
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది.
టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్‌లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment