దసరా.. దీపావళి... మరో రెండు నెలల్లో సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో గృహ రుణాలు దిగొస్తున్నారుు. రుణ గ్రహీతలను ఆకర్షించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారుు. రూ.75 లక్షలు దాటని గృహ రుణాలపై వడ్డీని 0.15 శాతం తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించటంతో... 24 గంటలు కూడా గడవక ముందే తామూ అదే బాటలో నడుస్తున్నట్లు ప్రరుువేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించారుు. కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి వడ్డీ రేట్లు 15 శాతం తగ్గిస్తున్నట్లు ఐసీఐసీఐ గురువారం ప్రకటించింది.