
ముంబై: ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐక్యాప్ వెంచర్స్ (ఎస్‌వీఎల్) ఎంఎస్‌ఈ రంగానికి, అందుబాటు ధరల ఇళ్ల రంగానికి ఒక్కో ఫండ్‌ను ప్రారంభించింది. ఎస్‌ఎంఈ ఫండ్ ద్వారా రూ.400 కోట్లు, అందుబాటు ధరల ఇళ్ల ఫండ్ ద్వారా రూ.350 కోట్లు సమీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
‘‘ఎస్‌ఎంఈకి సంబంధించి రూ.400 కోట్ల ఫండ్ అన్నది ఈక్విటీ ఆధారితంగా ఉంటుంది. ఇందులో ఎస్‌బీఐ, ఎస్‌బీఐ క్యాప్/ ఎస్‌వీఎల్ యాంకర్ ఇన్వెస్టర్లుగా ఉంటాయి’’అని ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, సీఈవో వర్ష పురంధరే విలేకరులకు తెలిపారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 18– 22% మధ్య ఉంటుందని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment