బడ్జెట్ రోజు దాదాపు చాలా షేర్లు పెరిగాయి. అలా పెరిగిన చాలా షేర్లలో ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది.
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.426
టార్గెట్ ధర: రూ.510
ఎందుకంటే: బడ్జెట్ రోజు దాదాపు చాలా షేర్లు పెరిగాయి. అలా పెరిగిన చాలా షేర్లలో ఆ తర్వాత లాభాల స్వీకరణ జరిగింది. కానీ బడ్జెట్ రోజు పెరిగినదానికంటే కూడా ప్రస్తుతం అధిక ధర ఉన్న కొన్ని షేర్లలో టాటా కమ్యూనికేషన్స్ ఒకటి. టెలి కమ్యూనికేషన్స్‌లో ఉన్న మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీల్లో ఇదొకటి. 2,10,000 కి.మీ సబ్‌మెరైన్(సముద్రాంతర్భాగ) నెట్‌వర్క్ ఉంది. పది లక్షల చదరపు కిమీ. డేటా సెంటర్ స్పేస్‌తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ఇంటర్నెట్ ప్రోటొకాల్(ఐపీ) నెట్‌వర్క్‌లో ఈ కంపెనీ మార్కెట్ వాటా 10 శాతంగా ఉంది. అలాగే అంతర్జాతీయ హోల్‌సేల్ వాయిస్ ట్రాఫిక్‌లో 19 శాతం వాటా ఉంది. భారత డేటా సెంటర్ మార్కెట్లో నాలుగో వంతు ఈ కంపెనీదే. ఇటీవలనే ఇండోనేషియాకు చెందిన టెలికాం దిగ్గజ కంపెనీ ఇండోశాట్‌తో ఒప్పందం కుదర్చుకుంది. ఇండోనేషియాలోని కంపెనీలకు కమ్యూనికేషన్ సొల్యూషన్స్ అందించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందం టాటా కమ్యూనికేషన్స్‌కు ప్రయోజనం కలిగించనున్నది. రెండేళ్లలో నికర అమ్మకాలు 6 శాతం, ఇబిటా 18 శాతం, నికర లాభం 129 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.
సియారామ్ సిల్క్‌మిల్స్
బోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.899
టార్గెట్ ధర: రూ.1,102
ఎందుకంటే: కొత్త బ్రాండ్లు, కొత్త సెగ్మెంట్లోకి ప్రవేశం కారణంగా అమ్మకాలు పుంజుకుంటున్నాయి. కంపెనీ ఇటీవలనే ప్రవేశపెట్టిన జెనిసిస్, మెరెట్టి(ఈ రెండు ప్రీమియం కాటన్ బ్రాండ్స్)కు మంచి స్పందన లభిస్తోంది. అలాగే మహిళల దుస్తుల రంగంలోకి కూడా ప్రవేశించింది. అధిక వృద్ధికి అవకాశాలున్న కాటన్ షర్టింగ్, లినన్ ఫ్యాబ్రిక్స్‌ల్లో అడుగిడుతోంది. అధిక లాభాలుండే రెడీమేడ్ దుస్తుల విభాగంలో మార్కెట్ వాటా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. 2014 మార్చి 31 నాటికి రెడీమేడ్ దుస్తుల విభాగం నుంచి వచ్చే ఆదాయం కంపెనీ మొత్తం ఆదాయంలో 15 శాతంగా ఉంది. మూడేళ్లలో ఈ మార్కెట్ వాటా 17.4 శాతానికి పెరుగుతుందని అంచనా. దీంతో 2017 నాటికి ఇబిటా మార్జిన్లు 12 శాతానికి పెరుగుతాయి. ముడి పదార్ధాల ధరలు తగ్గడం, విభిన్నమైన సెగ్మెంట్లలో ఉత్పత్తులనందించడం వంటి కారణాల వల్ల కూడా మార్జిన్లు మెరుగుపడతాయి. 2014లో 0.7 గా ఉన్న రుణ, ఈక్విటీ నిష్పత్తి 2017 నాటికి 0.3కు తగ్గుతుందని భావిస్తున్నాం. పుష్కలంగా నగదు నిల్వలున్న ఈ కంపెనీ నికర లాభం 22 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో రూ.115 కోట్లకు పెరుగుతుందని అంచనా. 2017 మార్చి 31 నాటికి కంపెనీ ఆదాయం 12.5 శాతం చొప్పున చక్రగతిన వృద్ధితో రూ.1,855 కోట్లకు చేరుతుం దని భావిస్తున్నాం.