హాజీపూర్ జిల్లా వాసులుగా గుర్తింపు
అక్కడి నుంచే బైక్ తెచి్చనట్లు నిర్ధారణ
గాలింపు కొనసాగిస్తున్న నగర పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు బిహార్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పార్కింగ్ నుంచి స్వా«దీనం చేసుకున్న ద్విచక్ర వాహనం ఈ కోణంలో కీలక ఆధారాలను అందించింది. ఆ ఇద్దరి వివరాలు సేకరించిన పోలీసులు ఆచూకీ కనిపెట్టడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. బీహార్‌లోని హాజీపూర్ జిల్లాకు చెందిన దుండగులు దాదాపు నెల రోజుల క్రితమే తెలంగాణ, కర్ణాటకల్లో పంజా విసరాలని భావించింది. దీంతో అక్కడే ఓ తుపాకీ, ఆరు తూటాలు ఖరీదు చేసుకుని బయలుదేరడానికి సిద్ధమైంది. దీనికోసం తమ స్నేహితుడి ద్వారా అతడి పరిచయస్తుడి ద్విచక్ర వాహనం తీసుకుంది.
దాని పైనే బయలుదేరిన ద్వయం దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించి నగరానికి చేరుకుంది. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్‌లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్‌ను ఎంజీబీఎస్ పార్కింగ్‌లో పెట్టింది. దాని నిర్వాహకులకు తప్పు పేరు, ఫోన్ నెంబర్ చెప్పింది. ఆపై ఆటోలో బయలుదేరి అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచి్చంది. ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్‌కు టిక్కెట్ బుక్ చేసుకున్నా తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగిపోయాయి. ఈ హత్యాయత్నం తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన నగర పోలీసులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపట్టారు.
దీంతో ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉన్న దుండగులు వినియోగించిన వాహనం పోలీసులకు లభించింది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు హాజీపూర్ జిల్లాకు చెందిన యజమాని, దాన్ని దుండగులకు అప్పగించిన స్నేహితుడిని గుర్తించారు. వీరిద్దరికీ దుండగులు వాహనం ఎందుకు అడుగుతున్నారో తెలియని, కేవలం తమకు ఉన్న పరిచయం నేపథ్యంలో కొన్నాళ్ల వినియోగించుకోవడానికి బైక్ కావాలి అంటే ఇచి్చనట్లు పోలీసులు నిర్థారించారు. ఇప్పటికీ పరారీలోనే ఉన్న ఇరువురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment