ప్రైవేట్‌ బ్యాంకులు ఆకర్షణీయం!! | Inflation risks to the economy says UTI AMC Fund Manager V Srivatsa | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బ్యాంకులు ఆకర్షణీయం!!

Published Mon, Feb 5 2024 1:49 AM | Last Updated on Mon, Feb 5 2024 1:49 AM

Inflation risks to the economy says UTI AMC Fund Manager V Srivatsa - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అంతర్జాతీయంగా మందగమన ప్రభావాలు భారత ఎకానమీపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్‌ మేనేజర్‌ వి. శ్రీవత్స. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వు్యలో తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు ..
సాంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యుచువల్‌ ఫండ్స్‌ ప్రయోజనాలు, అధిక రాబడులపై అవగాహన పెరుగుతున్న కొద్దీ గత పదేళ్లుగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చు. సిప్‌ల ధోరణి ఇదే సూచిస్తోంది. పొదుపు యోచన, దీర్ఘకాలికంగా సిప్‌ల ద్వారా సంపద సృష్టి మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి.

గరిష్ట స్థాయుల్లో మార్కెట్లకు రిస్క్లు..
అధిక ద్రవ్యోల్బణం, ఖర్చులు చేయడం తగ్గుతుండటం వంటి ధోరణుల కారణంగా చాలా మటుకు సంపన్న మార్కెట్లలో మాంద్యం అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని గ్లోబల్‌ మార్కెట్లకు పొంచి ఉన్న చెప్పుకోతగ్గ రిస్క్ల్లో ఇది కూడా ఒకటి. అలాగే అంతర్జాతీయంగా మందగమనం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటమనేది మన దగ్గర కూడా అధిక ధరలు, ఎగుమతి ఆధారిత రంగాలు బలహీనపడటం రూపంలో భారత ఎకానమీపైనా ప్రభావం చూపవచ్చు.

దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. వేల్యుయేషన్‌పరంగా దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే మన మార్కెట్లు కొంత ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే నిర్దిష్ట విభాగాలు, రంగాలు చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోల్చి చూస్తే మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ .. ప్రీమియం ధరలకు ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ ధోరణి నిలబడేది కాకపోవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా లార్జ్‌ క్యాప్‌ ఆధారిత ఫండ్స్, అలాగే డెట్, ఈక్విటీ కలయికతో ఉండే ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్‌ ఫండ్స్‌పై దృష్టి పెడితే శ్రేయస్కరం. సిప్‌లు (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్లు) ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సిప్‌లను కొనసాగించవచ్చు. సిప్‌ లేదా ఎస్‌టీపీ (సిస్టమాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌) ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు.  

పెట్టుబడులకు అనువైన రంగాలు..
పటిష్ట రుణ వృద్ధి, తక్కువ రుణ వ్యయాలతో ప్రైవేట్‌ రంగ బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభిస్తున్నాయి. కాబట్టి వాటిపై మేము సానుకూలంగా ఉన్నాం. అలాగే వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, వేల్యుయేషన్లు సముచితంగా ఉండటం వల్ల ఆటోమొబైల్స్‌పై కూడా బులి‹Ùగా ఉన్నాం. ఇక దూరంగా ఉండతగిన రంగాల విషయానికొస్తే .. అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న కన్జూమర్‌ డ్యూరబుల్స్, అలాగే వేల్యుయేషన్లకు తగ్గట్లుగా లేని కన్జూమర్‌ సరీ్వసెస్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్‌ క్యాప్‌లపై సానుకూలంగా ఉన్నాం. అలాగే దీర్ఘకాలికంగా మెరుగైన చరిత్ర కలిగి, చౌకగా ట్రేడవుతున్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశావహంగా ఉన్నాయి.  మా యూటీఐ లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్, యూటీఐ అగ్రెసివ్‌ హైబ్రీడ్‌ ఫండ్‌ల విషయానికొస్తే నాణ్యమైనవి స్టాక్స్, దీర్ఘకాలిక వేల్యుయేషన్ల కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న రంగాలవైపు మేము మొగ్గు చూపుతాం. మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లోనూ సముచిత వేల్యుయేషన్లతో ట్రేడవుతూ వృద్ధి అవకాశాలు ఉన్నవి ఎంచుకుంటాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement