స్టాక్ మార్కెట్ రంగంలో ఫండింగ్ మందగించిన ప్రస్తుత తరుణంలో ప్రముఖ వ్యాపార నిపుణులే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించి సంచలనానికి తెరతీశారు భారతదేశానికి చెందిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ క్రేషా గుప్తా.
క్రేషా గుప్తా వయసు 24 సంవత్సరాలు. ఐదేళ్లుగా ఆమె మార్కెట్ ట్రెండ్‌లను అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కోసం ఆమె రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించారు. భారతదేశపు అతి పిన్న వయస్కులైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా నిలిచారు.
ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్..
ఆమె ప్రారంభించిన ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగానికి సంబంధించినది కాదు. అయితే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లలో పెట్టుబడుల కోసం దీన్ని ప్రారంభించారు క్రేషా గుప్తా. దీంతో స్టార్టప్‌లపై దృష్టి సారించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా ఇన్వెస్టర్‌గా నిలిచారు. క్రేషా గుప్తా కంపెనీ పేరు చాణక్య ఆపర్చునిటీస్ ఫండ్ 1.
సెబీలో నమోదైన ఈ ఫండ్ కంపెనీ స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అవసరమైతే మరో రూ.100 కోట్ల నిధులు సమీకరిస్తుంది. అంటే ఇది గ్రీన్ ఇష్యూ ఫండ్. ఈ ఫండ్ లాభదాయకమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడి పెడుతుందని ఆమె మీడియాకు తెలిపారు. 25 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు, ఇందు కోసం అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్‌లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..
ఎవరీ క్రేషా గుప్తా?
అహ్మదాబాద్‌కు చెందిన క్రేషా గుప్తా 2019లో సీఏ పూర్తి చేశారు. అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ డిప్లొమా చదివారు. క్రేషా గుప్తా సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా. ఎప్పుడూ చదువులో చురుగ్గా ఉండే క్రేషాకు మంచి అకడమిక్ రికార్డు ఉంది.(ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు)
కార్పొరేట్, కన్సల్టింగ్ రంగాలలో ఫైనాన్స్, అకౌంట్స్, MIS, టాక్స్ అడ్వైజరీ వంటి విభాగాల్లో పనిచేసిన ఆమె ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ ట్రెజరీ టీమ్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియాతో తన కెరియర్‌ను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్న క్రేషా గుప్తాకు పెట్టుబడి అవకాశాలను గుర్తించడంలో, నష్టాలను తగ్గించడంలో విశేష నైపుణ్యం ఉంది. ట్రెండ్‌లైల్ ప్రకారం... 2023 మార్చి 31 నాటికి ఆమె 3 స్టాక్‌లను కలిగి ఉన్నారు. వీని నికర విలువ రూ. 6.9 కోట్లు.
విజయ రహస్యాలు అవే..
రూ. 100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించడం తనకు సరికొత్త అనుభవమని క్రేషా గుప్తా లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాశారు. ఫండ్ విషయంలో అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు తరచూ హెచ్చిరిస్తుంటారని, అయితే ఏళ్ల అనుభవం మాత్రమే ఎల్లప్పుడూ విజయాన్ని నిర్దేశించదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి నేర్చుకునే సుముఖత, కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉండటం, నేర్చుకునే అవకాశాలను వెతకడం, ప్రశ్నించేందుకు సంకోచించకపోవడం.. ఇవే ఇంత చిన్న వయస్సులో తన విజయానికి రహస్యాలని వివరించారు.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment