెట్‌ ధర: రూ.546


ఎందుకంటే:  కంపెనీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 25 శాతం పెరిగాయి. ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) ధరలు అనుకూలంగా ఉండడం, దహేజ్‌ టెర్మినల్‌ విస్తరణ దీనికి ప్రధాన కారణాలు. ఎల్‌ఎన్‌జీ ధరలు తక్కువగా ఉండడం, దేశీయంగా గ్యాస్‌ లభ్యత తక్కువగా ఉండడడం,  డిమాండ్‌ పెరుగుతుండడం.. వంటి అంశాలను పరిగణనలోకీ తీసుకొని  దీర్ఘకాలంలో కంపెనీ అమ్మకాలు జోరుగా ఉండగలవని అంచనా వేస్తున్నాం.  మూడేళ్లలో అమ్మకాలు 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ రంగంలో పోటీ తక్కువగా ఉండడం, దహేజ్, కోచి టెర్మినల్స్‌ మంచి కాంట్రాక్ట్‌లను సాధించడం, దేశవ్యప్తంగా గ్యాస్‌పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ విస్తరణ ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. ఐదేళ్లలో ఎల్‌ఎన్‌జీ వినియోగం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా. గ్యాస్‌కు డిమాండ్‌ పెరిగితే ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది మొదటివరసలో ఉంటుంది. నిర్మాణంలో ఉన్న జగదీష్‌ పూర్‌–హల్డియా పైప్‌లైన్‌ అందుబాటులోకి వస్తే, మరిన్ని ప్రాంతాలకు ఈ కంపెనీ గ్యాస్‌  సరఫరా చేయగలుగుతుంది. టర్మినల్‌ వృద్ధి 3 శాతంగా ఉంటుందని భావిస్తూ ఈ షేర్‌ ఏడాది కాలంలో రూ.546కు , మూడేళ్ల కాలంలో రూ.767కు చేరగలదని అంచనా వేస్తున్నాం. భారత్‌లో ఎల్‌ఎన్‌జీకు డిమాండ్‌ బాగా వుండటం, లేకపోవడం, సరఫరాలు తగినంతగా లేకపోవడం,  పోటీ పెద్దగా ఉండకపోవడం,   ఎల్‌ఎన్‌జీ ధరలు తగ్గే అవకాశాలు అధికంగా ఉండడం.. ఇవన్నీ కంపెనీకి కలసివచ్చే అంశాలు. స్పాట్, స్వల్పకాలిక అమ్మకాల్లో మార్కెటింగ్‌ మార్జిన్లు తక్కువగా ఉండడం, ఎల్‌ఎన్‌జీ ధరలు పెరిగితే నాఫ్తా, తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలకు డిమాండ్‌ పెరిగి ఎల్‌ఎన్‌జీకి డిమాండ్‌ తగ్గడం,  దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి పెరిగితే, ఎల్‌ఎన్‌జీ దిగుమతులు తగ్గి, పీఎల్‌ఎన్‌జీ అమ్మకాలు తగ్గడం... ఇవన్నీ ప్రతికూలాంశాలు.

బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌  ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.529   ;   టార్గెట్‌ ధర: రూ.650


ఎందుకంటే: 2015 ఏప్రిల్‌లో ఈ షేర్‌ రూ.1,200 గరిష్ట స్థాయిలో ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్‌ ధర 50% వరకూ తగ్గింది. హలోల్‌ ఇతర ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు ప్రతికూల ప్రభావం చూపడం, కొన్ని కీలకమైన ఔషధాలకు పోటీ పెరగడం, కొత్త ఔషధ ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం పరిమితంగా ఉండడం.. తదితర అంశాల కారణంగా కంపెనీ షేర్‌ ధర బాగా తగ్గిపోయింది. అయితే అమెరికా మార్కెట్లో కంపెనీ విక్రయిస్తున్న ఔషధాల విలువను, నిలకడగా వృద్ధి చెందుతున్న, నగదు నిల్వలను అందిస్తున్న దేశీయ వ్యాపార విలువను..  ప్రస్తుత షేర్‌ ధర ప్రతిబింబించడం లేదని చెప్పవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రికవరీ ప్రారంభమవుతుందని భావిస్తున్నాం. హలాల్‌ ప్లాంట్‌పై ప్రతికూల ప్రభావం తగ్గడం,  స్పెషాల్టీ ఫార్మా విభాగంలో రెండు కొత్త ఔషధాలను మార్కెట్లోకి తేనుండడం, దీనికి కారణం కానున్నాయి.  అమెరికాలో జనరిక్స్‌ వ్యాపార విభాగం కంటే ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగం మంచి వృద్ధి సాధిస్తోంది. పోటీ పెరుగుతుండడంతో జనరిక్స్‌  వ్యాపార వృద్ధి భవిష్యత్తులో చెప్పుకోదగిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నాం. అందుకని ప్రత్యేక ఔషధ వ్యాపార విభాగంపై దృష్టి సారించే కంపెనీల వృద్ధి జోరుగా ఉండనున్నది. ఇక సన్‌ ఫార్మా  ప్రత్యేక ఔషధ విభాగం 2019–20లో బ్రేక్‌ఈవెన్‌కు వస్తుందని అంచనా.  ర్యాన్‌బాక్సీ విలీనంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీకి 10 కోట్ల డాలర్ల మేర ఇబిటా ప్రయోజనాలు రావచ్చు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కం పెనీ నగదు నిల్వలు 150 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ కంపెనీ ఏడాదికి 70 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్‌ఫ్లోస్‌ను సాధిస్తోంది. ప్రత్యేక ఫార్మా వ్యాపారంపై 2–3 ఏళ్లుగా చేస్తున్న వ్యూహాత్మక పెట్టుబడులు, దేశీ మార్కెట్‌లో నిలకడైన వృద్ధి, అమెరికాలో కాంప్లెక్స్‌ జనరిక్స్‌పై దృష్టి సారించడం కంపెనీకి కలిసొచ్చే అంశాలు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement