![HDFC Group pledges Rs150 crore support to PM Cares Fund - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/2/HDFC.jpg.webp?itok=akAWbC5P)
సాక్షి, ముంబై: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ కరోనాపై పోరుకు సాయం చేసేందుకు నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రూ .150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్స్ ఫండ్)కి ఈ సాయాన్ని అందించనునున్నామని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ వంతు సాయంగా బాధితుల ఉపశమన, పునరావాస చర్యలకు మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది మనందరికీ అనిశ్చితమైన, కష్టమైన సమయం. కరోనాని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా సాయుధ పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఎనలేని సేవలందిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలన్నారు.
చదవండి : కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం
Comments
Please login to add a commentAdd a comment