న్యూఢిల్లీ: మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీ అప్రమేయ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 50 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.
ఐపీవో నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రధానంగా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, నిర్వహణ తదితర హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులను అందిస్తోంది.
చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా!
Comments
Please login to add a commentAdd a comment