Indian economy System
-
యాభై ఏళ్ల భారత విజయగాథ
1970ల వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.9 శాతానికి తగ్గిపోయింది. కానీ అనంతరం స్థిరమైన పనితీరు నమోదవుతూ వచ్చింది. ఇప్పుడది 3.5 శాతం. ప్రపంచ సగటు కంటే దేశ ఆర్థిక వ్యవస్థ రెండింతలు వృద్ధి చెందుతోంది. అన్నింటిమీదా నియంత్రణలున్న వామపక్ష విధానాల నుండి దూరం జరిగి కొత్త ఆర్థిక విధానం ప్రారంభం కావడమే దీనికి కారణం. భారతీయులు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా ఉంది. ఆదాయపు నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధిక వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తుంది.అప్పుడు అలా కనిపించక పోయివుండొచ్చు, కానీ 50 ఏళ్ల క్రితం భారతదేశం పెద్ద మలుపును చేరుకుంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ ఉపద్రవం ఏర్పడ్డాయి. ఒక సంవత్సరం తర్వాత దాని నిర్ణయాత్మక చర్య ఏమిటంటే, ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం. కాకపోతే రెండేళ్ల లోపే అది తారుమారైపోయింది. దేశాన్ని ప్రభావితం చేసిన ఒక ముఖ్య ఘటనను ఆ సమయంలో ఎవరూ గుర్తించలేదు. అదేమిటంటే, ఇందిరా గాంధీ హయాంలో అమలైన సంపూర్ణ వామపక్ష దశ నుండి దూరం జరుగుతూ ఆర్థిక విధానంలో కొత్త దిశ ప్రారంభం కావడమే. అంతవరకు ఆర్థిక వ్యవస్థగా భారత దీర్ఘకాలిక పనితీరు నామమాత్రంగానే ఉండింది. కాలక్రమేణా కొత్త ‘భారత విజయ గాథ’ పుట్టుకొచ్చింది.1970ల మధ్యకాలం వరకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్ చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. వరుస యుద్ధాలు, దిగుబడిలేని పంటలు, క్షామం, వేదనాభరితమైన రూపాయి క్షీణతతో పాటు రెండు చమురు షాక్‌ల రూపంలో దాదాపు 15 ఏళ్ల సంక్షో భాలను ఎదుర్కొన్న తర్వాత మార్పు మొదలైంది. నెహ్రూ హయాంలోని ప్రారంభ ఆశావాదం తర్వాత జరిగిన ఈ సంఘటనలు చాలా వరకు జాతి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి.ఆర్థిక వ్యవస్థ స్థిరీకరించబడిన తర్వాత, అర్ధ శతాబ్దపు స్థిరమైన పనితీరు నమోదైంది. తక్కువ ఆదాయం, మధ్య ఆదాయం కలిగిన దేశాలతో పాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా మన వృద్ధి రేటు అధిగమించింది. పర్యవసానంగా దేశం మునుపెన్నడూ ఆస్వాదించని అంతర్జాతీయ స్థాయిని నేడు కలిగి ఉంది. అయినప్పటికీ, కొన సాగుతున్న పేలవమైన సామాజిక ఆర్థిక కొలమానాలు, పెరుగుతున్న అసమానత కారణంగా మన వృద్ధి రేటు ‘ఆశాజనకమైన’ రికార్డుగా అయితే లేదు.ఆర్థిక పరివర్తనకు ముందు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా క్షీణిస్తూ ఉండేది. 1960లో 2.7 శాతం నుండి 1975లో 1.9 శాతానికి మన వృద్ధి క్షీణత మందగించింది. 2013లో కూడా, ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 1960 నాటి కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు 2024లో ఇది 3.5 శాతం. పైగా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు కంటే రెండింతలు వృద్ధి చెందుతున్నందున, ప్రపంచ వృద్ధికి భారత్ మూడవ అతిపెద్ద దోహదకారిగా ఉంటోంది.తలసరి ఆదాయం కూడా అదేవిధంగా మెరుగుపడింది. 1960లో ప్రపంచ సగటులో 8.4 శాతంగా ఉన్న దేశ తలసరి ఆదాయం 1974లో 6.4 శాతానికి తగ్గింది. 