
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్పకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలికను లైంగికంగా వేధించిన కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరారు.
అయితే తాను ఢిల్లీలో ఉండటం వల్ల విచారణకు రాలేకపోతున్నానని వచ్చిన వెంటనే హాజరవుతానని యడ్యూరప్ప పోలీసులకు సమాధానమిచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కూతురుతో కలిసి యడ్యూరప్పకు ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతరుపై అత్యాచారం చేశారని 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారంలో పోలీసులు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికేవ ఈ కేసులో యడ్యూరప్ప పోలీసుల ఎదుట విచారణకు మూడుసార్లు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment