రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు విడుదల అయ్యాయి.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 200 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 120 కోట్లకు రాష్ట్ర వాటాగా రూ. 80 కోట్లను కలిపి మొత్తం రూ. 200 కోట్లు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను ప్రత్యేకంగా వినియోగిస్తారు.