2011లో ఈ సంఖ్యలు 13.5 శాతా నికి, 2023లో 18.1 శాతానికి మెరుగుపడ్డాయి. దాదాపు ఐదు దశాబ్దాల కాలంలో మూడు రెట్ల పెరుగుదల! అయినప్పటికీ చాలా దేశాల్లోని ప్రజలు మనకంటే మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవిస్తున్నారు. ఆఫ్రికా బయటి దేశాల్లో, మన పొరుగు దక్షిణాసియా దేశాల్లో తలసరి ఆదాయం ఇంత తక్కువగా ఉన్నవి పెద్దగా లేవు. అంటే, మనం ప్రయాణించవలసింది ఇంకా ఎంతో ఉంది.భారతదేశ కథను మార్చేది దాని జనాభా పరిమాణమే. తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కానీ 140 కోట్లసార్లు గుణిస్తే అది భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ అతిపెద్దదిగా చేస్తుంది. ఇప్పటికే, భారత్ మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లకు రెండవ అతిపెద్ద మార్కెట్. విమానయానం, కార్లకు మూడవ లేదా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ఈ ఉత్పత్తులు, సేవా మార్కెట్లలో వృద్ధికి, పెరుగు తున్న మధ్యతరగతి కారణమవుతోంది. ఇది ‘డాలర్–బిలియనీర్ల’ పెరుగుదలకు దారితీసింది (200 బిలియనీర్లు. ప్రపంచంలో మూడో స్థానం). మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారత స్టాక్ మార్కెట్ నాల్గవ స్థానంలో ఉంది.1970ల మధ్యకాలం వరకు, దాదాపు సగం మంది దారిద్య్ర రేఖకు దిగువన నివసించారు. నేడు, అధికారికంగా 10 శాతం కంటే తక్కువ మంది పేదలు ఉన్నారు. భారత్‌ను ఇప్పుడు పేద ప్రజల దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న శక్తిగా అంతర్జాతీయంగా ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ, వియత్నాం వంటి దేశాలు ‘అధిక అభివృద్ధి’ హోదాను పొందగా, భారత్ తన మానవాభివృద్ధిలో ‘మధ్యస్థ అభివృద్ధి’ దేశంగా మాత్రమే కొనసాగుతోంది. మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ‘అధిక అభివృద్ధి’ విభాగంలో చేరే అవకాశం లేదు. దీనికి మించి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో కూడిన ‘అత్యున్నత అభివృద్ధి’ విభాగం ఉంది. ఇందులోకి చేరాలన్నది ప్రస్తుతం దేశ ఆకాంక్ష.దేశంలో పాఠశాల విద్య సగటు సంవత్సరాలు 2010లో ఉన్న 4.4 ఏళ్ల నుండి ఇప్పుడు 6.57 ఏళ్లకు మెరుగైనాయి. 1,000 జనాభాకు ఒక వైద్యుడు ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నిష్పత్తి కంటే ఇది ఎక్కువ. దేశ ప్రజల ఆయుర్దాయం 70 సంవత్సరాల పరిమితిని కూడా దాటేసింది. అధిక ఆదాయాలు వైవిధ్యమైన, సమృద్ధికరమైన ఆహారంలో ప్రతిబింబిస్తాయి. పాల వినియోగం 10 రెట్లు పెరిగింది. చేపల వినియోగం కూడా అలాగే ఉంది. గుడ్ల వినియోగం 20 రెట్లు పెరిగింది. వీటన్నింటి కంటే ముఖ్యమైనది మనస్తత్వంలో మార్పు. 1970ల మధ్య వరకూ భారత్ సామ్యవాద భావజాలానికి కట్టుబడి ఉంది. అనేక పరిశ్రమలను పెద్ద ఎత్తున జాతీయం చేయడమే కాకుండా, కాగితం నుండి ఉక్కు వరకు, చక్కెర నుండి సిమెంట్ వరకు, ఆఖరికి స్నానం సబ్బుల నుండి కార్ల వరకు ప్రతిదానిపై ధర, ఉత్పత్తి నియంత్రణ ఉండేది! దీని అనివార్య ఫలితం ఏమిటంటే కొరత, బ్లాక్ మార్కెట్లు. పారిశ్రామిక వివాదాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికసంఘాల పక్షం వహించడం పరిపాటిగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కమ్యూనిస్ట్ పార్టీలు ఐసీయూలో ఉన్నాయి. పైగా వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వాలు ఇప్పుడు కార్మిక చట్టాలను మార్చాలనుకుంటున్నాయి. పన్ను రేట్లు సహేతుకంగా మారాయి.