ఎస్టీపీపై పన్నులు ఎలా..? | dheerendra kumar special story on finace advice | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపై పన్నులు ఎలా..?

Published Mon, Dec 5 2016 2:32 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

ఎస్టీపీపై పన్నులు ఎలా..? - Sakshi

ఎస్టీపీపై పన్నులు ఎలా..?

నేను గతంలో బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్  చేసిన కొంత మొత్తం మరో రెండు నెలల్లో  మెచ్యూరై  చేతికొస్తుంది. మరో ఆరేళ్ల దాకా నాకు  ఈ సొమ్ముతో అవసరం లేదు. వీటిని మ్యూచువల్  ఫండ్‌‌సలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఏ తరహా మ్యూచువల్  ఫండ్‌‌సల్లో ఇన్వెస్ట్  చేస్తే మంచి రాబడులు వస్తాయో తగిన సూచనలివ్వండి ? - సారథి, హైదరాబాద్

ఆరేళ్ల పాటు మీకు డబ్బులు అవసరం ఉండదు కనుక. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌సను పరిశీలించవచ్చు. ఐదేళ్లు అంతకు మించిన కాలానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌‌స మంచి రాబడులనిస్తారుు. స్వల్పకాలంలో ఈ ఫండ్‌‌స రాబడుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను పొందవచ్చు. మీకు మ్యూచువల్ ఫండ్‌‌సల్లో ఇన్వెస్ట్ చేయడం కొత్త అరుుతే, 2-3 బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సను ఎంచుకోండి.

ఒకవేళ మీరు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లరుుతే, ఈక్విటీ లింక్డ్  సేవింగ్‌‌స స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి ప్రకారం, మీకు రూ.1.5 లక్షల వరకూ పన్ను ప్రయోజనాలు లభిస్తారుు. యాక్సిస్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్  షీల్డ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్యాక్స్ ప్లాన్, కెనరా రొబెకొ ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్, రెలిగేర్ ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్‌లను పరిశీలించవచ్చు.

నాకు డెట్ ఫండ్‌లో కొన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నారుు. వీటిని సిస్టమాటిక్ ట్రాన్‌‌సఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా వేరే ఫండ్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ డెట్‌ఫండ్‌‌స ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎస్‌టీపీ ద్వారా వేరే ఫండ్‌లోకి మార్చుకుంటే నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? - జాన్సన్, గుంటూరు

సిస్టమాటిక్ ట్రాన్‌‌సఫర్ ప్లాన్(ఎస్‌టీపీ) ద్వారా ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్  ఫండ్‌లోకి యూనిట్లను బదిలీ చేయడాన్ని-మ్యూచువల్  ఫండ్ నుంచి వైదొలగడం, మరో మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేయడంగా పరిగణిస్తారు. మూడేళ్లలోపు  డెట్ ఫండ్‌నుంచి యూనిట్లను వేరే ఫండ్‌లోకి ఎస్‌టీపీ ద్వారా బదిలీ చేస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీరు పొందిన లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

నా మైనర్ కూతురి పేరు మీద ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్-పబ్లిక్  ప్రావిడెండ్ ఫండ్) ఖాతా తెరిచాను. ఇది మెచ్యూరయ్యే నాటికి నా కూతురు ఇంకా మైనరే. ఈ ఖాతాను ఐదేళ్ల పాటు పొడిగించాను. ఇది 2019లో మెచ్యూర్ అవుతుంది. నా కూతురికి ఇప్పుడు 18 సంవత్సరాలు నిండారుు. ఇప్పుడు ఈ మైనారిటీ ఖాతా మేజర్ ఖాతాగా ఆటోమేటిక్‌గా మారుతుందా? లేదా ఇలా మార్చుకోవడానికి నేను ఏమైనా చేయాలా? దీని కోసం ఏఏ డాక్యుమెంట్లు నేను సమర్పించాలి. దీనికి సంబంధించిన పన్ను వివరాలు ఎలా ఉంటారుు?   
- కిరణ్, వరంగల్

పిల్లల పేరు మీద పీపీఎఫ్ ఖాతా తీసుకున్నట్లరుుతే, పిల్లలకు 18 సంవత్సరాలు (మేజర్ అరుున తర్వాత) నిండిన తర్వాతే మెచ్యుర్ అరుుతే, ఈ ఖాతా ఆమెనే నిర్వహించాల్సి ఉంటుంది. సంరక్షకుడి అవసరం ఉండదు. మీ పాప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను మీరు మీ పాప పీపీఎఫ్ ఖాతా ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాపై సర్వ హక్కులు ఆమెకు ఉంటారుు. ఈ ఖాతాలో ఉన్న మొత్తం మీ పాప ఆదాయం అవుతుంది. పీపీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తాలు, వాటిపై వచ్చే రాబడులపై ఎలాంటి పన్నులు ఉండవు.

 నేను గత కొంత కాలంగా 2-3 బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. వీటి రాబడులపై పన్నులు ఎలా ఉంటారుు? స్వల్పకాలిక, దీర్ఘకాలిక రాబడులపై ఎంతెంత పన్నులు చెల్లించాల్సి ఉంటుంది? తెలపండి. - రషీద్, విజయవాడ

బ్యాలెన్‌‌సడ్ లేదా హైబ్రిడ్ ఫండ్‌‌స... డెట్, ఈక్విటీల్లో కలిపి ఇన్వెస్ట్  చేస్తారుు. ఈక్విటీలో ఎంత శాతం పెట్టుబడులు పెడతాయనే విషయాన్ని బట్టి ఈ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సను ఈక్విటీ ఓరియంటెడ్,  డెట్ ఓరియంటెడ్ ఫండ్‌‌సగా వర్గీకరిస్తారు. ఈక్విటీల్లో కనీసం 65 శాతం పెట్టుబడులు ఉంటే, దీనిని ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌గా పరిగణిస్తారు. అలాగే ఈక్విటీల్లో పెట్టుబడులు 65 శాతం లోపు ఉంటే, దానిని డెట్ ఓరియంటెట్ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌గా పరిగణిస్తారు. ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్‌‌సడ్  ఫండ్‌‌స యూనిట్లను ఏడాది తర్వాత విక్రరుుస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

ఈక్విటీ ఓరియంటెడ్ బ్యాలెన్‌‌సడ్ ఫండ్‌‌సపై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులు ఉండవు. ఈ ఫండ్  యూనిట్లను ఏడాదిలోపు విక్రరుుస్తే వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  డెట్ ఓరియంటెడ్ బ్యాలెన్‌‌సడ్  ఫండ్‌‌స యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రరుుస్తే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఇండేక్సేషన్ ప్రయోజనాలు లేకుంటే 10 శాతం, ఇండేక్సేషన్ ప్రయోజనాలతో అరుుతే 20 శాతంగా పన్ను ఉంటుంది. ఈ ఫండ్  యూనిట్లను మూడేళ్ల లోపు  విక్రరుుస్తే వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement