fund manager
-
ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయం!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా మందగమన ప్రభావాలు భారత ఎకానమీపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వు్యలో తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు .. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యుచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, అధిక రాబడులపై అవగాహన పెరుగుతున్న కొద్దీ గత పదేళ్లుగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చు. సిప్ల ధోరణి ఇదే సూచిస్తోంది. పొదుపు యోచన, దీర్ఘకాలికంగా సిప్ల ద్వారా సంపద సృష్టి మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గరిష్ట స్థాయుల్లో మార్కెట్లకు రిస్క్‌లు.. అధిక ద్రవ్యోల్బణం, ఖర్చులు చేయడం తగ్గుతుండటం వంటి ధోరణుల కారణంగా చాలా మటుకు సంపన్న మార్కెట్లలో మాంద్యం అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని గ్లోబల్ మార్కెట్లకు పొంచి ఉన్న చెప్పుకోతగ్గ రిస్క్ల్లో ఇది కూడా ఒకటి. అలాగే అంతర్జాతీయంగా మందగమనం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటమనేది మన దగ్గర కూడా అధిక ధరలు, ఎగుమతి ఆధారిత రంగాలు బలహీనపడటం రూపంలో భారత ఎకానమీపైనా ప్రభావం చూపవచ్చు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. వేల్యుయేషన్‌పరంగా దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే మన మార్కెట్లు కొంత ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే నిర్దిష్ట విభాగాలు, రంగాలు చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోల్చి చూస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ .. ప్రీమియం ధరలకు ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ ధోరణి నిలబడేది కాకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా లార్జ్ క్యాప్ ఆధారిత ఫండ్స్, అలాగే డెట్, ఈక్విటీ కలయికతో ఉండే ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌పై దృష్టి పెడితే శ్రేయస్కరం. సిప్‌లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సిప్‌లను కొనసాగించవచ్చు. సిప్ లేదా ఎస్టీపీ (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెట్టుబడులకు అనువైన రంగాలు.. పటిష్ట రుణ వృద్ధి, తక్కువ రుణ వ్యయాలతో ప్రైవేట్ రంగ బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభిస్తున్నాయి. కాబట్టి వాటిపై మేము సానుకూలంగా ఉన్నాం. అలాగే వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, వేల్యుయేషన్లు సముచితంగా ఉండటం వల్ల ఆటోమొబైల్స్‌పై కూడా బులి‹Ùగా ఉన్నాం. ఇక దూరంగా ఉండతగిన రంగాల విషయానికొస్తే .. అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్, అలాగే వేల్యుయేషన్లకు తగ్గట్లుగా లేని కన్జూమర్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్‌లపై సానుకూలంగా ఉన్నాం. అలాగే దీర్ఘకాలికంగా మెరుగైన చరిత్ర కలిగి, చౌకగా ట్రేడవుతున్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశావహంగా ఉన్నాయి. మా యూటీఐ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్, యూటీఐ అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్ల విషయానికొస్తే నాణ్యమైనవి స్టాక్స్, దీర్ఘకాలిక వేల్యుయేషన్ల కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న రంగాలవైపు మేము మొగ్గు చూపుతాం. మిడ్, స్మాల్ క్యాప్స్‌లోనూ సముచిత వేల్యుయేషన్లతో ట్రేడవుతూ వృద్ధి అవకాశాలు ఉన్నవి ఎంచుకుంటాం. -
రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె!
స్టాక్ మార్కెట్ రంగంలో ఫండింగ్ మందగించిన ప్రస్తుత తరుణంలో ప్రముఖ వ్యాపార నిపుణులే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించి సంచలనానికి తెరతీశారు భారతదేశానికి చెందిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ క్రేషా గుప్తా. క్రేషా గుప్తా వయసు 24 సంవత్సరాలు. ఐదేళ్లుగా ఆమె మార్కెట్ ట్రెండ్లను అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కోసం ఆమె రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించారు. భారతదేశపు అతి పిన్న వయస్కులైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా నిలిచారు. ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్.. ఆమె ప్రారంభించిన ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగానికి సంబంధించినది కాదు. అయితే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లలో పెట్టుబడుల కోసం దీన్ని ప్రారంభించారు క్రేషా గుప్తా. దీంతో స్టార్టప్‌లపై దృష్టి సారించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా ఇన్వెస్టర్‌గా నిలిచారు. క్రేషా గుప్తా కంపెనీ పేరు చాణక్య ఆపర్చునిటీస్ ఫండ్ 1. సెబీలో నమోదైన ఈ ఫండ్ కంపెనీ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అవసరమైతే మరో రూ.100 కోట్ల నిధులు సమీకరిస్తుంది. అంటే ఇది గ్రీన్ ఇష్యూ ఫండ్. ఈ ఫండ్ లాభదాయకమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడి పెడుతుందని ఆమె మీడియాకు తెలిపారు. 25 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు, ఇందు కోసం అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. ఎవరీ క్రేషా గుప్తా? అహ్మదాబాద్‌కు చెందిన క్రేషా గుప్తా 2019లో సీఏ పూర్తి చేశారు. అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ డిప్లొమా చదివారు. క్రేషా గుప్తా సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా. ఎప్పుడూ చదువులో చురుగ్గా ఉండే క్రేషాకు మంచి అకడమిక్ రికార్డు ఉంది.(ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) కార్పొరేట్, కన్సల్టింగ్ రంగాలలో ఫైనాన్స్, అకౌంట్స్, MIS, టాక్స్ అడ్వైజరీ వంటి విభాగాల్లో పనిచేసిన ఆమె ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ ట్రెజరీ టీమ్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియాతో తన కెరియర్ను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్న క్రేషా గుప్తాకు పెట్టుబడి అవకాశాలను గుర్తించడంలో, నష్టాలను తగ్గించడంలో విశేష నైపుణ్యం ఉంది. ట్రెండ్లైల్ ప్రకారం... 2023 మార్చి 31 నాటికి ఆమె 3 స్టాక్లను కలిగి ఉన్నారు. వీని నికర విలువ రూ. 6.9 కోట్లు. విజయ రహస్యాలు అవే.. రూ. 100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించడం తనకు సరికొత్త అనుభవమని క్రేషా గుప్తా లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. ఫండ్ విషయంలో అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు తరచూ హెచ్చిరిస్తుంటారని, అయితే ఏళ్ల అనుభవం మాత్రమే ఎల్లప్పుడూ విజయాన్ని నిర్దేశించదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి నేర్చుకునే సుముఖత, కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉండటం, నేర్చుకునే అవకాశాలను వెతకడం, ప్రశ్నించేందుకు సంకోచించకపోవడం.. ఇవే ఇంత చిన్న వయస్సులో తన విజయానికి రహస్యాలని వివరించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
ఈపీఎఫ్‌వో ఫండ్ మేనేజర్‌గా తప్పుకోనున్న ఎస్బీఐ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఫండ్ మేనేజర్‌గా ఎస్బీఐ సంస్థ మార్చి నుంచి తప్పుకోనుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఓ బ్యాంకు అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీగా వ్యవహరించడానికి వీల్లేదు. ‘‘ఫండ్ మేనేజర్‌గా పనిచేయడానికి లేదని ఎస్బీఐకి తెలియజేశాం. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌తో ఒప్పందం లేదు. గతంలో బిడ్డింగ్ వేసే నాటికి ఆ సంస్థ దరఖాస్తుదారుగా లేదు’’ అని కార్మిక శాఖా మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. మంగళవారం ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎస్బీఐకి మార్చి వరకు గడువు ఇచ్చామని, ఫండ్ మేనేజర్‌గా ఎవరిని నియమించుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చి తర్వాత ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తమను సంప్రదిస్తే ఫండ్ మేనేజర్‌గా నియమించుకుంటామని చెప్పారు. -
ఈపీఎఫ్ఓకు మరింత పవర్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు రంగంలోని 6 కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి పెట్టుబడులను నిర్వహిస్తున్న ఈపీఎఫ్‌వోకు... మిగిలిన సామాజిక భద్రతా పథకాల నిధుల నిర్వహణను కూడా అప్పగించాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం ఈపీఎఫ్‌వోను ఫండ్ మేనేజర్‌గా మార్చాలనుకుంటోంది. తద్వారా దేశంలో 50 కోట్ల మందికి సామాజిక భద్రతను అందించే గురుతర బాధ్యతను దానిపై మోపాలన్నది కేంద్రం యోచనగా తెలియవచ్చింది. ఇదే జరిగితే... ఈపీఎఫ్‌వో నిర్వహణ (ఎగ్జిక్యూటివ్ అధికారం) రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే సామాజిక భద్రతా బోర్డుల పరిధిలోకి వెళుతుంది. ఫండ్ మేనేజర్ పాత్రలో సామాజిక భద్రతా పెట్టుబడులపై రాబడుల ఆధారంగా ఈపీఎఫ్‌వో ఏటా వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ఆరు కోట్ల మంది చందాదారుల నిధుల నిర్వహణలో ఈపీఎఫ్‌వోకు ఉన్న అపారమైన అనుభవాన్ని వినియోగించుకుని ప్రయోజనం పొందడమే ఇందులోని లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాత్మకంగా తొలుత కొన్ని రాష్ట్రాల్లో నూతన విధానాన్ని అమలు చేసి, ఎదురయ్యే సమస్యలపై అవగాహన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడుల వ్యవహారాలు... అన్ని రాష్ట్రాల సామాజిక భద్రతా నిధుల నిర్వహణను చూసే సెంట్రల్ బోర్డుగా ఈపీఎఫ్‌వో ఇకపై వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అయితే, దీనికోసం ఈపీఎఫ్‌వో ప్రస్తుత నిర్మాణంలో ఎన్నో మార్పులు చేయాలని, నిపుణులైన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లను నియమించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఫండ్ మేనేజర్లుగా ఎస్బీఐ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్, రిలయన్స్ క్యాపిటల్, హెచ్ఎస్బీసీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ ఈపీఎఫ్‌వో పెట్టుబడి వ్యవహారాలను చూస్తున్నాయి. ఈపీఎఫ్‌వో మాత్రం సభ్యుల నుంచి చందాల వసూలు, నిధుల పంపిణీని చూస్తోంది. ‘‘అయితే, ఏ ప్రకారం పెట్టుబడి పెట్టాలన్నది కేంద్ర ఆర్థిక శాఖే తెలియజేస్తుంటుంది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన ఫండ్ మేనేజర్లు ఆ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో పెట్టుబడులపై అధిక రాబడులకు అవకాశం ఉంటుంది’’ అని ఆ అధికారి పేర్కొన్నారు. పెట్టుబడులపై రాబడుల రేటును ఈపీఎఫ్‌వో నిర్ణయించినా గానీ, దీన్ని అమలు చేయడం లేదా అధిక రిటర్నులు ఇచ్చే విషయం రాష్ట్రాల బోర్డులకు ఉంటుందన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేస్తోంది. 2015 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్న ప్రస్తుత విధానం కింద... 50 శాతం వరకు పీఎఫ్ నిధులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే 45 శాతం వరకు డెట్ సాధనాల్లో, 15 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. వీటిల్లో ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ బాండ్స్‌పై రాబడులు 7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులపై రాబడుల రేటు 16 శాతంగా ఉంది. లేబర్ కోడ్ కింద ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి సామాజిక భద్రతా నిధుల వసూలు కోసం అన్ని రాష్ట్రాల్లోనూ స్వతంత్ర బోర్డులను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ప్రణాళిక. చందాదారుల సంఖ్యను 50 కోట్ల వరకు పెంచాలన్న లక్ష్యం కూడా ఉంది. మెడికల్ ఇన్సూరెన్స్, వైకల్య కవరేజీ, మ్యాటర్నిటీ కవరేజీ సహా అన్ని రకాల సామాజిక భద్రతా పథకాలకు సింగిల్ విండోను ఏర్పాటు చేయడం ఈ విధానంలో భాగం. -
ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్‌గా ఎస్బీఐ ఓకేనా?
నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తూ ఉన్నాను. అయితే నేను ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్‌ల్లో ఒక ఏడాదిలో 40–50 చొప్పున రాబడులు వచ్చాయనుకుందాం. అప్పుడు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించి లాభాలు స్వీకరించవచ్చా? –హరిబాబు, కరీంనగర్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏడాది కాలంలో 40–50 శాతం చొప్పున రాబడులు ఇచ్చినప్పుడు.. ఆ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించాలా వద్దా అనేది మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాల సాధనకు ఈ సొమ్ములు పూర్తిగా ఉపయోగపడతాయి అనుకుంటేనే ఈ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించండి. అలా కాకుండా లాభాలు వచ్చాయని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వాటిని విలాసాలకో, మరో ఇతర వృధా విషయాలకో ఖర్చు చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోకుండా అలాగే కొనసాగిస్తే, మీ లాభాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు రీబ్యాలెన్సింగ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోండి. రీబ్యాలెన్సింగ్ అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ, డెట్ సాధనాల్లో తగిన నిష్పత్తిలో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఈ నిష్పత్తిని మార్చాలి. ఈక్విటీకి కేటాయించిన కొంత భాగాన్ని మార్చుకోవచ్చు. బాగా లాభాలు వచ్చాయనే ఒకే ఒక ఉద్దేశంతో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవడమనేది సరైన నిర్ణయం కాదు. మీకు తక్షణం డబ్బులు అవసరం లేనప్పుడు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)కు సంబంధించి ఫండ్ మేనేజర్‌గా ఎస్బీఐను ఎంచుకోవచ్చా? ఎన్పీఎస్ ప్లాన్స్‌కు సంబంధించి ఏ ఏ విభాగాలకు ఎంత మేర కేటాయింపులు జరపడం సమంజసంగా ఉంటుంది? –చైతన్య, విశాఖపట్టణం ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్‌గా ఏ సంస్థను ఎంచుకున్నా, పనితీరులో స్వల్ప తేడా మాత్రమే ఉంటుంది. ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడం వల్ల స్పల్ప లాభాలు మాత్రమే వస్తాయని చెప్పవచ్చు. ఇక ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్‌గా ఎస్బీఐ పనితీరు బాగానే ఉంది. మీరు నిరభ్యంతరంగా ఎస్బీఐను ఫండ్ మేనేజర్‌గా ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మూడు మేజర్ ప్లాన్లు ఉన్నాయి. అవి ఈక్విటీ(ఈ).గవర్నమెంట్ బాండ్స్(జీ), కార్పొరేట్ బాండ్స్(సి) మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకూ ఈక్విటీ(ఈ) ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.మీరు కనుక ఎన్‌పీఎస్‌లో 15–20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఈక్విటీ(ఈ) ప్లాన్‌లో 50 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయండి. కార్పొరేట్ బాండ్ ప్లాన్‌లో 25 శాతం, గవర్నమెంట్ బాండ్ ప్లాన్‌లో 25 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయండి. ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? – తులసి, విజయవాడ ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమనేది సరైన నిర్ణయం కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం...పెట్టుబడుల డైవర్షిఫికేషనే కదా ! అయితే మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు అనే విషయం మీద ఈ అంశం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.2,500 వరకూ ఇన్వెస్ట్ చేయగలరు అనుకుందాం. అప్పుడు ఒకే మ్యూచువల్ ఫండ్ సంస్థకు చెందిన ఒక బ్యాలన్స్డ్ ఫండ్‌ను లేదా ట్యాక్స్–సేవింగ్ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఒకే ఫండ్‌హౌస్‌కు సంబంధించిన వివిధ ఫండ్స్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ టీమ్స్ కలసికట్టుగానే పనిచేస్తాయి. అందుకని ఒక మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన వివిధ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌చేసినప్పటికీ, అన్ని ఫండ్స్‌పై ఈ కలసికట్టుగా పనిచేసే ప్రభావం తప్పక ఉంటుంది. రూ.5,000 అంతకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, కనీసం 2–3 విభిన్నమైన మ్యూచువల్ ఫండ్ సంస్థలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి మంచి హెల్త్ ప్లాన్లు సూచించండి. – మహబూబ్ ఖాన్, హైదరాబాద్ సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఈ మూడు ప్లాన్లను పరిశీలించవచ్చు. అపోలో మ్యూనిక్ ఆప్టిమ సీనియర్, రెలిగేర్ హెల్త్‌కేర్, స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్. సీనియర్ సిటిజన్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ యా సంస్థలు ఈ పాలసీలను రూపొందించాయి. హాస్పిటలైజేషన్, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఇంటిదగ్గరే వైద్య సేవలు పొందే డొమిసిలరీ హాస్పిటలైజేషన్ కూడా కవరయ్యేలా ఈ ప్లాన్లు ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ల ప్రీమియమ్‌లు కూడా అధికంగానే ఉన్నాయి. ప్రీమియమ్‌లు, ఈ ప్లాన్లు అందించే ఫీచర్లు, మినహాయింపులు, పాలసీ తీసుకోవడానికి ముందే ఉన్న వ్యాధులకు కవరేజ్, తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీలో నగదు రహిత వైద్యం అత్యంత కీలకమైన విషయం. మీరు తీసుకోబోయే ప్లాన్‌కు సంబంధించి ఇలాంటి నగదు రహిత వైద్యమందించే నెట్వర్క్ హాస్పిటల్స్ మీ నగరంలో ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవడం మరచిపోకండి. పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ బీమా కంపెనీలతో టై అప్స్ పెట్టుకోవడం సాధారణమైన విషయమే. ఇక చిన్న నగరాల్లో ఉండే వాళ్లు తమకు దగ్గర్లోని నగరాల్లో ఇలాంటి నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో లేవో గమనించి మరీ నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ అవసరాలకు తగ్గట్టుగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. -
ప్రస్తుత ఒడిదుడుకులకు రూపాయే కారణం
ఇప్పటికే ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున అమ్మకాలు జరపడంతో రానున్న రోజుల్లో అమెరికా ఉద్దీపన ప్యాకీజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై అంతగా ప్రభావం ఉండదంటున్నారు యూటీఐ ఫండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ సంజయ్ డాంగ్రే. కొన్ని రంగాల షేర్ల ధరలు నిఫ్టీ 9,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే మరికొన్ని 2,000 పాయింట్ల స్థాయి వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లు పెరిగినా, తగ్గినా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులను ఏ విధంగా చూసున్నారు? ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నెలకొన్న తీవ్ర ఒడిదుడుకులకు ప్రధాన కారణం రూపాయే. గత రెండు నెలల నుంచి రూపాయి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడుతోంది. క్షీణిస్తున్న రూపాయి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతోంది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల నుంచి 115 డాలర్లకు చేరడం, ద్రవ్యలోటు వంటివి మార్కెట్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఒక్కసారి రూపాయిలో స్థిరత్వం వస్తే ఈ ఒడిదుడుకులకు అడ్డుకట్ట పడుతుంది. చాలా రోజుల తర్వాత గురువారం బ్యాంకు షేర్లు పరుగులు తీశాయి. బ్యాంక్ షేర్లలో పతనం అయిపోయిందని భావించొచ్చా? గత రెండు నెలల్లో బ్యాంకు షేర్లు 40-42 శాతం వరకు క్షీణించాయి. దీంతో విలువ పరంగా చాలా బ్యాంకు షేర్లు ఆకర్షణీయ ధరకు వచ్చి చేరాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకుల షేర్లయితే వాటి పుస్తక విలువ స్థాయికి పడిపోయాయి. దీనికితోడు ఆర్బీఐ బుధవారం తీసుకున్న చర్యలతో బ్యాంకులకు చౌకగా డాలర్లలో నిధులు సేకరించే వెసులుబాటు కలిగింది. ఒక్కసారి రూపాయి దిగివస్తే కఠిన లిక్విడిటీ చర్యలు తొలగిస్తుందన్న సంకేతాలు బలపడటం, షార్ట్‌కవరింగ్ వంటి కారణాలతో గురువారం బ్యాంకు షేర్లు పరుగులు పెట్టాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ)లు దేశీయ మార్కెట్‌ను ఏ విధంగా చూస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలను తొలగించడం మొదలు పెడితే ఆ ప్రభావం మన ఆర్థిక మార్కెట్లపై ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? గత రెండు నెలల్లో ఎఫ్ఐఐలు ఈక్విటీల్లో 2.5 నుంచి 3 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపితే డెట్ మార్కెట్లో 8 బిలియన్ డాలర్ల వరకు జరిపారు. ప్రస్తుతం ఎఫ్ఐఐల ప్రవర్తన అనేది అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్‌పై ఆధారపడి ఉంటుంది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకున్నా మన మార్కెట్లపై ఇక పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. రూపాయి కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? రూపాయి ఒడిదుడుకులను అడ్డుకోవడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. బంగారం దిగుమతులు వంటి ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు దిగొస్తే రూపాయి విలువ తిరిగి బలపడుతుంది. ఉండాల్సిన విలువ కంటూ రూపాయి విలువ చాలా తక్కువ ఉందని ఆర్బీఐ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఒక్కసారి ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఫలితమిస్తే డాలరుతో రూపాయి విలువ సంవత్సరం మొత్తం మీద రూ.56-54 వద్ద స్థిరపడుతుంది. ఆర్బీఐ చర్యల వలన వడ్డీరేట్లు తిరిగి పెరుగుతున్నాయి. రానున్న 12 నెలల కాలంలో వడ్డీరేట్లు ఏ విధంగా ఉంటాయని అంచనా..? రూపాయి ఒడిదుడుకులను అరికట్టడానికి తీసకుంటున్న చర్యల వలన స్వల్పకాలిక వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఒక్కసారి రూపాయి స్థిరపడితే ఆర్బీఐ ఈ ఆంక్షలను ఎత్తేస్తుంది. ఒక్కసారి ఆర్థిక పరిస్థితి చక్కబడితే కాని ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం లేదు. దశాబ్దాల కనిష్టస్థాయికి జీడీపీ పడిపోవడం, ప్రమాద స్థాయిలో ద్రవ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉందన్న సంకేతాలను ఇస్తున్నాయి. కాని ఒకపక్క చూస్తే స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు. ఇటువంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని సూచిస్తారా? ఇండెక్స్‌ల పరంగా చూస్తే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి కేవలం పది శాతం దూరంలోనే ఉన్నప్పటికీ ప్రస్తుత మార్కెట్‌ను రెండు విధాలుగా చూడాలి. కొన్ని రంగాల షేర్లు నిఫ్టీ 8-9 వేల పాయింట్ల స్థాయిలో ఉన్నప్పుడు ఉండే ధర వద్ద ట్రేడ్ అవుతుంటే మరికొన్ని రంగాలు నిఫ్టీ 2,000-3,000 పాయింట్ల స్థాయి వద్ద ఉంటే ఆ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు అధిక ధరల్లో ట్రేడ్ అవుతుంటే, వడ్డీరేట్ల ప్రభావం చూపే బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఇన్ఫ్రా వంటి రంగాలు ఐదేళ్లు, పదేళ్ళ కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండటం, రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ఫార్మా, ఐటీ రంగాలు ఆమేరకు ప్రయోజనం పొందుతున్నాయి. వచ్చే 12 నెలల్లో జీడీపీ వృద్ధిరేటు ఒక మోస్తరుగానే ఉండే అవకాశం ఉండటంతో ఒక సంవత్సరం దృష్టితో ఇన్వెస్ట్ చేసే వారికి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ బాగుంటాయి. అదే మూడు నుంచి ఐదేళ్ళ కాలంతో ఇన్వెస్ట్ చేసేవారికి వడ్డీరేట్లు ప్రభావం చూపే రంగాలకేసి చూడొచ్చు. వచ్చే సంవత్సర కాలంలో ఇండెక్స్‌లు ఏ శ్రేణిలో కదులుతాయి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇండెక్స్ కదలికలను అంచనా వేయడం చాలా కష్టం. ఇది పూర్తిగా ద్రవ్యలోటును ఏ విధంగా తగ్గిస్తారన్నదానిపైన, ఆర్బీఐ లిక్విడిటీ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి ద్రవ్యలోటు అదుపులోకి వస్తే తిరిగి మార్కెట్లు పరుగులు తీస్తాయి. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్