భారతీయులు ఇప్పుడు ఉత్సాహవంతులైన షేర్ మార్కెట్ పెట్టుబడిదారులుగా మారారు. 1974లో షేర్ల అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ విలువ రూ. 12 కోట్లు (నేటి డబ్బులో దాదాపు రూ. 350 కోట్లు). దీనితో పోల్చితే, గత రెండేళ్లలో అనేక కంపెనీలు రూ. 15,000 –21,000 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూలు జారీ చేశాయి (ఎల్ఐసీ, అదానీ, వోడాఫోన్ మొదలైనవి). ఒక దశాబ్దం క్రితం వరకు, మ్యూచు వల్ ఫండ్ కంపెనీలు బ్యాంకు డిపాజిట్లలో ఎనిమిదో వంతు కంటే తక్కువ మొత్తాలను నిర్వహించాయి; ఆ షేర్ రెండింతలు పెరిగి ఇప్పుడు పావు వంతు కంటే ఎక్కువకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో భారతదేశం తన జీడీపీకి గత పదేళ్లలో చేసిన దానికంటే, మరింత ఎక్కువ జోడిస్తుంది.భారత్ సాధించిన ఈ విజయగాథకు వ్యతిరేక కథనం కూడా తక్కువేమీ లేదు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే వినియోగ సరుకుల ఉత్పత్తి ఏమాత్రం పెరగలేదు. నిల్వ ఉండని సరుకుల ఉత్పత్తి వార్షిక సగటు కేవలం 2.8 శాతమే పెరిగింది. దీనివల్ల స్పష్టంగానే, వినియోగ దారులు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆదాయ నిచ్చెన దిగువ ఉన్నవారికి మంచి వేతనాలతో కూడిన పని లేకపోవడాన్ని ఇది సూచిస్తుంది. ఇది మారినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7–ప్లస్ శాతానికి చేరుకోగలుగుతుంది. అప్పుడే నిజంగా అధికంగా వృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా గుర్తించబడుతుంది.టి.ఎన్. నైనన్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
పటిష్టంగా భారత ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితిలో ఉందని జూన్ నెలకు సంబంధించిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో (ఎఫ్ఎస్ఆర్) రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో (ఎస్సీబీ) స్థూల మొండి బాకీల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 12 ఏళ్ల కనిష్ట స్థాయి అయిన 2.8 శాతానికి, నికర ఎన్పీఏల నిష్పత్తి 0.6 శాతానికి తగ్గినట్లు వివరించింది. జీఎన్‌పీఏలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 2.5 శాతానికి తగ్గగలవని వివరించింది.క్రెడిట్ రిసు్కలకు సంబంధించి స్థూల స్ట్రెస్ టెస్టుల్లో ఎస్సీబీలు కనీస మూలధన అవసరాలను పాటించగలిగే స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడైందని నివేదిక పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి జీఎన్‌పీఏ నిష్పత్తి 4 శాతంగాను, రిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్వోఏ) 3.3 శాతంగాను ఉన్నట్లు తెలిపింది.భౌగోళిక–రాజకీయ ఆందోళనలు, ప్రభుత్వాలపై భారీ రుణభారాలు, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా పురోగతి మందకొడిగా సాగుతుండటం వంటి అంశాల రూపంలో అంతర్జాతీయ ఎకానమీకి సవాళ్లు పెరిగాయని వివరించింది. సవాళ్లున్నప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని నివేదిక తెలిపింది.గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి.. ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా నిలదొక్కుకునేలా అసెట్ క్వాలిటీ, పటిష్టత మెరుగుపడినట్లుగా అధ్యయనాలు చూపిస్తున్న నేపథ్యంలో గవర్నెన్స్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టాలంటూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.ప్రస్తుతానికి ఆర్థిక స్థిరత్వం పటిష్టంగానే ఉందని, అయితే దాన్ని అలాగే కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మెరుగుపర్చుకోవడమనేది నిజమైన సవాలుగా ఉండగలదని ఎఫ్ఎస్ఆర్ నివేదిక ముందుమాటలో ఆయన పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ పరిశీలిస్తూనే ఉంటుందన్నారు. టెక్నాలజీపై బ్యాంకులు తగినంత స్థాయిలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.నివేదికలోని మరిన్ని అంశాలు..బ్యాంక్ గ్రూపుల వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) 2023–24 ప్రథమార్ధంలో జీఎన్‌పీఏ నిష్పత్తి గణనీయంగా 76 శాతం మేర తగ్గింది. ప్రొవిజనింగ్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) మెరుగుపడింది.అర్థ సంవత్సరంలో కొత్త ఎన్పీఏలు కూడా వివిధ బ్యాంకు గ్రూపుల్లో తగ్గాయి. పూర్తి సంవత్సరంలో మొండి బాకీల రైటాఫ్‌లు దిగివచి్చనప్పటికీ రైటాఫ్ నిష్పత్తి మాత్రం క్రితం సంవత్సరం స్థాయిలోనే ఉంది.2023–24 ద్వితీయార్ధంలో పీఎస్‌బీలు, ఫారిన్ బ్యాంకుల్లో రుణాల మంజూరు పెరగ్గా, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కాస్త నెమ్మదించింది.మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో సర్వీ సుల రంగానికి ఇచ్చిన రుణాలు, వ్యక్తిగత రుణాల వాటా పెరిగింది. ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధిలో వ్యక్తిగత రుణాల వాటా సగానికి పైగా ఉంది.ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) వాల్యూమ్స్ గణనీయంగా పెరగడమనేది రిటైల్ ఇన్వెస్టర్లకు సవాలుగా మారొచ్చు. చిన్న ఇన్వెస్టర్లు సరైన రిస్కు మేనేజ్మెంట్ విధానాలను పాటించకపోతుండటమే ఇందుకు కారణం. కాబట్టి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కీలకం. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో 2022–23లో 65 లక్షలుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య 2023–24లో ఏకంగా 95.7 లక్షలకు పెరిగింది. -
2027 నాటికి భారత్... టాప్3
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడి సలహా సంస్థ జెఫరీస్ ఆశాజనక అంచనాలను ఆవిష్కరించింది. గత పదేళ్లలో భారతదేశం మౌలిక నిర్మాణాత్మక సంస్కరణలను చూసిందని, దేశం తన పూర్తి సామర్థ్యాలను చూసేందుకు కావాల్సిన కార్యాచరణను ఇది సృష్టించిందని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా పనిచేసే జెఫరీస్ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో భారత జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.415 లక్షల కోట్లు) చేరుకుంటుందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను వెనక్కి నెట్టి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. స్థిరమైన వృద్ధి ప్రక్రియలో భాగంగా, 2030 నాటికి భారత స్టాక్ మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని జెఫరీస్ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్ మార్కెట్ 4.3 ట్రిలియన్ డాలర్లు విలువతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. టాప్4లో అమెరికా (44.7 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.8 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.8 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయి. గత 5–20 సంవత్సరాల కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ డాలర్ మారకంలో ఏటా 10 శాతం చొప్పున స్థిరమైన రాబడిని ఇచ్చింది. వర్ధమాన మార్కెట్లలో ఏ ఇతర దేశంతో పోల్చి చూసినా మెరుగైన పనితీరు చూపించింది. మూలధన వ్యయాలు తిరిగి పుంజుకోవడం, కంపెనీలు బలమైన ఆదాయాలను నమోదు చేసే స్థితిలో ఉండడం వల్ల భారత మార్కెట్ వచ్చే 5–7 ఏళ్లలోనూ మంచి వృద్ధిని నమోదు చేయనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. భారత ఈక్విటీల్లోకి భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ప్రవహించేందుకు ఉన్న అవకాశాలను జెఫరీస్ ప్రస్తావించింది. ఇప్పటికీ గృహ పొదుపులో కేవలం 4.7 శాతమే ఈక్విటీల్లోకి వస్తున్నట్టు తెలిపింది. డిజిటల్‌గా ఎంతో పురోగతి సాధించడంతో సంప్రదాయ, రిటైల్ ఇన్వెస్టర్ల మధ్య అంతరాన్ని తగ్గించినట్టు వివరించింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు అసాధారణ స్థాయిలో మార్కెట్ ప్రవేశాన్ని పొందుతున్నట్టు తెలిపింది. సిప్‌కు అమిత ఆదరణ పెరగడం, పెట్టుబడుల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లలో ఉన్న క్రమశిక్షణను తెలియజేస్తోందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, భారత ఈక్విటీ మార్కెట్లోకి మరింతగా పొదుపు నిధులు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. బహుళజాతి కంపెనీల లిస్టింగ్ బలమైన వృద్ధి గమనం, మార్కెట్ల పెరుగుదల, అధిక రాబడుల ట్రాక్ రికార్డ్ ఇవన్నీ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాయని జెఫరీస్ పేర్కొంది. దక్షిణ కొరియా బహుళజాతి సంస్థ హ్యుందాయ్ ఇండియా తన భారతీయ అనుబంధ సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రస్తావించింది. బలమైన భవిష్యత్తుకు పునాది అధిక వృద్ధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం చేపట్టిన నిరంతర సంస్కరణలను నివేదిక ప్రశంసించింది. ‘‘దేశంలో సులభతర వ్యాపారాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించే లక్ష్యంతో 2014 నుంచి మోదీ ప్రభుత్వం అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేస్తోంది. 2017 నాటి చరిత్రాత్మక జీఎస్టీ చట్టం అనేక పన్నుల నిర్మాణాలను ఏకైక ఉమ్మడి జాతీయ విధానంగా కుదించింది ఇది. రాష్ట్రాల వ్యాప్తంగా ’యూరోజోన్’ శైలి వస్తువులు, సేవల ప్రవాహాన్ని సృష్టించింది. బ్యాంకింగ్ వ్యవస్థ మొండి బకాయిల ప్రక్షాళనను వేగవంతం చేయడంలో 2016 నాటి దివాలా చట్టం కీలకంగా మారింది. 2017 రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ (రెరా) విస్తారమైన, అసంఘటిత స్థిరాస్తి రంగాన్ని ప్రక్షాళన చేయడానికి సహాయపడింది’’ అని నివేదిక పేర్కొంది. -
ప్రైవేట్ బ్యాంకులు ఆకర్షణీయం!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా మందగమన ప్రభావాలు భారత ఎకానమీపై కూడా ప్రభావం చూపవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ వి. శ్రీవత్స. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచి్చన ఇంటర్వు్యలో తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు .. