ఇక చౌక గృహ రుణాలు..! | HDFC, ICICI Bank cut home loan rate by 0.15% | Sakshi
Sakshi News home page

ఇక చౌక గృహ రుణాలు..!

Published Fri, Nov 4 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

ఇక చౌక గృహ రుణాలు..!

ఇక చౌక గృహ రుణాలు..!

పండగల వేళ దిగొస్తున్న బ్యాంకులు
కొత్త రుణ గ్రహీతలకు 0.15% తగ్గింపు
ఎస్‌బీఐ బాటలోనే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ
ఇతర బ్యాంకులూ వరసకట్టే అవకాశం! 

న్యూఢిల్లీ: దసరా.. దీపావళి... మరో రెండు నెలల్లో సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో గృహ రుణాలు దిగొస్తున్నారుు. రుణ గ్రహీతలను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారుు. రూ.75 లక్షలు దాటని గృహ రుణాలపై వడ్డీని 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించటంతో... 24 గంటలు కూడా గడవక ముందే తామూ అదే బాటలో నడుస్తున్నట్లు ప్రరుువేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించారుు. కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి వడ్డీ రేట్లు 15 శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ గురువారం ప్రకటించింది.

దీని ప్రకారం రూ.75 లక్షల వరకూ మహిళలకు గృహ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. ఇంతకుముందు ఈ రేటు 9.30 శాతంగా ఉంది. ఇక ఉద్యోగులకిచ్చే రేటు 9.35 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. తాజా రేటు నవంబర్ 2 నుంచీ అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలియజేసింది. బుధవారమే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్‌‌స (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణరేటు 10 బేసిస్ పారుుంట్లు (0.10 శాతం) తగ్గిస్తూ ఐసీఐసీఐ ప్రకటన చేసింది. అక్టోబర్ 4న ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన తర్వాత, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రేటును తగ్గించడం ఇది మూడవసారి. దీనికితోడు ఐసీఐసీఐ.. వేతన అకౌంట్ హోల్డర్లకు ‘ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ ఓవర్‌డ్రాఫ్ట్’ పేరిట కొత్త పథకాన్ని కూడా ఆరంభించింది. టర్మ్ లోన్‌తోపాటు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఈ ప్రొడక్ట్ ప్రత్యేకత.

హెచ్‌డీఎఫ్‌సీదీ అదే దారి...
హౌసింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కూడా తన గృహ రుణ రేట్లను 0.15 శాతం తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రూ.75 లక్షల లోపు గృహ రుణాలకే ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం తాజా రేట్లు అందరికీ 9.20 శాతంగా, మహిళలకు 9.15 శాతంగా ఉంటారుు.

ఎస్‌బీఐ రేటు కాస్త తక్కువ...
రూ.75 లక్షలు దాటని గృహ రుణాలకు వడ్డీ రేటును 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారమే ఎస్‌బీఐ ప్రకటించింది. దీని ప్రకారం ఈ రుణ రేటు 9.15 శాతంగా ఉంటుంది. మహిళలకు 9.10 శాతమే ఉంటుంది. కాగా బ్యాంకింగ్ దిగ్గజాలన్నీ గృహ రుణాలపై రేట్లు తగ్గించడంతో ఇతర బ్యాంకులపై సైతం ఈ ప్రభావం పడుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పొరేట్ రంగం నుంచి క్రెడిట్ డిమాండ్ తగ్గడంతో రిటైల్ రుణ మంజూరు ద్వారా రుణ వృద్ధికి  బ్యాంకులు వ్యూహ రచన చేస్తున్నారుు. అక్టోబర్ 4 రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ సమీక్ష తరువాత, పలు బ్యాంకులు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్‌‌స (ఎంసీఎల్‌ఆర్) ఆధారిత రుణరేటు తగ్గించటం తెలిసిందే.

అక్టోబర్ 4 తరువాత వివిధ బ్యాంకుల ఎంసీఎల్‌ఆర్ రేట్లు..
ఆర్‌బీఐ పాలసీ రేటు ప్రకటించాక ఇప్పటిదాకా పలు బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును (ఎంసీఎల్‌ఆర్) తగ్గించారుు. దాని ప్రకారం వివిధ బ్యాంకుల ఎంసీఎల్‌ఆర్ ఎలా ఉందంటే...

ఆంధ్రా బ్యాంకు బేస్ రేటును, బీఎంపీఎల్‌ఆర్ ను 5 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో బేస్ రేటు 9.70 శాతానికి, బీఎంపీఎల్‌ఆర్ 13.95 శాతానికి తగ్గింది. ఏడాది వ్యవధి రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పారుుంట్లు తగ్గించింది. దీంతో ఇది 9.55 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓవర్‌నైట్ కాలపరిమితి విషయంలో రేటు 0.05 శాతం తగ్గి 9 శాతానికి చేరింది. మూడు నెలల కాలానికి 9.15 శాతానికి, ఏడాది కాలానికి 9.25 శాతానికి, మూడేళ్లకు 9.40 శాతానికి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement