న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఫండ్ మేనేజర్‌గా ఎస్‌బీఐ సంస్థ మార్చి నుంచి తప్పుకోనుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఓ బ్యాంకు అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీగా వ్యవహరించడానికి వీల్లేదు. ‘‘ఫండ్ మేనేజర్‌గా పనిచేయడానికి లేదని ఎస్‌బీఐకి తెలియజేశాం. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌తో ఒప్పందం లేదు. గతంలో బిడ్డింగ్ వేసే నాటికి ఆ సంస్థ దరఖాస్తుదారుగా లేదు’’ అని కార్మిక శాఖా మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. మంగళవారం ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎస్‌బీఐకి మార్చి వరకు గడువు ఇచ్చామని, ఫండ్ మేనేజర్‌గా ఎవరిని నియమించుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చి తర్వాత ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ తమను సంప్రదిస్తే ఫండ్ మేనేజర్‌గా నియమించుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment