ఫ్యూయల్‌ సెల్‌ పరీక్ష సక్సెస్‌: ఇస్రో | ISRO successfully tests Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58 orbital platform POEM3 | Sakshi
Sakshi News home page

ఫ్యూయల్‌ సెల్‌ పరీక్ష సక్సెస్‌: ఇస్రో

Published Sat, Jan 6 2024 5:21 AM | Last Updated on Sat, Jan 6 2024 5:21 AM

ISRO successfully tests Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58 orbital platform POEM3 - Sakshi

బెంగళూరు/హైదరాబాద్‌: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్‌ సెల్‌ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్‌సీపీఎస్‌)లోని పాలీమర్‌ ఎలక్ట్రోలైట్‌ మెంబ్రేన్‌ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది.

సంప్రదాయ బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే ఈ ఫ్యూయల్‌ సెల్స్‌కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్‌పోశాట్‌ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement