
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో పేలవంగా లిస్టయ్యాయి. ఇష్యూ ధర, రూ.520తో పోలిస్తే బుధవారం 17 శాతం నష్టంతో రూ.431 వద్ద బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్ రూ.431, రూ.463 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 14.4 శాతం నష్టంతో రూ.445 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 13.15 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 74.17 లక్షలు చొప్పున షేర్లు ట్రేడయ్యాయి.
మార్కెట్ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,337 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓకు హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కంపెనీ ఐపీఓ 86 శాతమే సబ్‌స్క్రైబయింది. దీంతో కంపెనీ రూ.4,000 కోట్ల లక్ష్యానికి గాను, రూ.3,515 కోట్ల నిధులను మాత్రమే సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment