ఎఫ్‌డీల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు మారమంటారా? | will we change from FD to mutual funds? | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు మారమంటారా?

Published Mon, Aug 3 2015 1:09 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఎఫ్‌డీల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు మారమంటారా? - Sakshi

ఎఫ్‌డీల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు మారమంటారా?

కొంత సొమ్మును బ్యాంక్‌లో  ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఇన్వెస్ట్ చేశాను. ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రాబడులు వస్తాయని మిత్రులు చెబితే ఇటీవలే ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను విత్‌డ్రా చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాను. మిగిలిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చమంటారా ? లేకుంటే వాటిని అలాగే కొనసాగించమంటారా? ఒక వేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే అయితే  ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి?     
    - అభిమన్యు, విశాఖపట్టణం

 ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీకు ఐదేళ్లలోపు అవసరమైన పక్షంలో, లేదా నిర్దేశిత మొత్తంలో రాబడులు ఆశించినప్పుడు మాత్రమే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనే కొనసాగించవచ్చు. ఐదేళ్లలోపు నిర్దేశిత రాబడులు కావాలనుకుంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్ వద్దనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐదేళ్లలోపు మీకు డబ్బులు అవసరం లేనిపక్షంలో, కొంత రిస్క్ భరించగలిగేటట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, ముం దుగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ వంటి రిస్క్ తక్కువగా ఉండే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేయండి.  

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్ వంటి ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఎంత శాతం ఇన్వెస్ట్ చేస్తారు? డైనమిక్ బాండ్ ఫండ్స్‌లో డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఎంత శాతమైతే ఇన్వెస్ట్ చేస్తారో అంతే మొత్తం ఈ బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలా కాకుండా డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్పెషలైజ్‌డ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా?
 - శ్రీలత, హైదరాబాద్

 ఈక్విటీ ఆధారిత బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవి బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ అయినప్పటికీ, ఎక్కువగా లార్జ్ క్యాప్ లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై ప్రధానంగా దృష్టి సారించే ఫండ్స్ కూడా ఉన్నాయి. కేవలం డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పైననే ప్రత్యేకంగా దృష్టిసారించే స్పెషలైజ్‌డ్ ఫండ్స్ ఏమీ లేవు. మార్కెట్లు పతన బాటలో ఉన్నప్పుడు ఫండ్ పనితీరు మెరుగైన విధంగా ఉండటానికి  డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.

 నేనొక ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. నా వయస్సు 29 సంవత్సరాలు. గత మూడేళ్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. బిర్లా ఫ్రంట్‌లైన్ ఈక్విటీ(డివిడెండ్ ప్లాన్)లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో రూ.2,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఆ తర్వాత రెలిగేర్ ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్‌లో రూ.1,000 చొప్పున సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాను.ఇటీవలనే ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్‌లో సిప్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.2.75 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. నెలకు రూ.8,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. నేను 55 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాను. రిటైరయ్యేనాటికి రూ. 3 కోట్ల నిధిని ఏర్పాటు చేయడం నా లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్నవి సరిపోతాయా? ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచమంటారా?
- విజయ్, ఈ-మెయిల్

 రిటైరయ్యేనాటికి రూ.3 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోవడం అభినందనీయమే. అయితే ఏ ప్రాతిపదికన రూ.3 కోట్ల లక్ష్యం నిర్దేశించుకున్నారో వివరించలేదు. ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నారని భావిస్తున్నాం. ఇక మీ పెట్టుబడి ప్రణాళిక విషయానికొద్దాం. ప్రతి నెలా రూ.8,000 చొప్పున 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ఏడాదికి 12%రాబడి అంచనాలతో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తం విలువ రూ.  రూ.1.52 కోట్లవుతుంది. ప్రస్తుతమున్న మీ రూ.2.75 లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్ అదే కాలానికి రూ.46.75 లక్షలవుతాయి.

వీటిని కూడా కలుపుకుంటే మీరు రిటైరయ్యేనాటికి రూ.1.99 కోట్ల నిధి తయారవుతుంది. ఒక వేళ ఏడాది రాబడులు 15% ఉంటాయనుకుంటే, 25ఏళ్లకు మీ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ రూ.3.53 కోట్లవుతుంది. సాధారణ పరిస్థితుల్లో చూస్తే మీరు ఇప్పుడు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌తో మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. అందుకని మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొత్తాన్ని కొంత పెంచండి. నెలవారీ బడ్జెట్‌ను తయారు చేసుకోండి. దేనికెంత ఖర్చు చేస్తున్నారో, రాసుకోండి.  ఖర్చుల్లో ఏవైనా తగ్గించుకోలరేమో చూడండి. మీ జీతం లో కనీసం 30-40% వరకూ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి.

 రిటైర్మెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. దీంట్లో డివిడెండ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయమంటారా? లేక గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌చేయాలా?         
- అజయ్, ఈ-మెయిల్

 భవిష్యత్‌లో రిటైరవుతున్నట్లయితే బ్యాలెన్స్‌డ్ ఫండ్ గ్రోత్ ఆప్షన్‌లో ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒకవేళ మీరు ఇప్పటికే రిటైరై ఉంటే మీ ఆర్థిక అవసరాలను బట్టి గ్రోత్ ప్లాన్‌నో, డివిడెండ్ ప్లాన్‌నో ఎంచుకోవాలి. నెలవారీ కొంత సొమ్ము కోసం లేదా వార్షికంగా కొంత రాబడి కోసం బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై నిర్దేశిత కాలానికి కొంత సొమ్ము రావాలనుకునే పక్షంలో డివిడెండ్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement