
ప్రతీకాత్మక చిత్రం
బెంగుళూరు: కర్ణాటక నిధుల మళ్లింపు కేసులో సిట్ కీలక పురోగతి సాధించింది. హైదరాబాద్‌లో ఫస్ట్ క్రెడిట్ సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలి నిధుల మళ్లింపు కేసులో సిట్ విచారణ చేస్తోంది.
127 కోట్ల రూపాయల మహర్షి వాల్మీకి నిధులను ఫస్ట్ క్రెడిట్ సహకార సంస్థకు కర్ణాటక అధికారులు బదిలీ చేశారు. 60 కోట్ల రూపాయల నిధులను ఫస్ట్ క్రెడిట్ సంస్థకి బదిలీ చేసి కర్ణాటక అధికారులు డ్రా చేసుకున్నారు. వాల్మీకి మండలి సభ్యులు చంద్రశేఖర్ ఆత్మహత్యతో స్కాం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణను అరెస్టు చేసిన సిట్ బృందం బెంగుళూరుకు తీసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment