ఐసీఐసీఐ లంబార్డ్‌ ప్రీమియం ఆదాయం 32% జంప్‌ | ICICI Lombard net grows 38% at Rs 702 crore in 2016-17 | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ లంబార్డ్‌ ప్రీమియం ఆదాయం 32% జంప్‌

Published Sat, Apr 22 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఐసీఐసీఐ లంబార్డ్‌ ప్రీమియం ఆదాయం 32% జంప్‌

ఐసీఐసీఐ లంబార్డ్‌ ప్రీమియం ఆదాయం 32% జంప్‌

ముంబై: ప్రైవేట్‌ రంగ అతిపెద్ద జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐసీఐసీఐ లంబార్డ్‌ గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబర్చింది. కంపెనీ స్థూల దేశీ ప్రీమియం ఆదాయం 32.6 శాతం వృద్ధితో రూ.10,725 కోట్లకు పెరిగింది. దీంతో రూ.10,000కు పైగా స్థూల దేశీ ప్రీమియం ఆదాయం సాధించిన తొలి కంపెనీగా ఐసీఐసీఐ లంబార్డ్‌ చరిత్ర సృష్టించింది.

ఇక కంపెనీ నికర లాభం 38.3 శాతం వృద్ధితో రూ.701 కోట్లకు పెరిగింది. ‘2016–17 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరును ప్రదర్శించాం. ఇక రానున్న రోజుల్లో కూడా మా ఇన్సూరెన్స్‌ సేవలను మరింత విస్తరిస్తాం. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఎప్పుడూ ముందుంటాం’ అని ఐసీఐసీఐ లంబార్డ్‌ ఎండీ, సీఈవో భార్గవ్‌ దాస్‌గుప్తా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement