Insurance Service
-
ఇకపై ‘టెలిగ్రామ్’ లో ఇన్సూరెన్స్ సేవల గురించి తెలుసుకోండి
ముంబై: సాధారణ బీమా పరిశ్రమలో తొలిసారిగా ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ తన పాలసీదారులకు ‘టెలిగ్రామ్’ యూప్ వేదికగా సేవలను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ యూజర్లు పెద్ద ఎత్తున పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్టు తెలిపింది. టెలిగ్రామ్‌పై చాట్‌బాట్ సాయంతో మోటారు క్లెయిమ్ నమోదు చేయడంతోపాటు.. పురోగతి తెలుసుకోవచ్చని.. బీమా పాలసీ రెన్యువల్, పాలసీ డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వివరాల్లో మార్పుల కోసం అభ్యర్థనలు పంపొచ్చని సంస్థ సూచించింది. అదే సమయంలో వాట్సాప్‌పై మరిన్ని సేవలను తీసుకొచ్చినట్టు ప్రకటించింది. క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్ల అప్లోడ్, తక్షణ విచారణల సదుపాయాలు కల్పించినట్టు తెలిపింది. -
ఐసీఐసీఐ లంబార్డ్ ప్రీమియం ఆదాయం 32% జంప్
ముంబై: ప్రైవేట్ రంగ అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్ గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబర్చింది. కంపెనీ స్థూల దేశీ ప్రీమియం ఆదాయం 32.6 శాతం వృద్ధితో రూ.10,725 కోట్లకు పెరిగింది. దీంతో రూ.10,000కు పైగా స్థూల దేశీ ప్రీమియం ఆదాయం సాధించిన తొలి కంపెనీగా ఐసీఐసీఐ లంబార్డ్ చరిత్ర సృష్టించింది. ఇక కంపెనీ నికర లాభం 38.3 శాతం వృద్ధితో రూ.701 కోట్లకు పెరిగింది. ‘2016–17 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరును ప్రదర్శించాం. ఇక రానున్న రోజుల్లో కూడా మా ఇన్సూరెన్స్ సేవలను మరింత విస్తరిస్తాం. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఎప్పుడూ ముందుంటాం’ అని ఐసీఐసీఐ లంబార్డ్ ఎండీ, సీఈవో భార్గవ్ దాస్‌గుప్తా తెలిపారు.