సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్ | Hyderabad cyber crime police arrested one petrol bunk staff | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదు.. ఒకరి అరెస్ట్

Published Wed, Feb 8 2017 9:47 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

Hyderabad cyber crime police arrested one petrol bunk staff

హైదరాబాద్: పెట్రోల్ బంక్ సిబ్బంది తెలివి మీరిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ వద్దకు వచ్చే కస్టమర్లు పేమెంట్ కోసం కార్డులు ఇస్తే డాటా తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైదాబాద్ లోని పెట్రోల్ బంక్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బంక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హేమంత్ నాగ్ పెట్రోల్‌ పోయించుకున్నారు.

మనీ పేమెంట్ కోసం ఐసీఐసీసీ క్రెడిట్ కార్డు ఇచ్చారు. బంక్‌లో పనిచేసే కైసర్ ఖాన్ ఇంజినీర్ ఇచ్చిన కార్డు డాటాను తస్కరించాడు. కార్డు డాటాతో మోసాలకు పాల్పడుతున్నారని హేమంత్ నాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బంక్ లో పనిచేసే కైసర్ ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement