ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి వైదొలగిన రెండు మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు | will be difficult to compete with existing giants | Sakshi
Sakshi News home page

ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి వైదొలగిన రెండు మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు

Published Fri, Mar 18 2016 1:15 AM | Last Updated on Wed, Sep 19 2018 8:44 PM

ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి వైదొలగిన రెండు మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు - Sakshi

ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి వైదొలగిన రెండు మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు

ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఐసీఐసీఐ సెక్యూరిటీస్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ఫీబీమ్ ఐపీఓ నుంచి మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌లు వైదొలిగాయి. వచ్చే వారం ఇన్పీబీమ్ ఐపీఓ మార్కెట్‌కు రానున్నది. అయితే ఈ రెండు సంస్థలు వైదొలగడానికి కారణాలను ఇన్ఫీబీమ్ వెల్లడించలేదు. ఐపీఓకు వస్తున్న సమయం, ధర వంటి విషయాల్లో వచ్చిన తేడాల వల్ల ఈ రెండు సంస్థలు నిష్ర్కమిస్తున్నాయని సమాచారం. భారత్‌లో ఐపీఓకు వస్తున్న తొలి ఈ కామర్స్ కంపెనీ ఇది. మార్చి 21 నుంచి ప్రారంభమై 23న ముగిసే  ఈ ఐపీఓ ద్వారా రూ.450 కోట్లకు సమీకరించాలని ఇన్ఫీబీమ్ యోచిస్తోంది. ఈ ఐపీఓకు రూ.360-432 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది.  ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్‌లు వైదొలగడంతో ఇక ఇప్పుడు ఈ ఐపీఓకు ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఇలర క్యాపిటల్ ఇండియాలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement