లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
Published Mon, Oct 17 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం ట్రేడింగ్లో లాభాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్ల ర్యాలీ జరిపిన సెన్సెక్స్ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఆటో షేర్ల నష్టాలతో ప్రస్తుతం 62.74 పాయింట్ల లాభంతో 27,736 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 8600 మార్కును బీట్ చేసి మళ్లీ కిందకు దిగొచ్చింది. 5.40 స్వల్పలాభంతో 8,588 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 17 పాయింట్ల లాభాలతో మొదలై, అనంతరం 27,803 వద్ద గరిష్టస్థాయిని, 27,681.59 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది.
మెటల్, ఆటో, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నిఫ్టీలో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ,. గెయిల్ షేర్లు సెన్సెక్స్ లో లాభాల్లో నడుస్తున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసల నష్టంతో 66.80గా ప్రారంభమైంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి, ఎఫ్ఐఐల అవుట్ప్లోతో రూపాయి విలువ నేటి ట్రేడింగ్లో కొంత పడిపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 66.60 నుంచి 67 మధ్యలో కదలాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఇతర మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ ఏడు నెలల గరిష్టంలో నమోదవుతుండటంతో ఆసియన్ షేర్లు పడిపోతున్నాయి.
Advertisement
Advertisement