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలతో పోలిస్తే మ్యుచువల్ ఫండ్స్ ప్రయోజనాలు, అధిక రాబడులపై అవగాహన పెరుగుతున్న కొద్దీ గత పదేళ్లుగా ఫండ్స్‌లోకి పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చు. సిప్ల ధోరణి ఇదే సూచిస్తోంది. పొదుపు యోచన, దీర్ఘకాలికంగా సిప్ల ద్వారా సంపద సృష్టి మొదలైన అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గరిష్ట స్థాయుల్లో మార్కెట్లకు రిస్క్‌లు.. అధిక ద్రవ్యోల్బణం, ఖర్చులు చేయడం తగ్గుతుండటం వంటి ధోరణుల కారణంగా చాలా మటుకు సంపన్న మార్కెట్లలో మాంద్యం అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. ఇప్పటికీ పూర్తిగా కోలుకోని గ్లోబల్ మార్కెట్లకు పొంచి ఉన్న చెప్పుకోతగ్గ రిస్క్ల్లో ఇది కూడా ఒకటి. అలాగే అంతర్జాతీయంగా మందగమనం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటమనేది మన దగ్గర కూడా అధిక ధరలు, ఎగుమతి ఆధారిత రంగాలు బలహీనపడటం రూపంలో భారత ఎకానమీపైనా ప్రభావం చూపవచ్చు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. వేల్యుయేషన్‌పరంగా దీర్ఘకాలిక సగటులతో పోలిస్తే మన మార్కెట్లు కొంత ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే నిర్దిష్ట విభాగాలు, రంగాలు చాలా ఎక్కువ ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోల్చి చూస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ .. ప్రీమియం ధరలకు ట్రేడవుతున్నాయి. దీర్ఘకాలంలో ఈ ధోరణి నిలబడేది కాకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా లార్జ్ క్యాప్ ఆధారిత ఫండ్స్, అలాగే డెట్, ఈక్విటీ కలయికతో ఉండే ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌పై దృష్టి పెడితే శ్రేయస్కరం. సిప్‌లు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) ఆకర్షణీయంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సిప్‌లను కొనసాగించవచ్చు. సిప్ లేదా ఎస్టీపీ (సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్) ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పెట్టుబడులకు అనువైన రంగాలు.. పటిష్ట రుణ వృద్ధి, తక్కువ రుణ వ్యయాలతో ప్రైవేట్ రంగ బ్యాంకులు చాలా ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్‌లో లభిస్తున్నాయి. కాబట్టి వాటిపై మేము సానుకూలంగా ఉన్నాం. అలాగే వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, వేల్యుయేషన్లు సముచితంగా ఉండటం వల్ల ఆటోమొబైల్స్‌పై కూడా బులి‹Ùగా ఉన్నాం. ఇక దూరంగా ఉండతగిన రంగాల విషయానికొస్తే .. అధిక వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న కన్జూమర్ డ్యూరబుల్స్, అలాగే వేల్యుయేషన్లకు తగ్గట్లుగా లేని కన్జూమర్ సరీ్వసెస్, ఎఫ్ఎంసీజీ రంగాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్‌లపై సానుకూలంగా ఉన్నాం. అలాగే దీర్ఘకాలికంగా మెరుగైన చరిత్ర కలిగి, చౌకగా ట్రేడవుతున్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆశావహంగా ఉన్నాయి. మా యూటీఐ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్, యూటీఐ అగ్రెసివ్ హైబ్రీడ్ ఫండ్ల విషయానికొస్తే నాణ్యమైనవి స్టాక్స్, దీర్ఘకాలిక వేల్యుయేషన్ల కన్నా తక్కువ స్థాయిలో ట్రేడవుతున్న రంగాలవైపు మేము మొగ్గు చూపుతాం. మిడ్, స్మాల్ క్యాప్స్‌లోనూ సముచిత వేల్యుయేషన్లతో ట్రేడవుతూ వృద్ధి అవకాశాలు ఉన్నవి ఎంచుకుంటాం. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేనా?
బ్రిటిష్ వలస పాలకులు కూడా పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నామని కోతలు కోసేవారు. అవే మాటల్ని దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా చెప్పింది. అవే ఇప్పటికీ కేంద్ర పాలకులు చెబుతారు. ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు. కానీ ఈ రాజకీయవేత్తలకు తమ ‘అమాయక మనస్తత్వం’ నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకు అందనంత పెద్ద జబ్బు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. రూ. 2 కూడా చేతిలో ఆడని అసంఖ్యాక కష్టజీవులకు దీనివల్ల కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? ‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందుబాటులోకి రాకపోవడానికి కారణం – ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొలదిమంది సంపన్న స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోరికలేనని మరచిపోరాదు.... దేశ స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన దేశీయ ప్రభుత్వం కూడా తాను పేద వర్గాల ఉద్ధరణ కోసం చేయవలసిందంతా చేస్తున్నానని బీరాలు పలకవచ్చు. కానీ, బ్రిటిష్ వలస పాలకులు కూడా అలాంటి కోతలే కోసేవారు. కానీ అసలు రహస్యం – పేద ప్రజల ప్రయోజనాలు మాత్రం నెరవేరక పోవడం. ఈ సత్యాన్ని స్వతంత్ర భారత పాలకులు వినమ్రతతో అంగీకరించి తీరాలి.’’ – జాతిపిత గాంధీజీ (1947 డిసెంబర్ 11); ‘ది హిందూ’ ప్రచురించిన ‘మహాత్మాగాంధీ: ది లాస్ట్ 200 డేస్’ నుంచి. ‘‘సంపన్నుల చేతిలో అంత అధికారం ఎలా గూడు కట్టుకుంది? పాలకులు ప్రయివేట్ కార్పొరేషన్ల పైన, సంపన్నుల ఆస్తుల పైన శ్రుతి మించిన ఆదాయంపై విధించే పన్నుల్ని తగ్గించి వేయడంవల్ల! మరోవైపున శ్రమజీవులైన కార్మిక సంఘాలను అణచి వేయడం ద్వారా వారి కనీస వేతనాన్ని ద్రవ్యోల్బణం ద్వారా కోత పెట్టేయడం రివాజుగా మారింది.’’ – ప్రసిద్ధ ఆర్థికవేత్త పాల్ క్రూగ్మన్ 2016లో అకస్మాత్తుగా బీజేపీ పాలకులు పెద్ద నోట్ల చలామణీని అదుపు చేసి దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడుతామని బీరాలు పలికి తాము చతికిలపడటమే గాక కోట్లాదిమంది సామాన్య ప్రజలను కష్టాల్లోకి నెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలు తేరుకోలేదు. ఈలోగానే ‘పెద్ద నోట్ల భారం’ పేరిట వాటిని చలామణీ నుంచి ఉపసంహరించే పేరిట గతంలో 500, 1000 నోట్లకు ఎసరు పెట్టినట్టే ఇప్పుడు రూ. 2000 నోట్లపై యుద్ధం ప్రకటించారు. 2016లో ‘పాకిస్తాన్‌పై యుద్ధం కోసం’ పెద్ద నోట్ల చలామణీని అదుపు చేస్తే, ఈ రోజు దాకా తేరుకోకుండా కునారిల్లుతూ వస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ‘జీవం పోసే’ పేరిట 2000 నోట్ల కట్టల ఉపసంహరణ తతంగానికి తెరలేపారు. సామాన్య ప్రజాబాహుళ్యం మౌలిక ప్రయోజనా లకు రూ. 2000 నోటు ఉపసంహరణ వల్ల ప్రత్యక్షంగా నష్టం కలగక పోవచ్చు. అయితే పరోక్షంగా ఎన్నికల పేరిట రాజకీయ పార్టీలు పోటాపోటీలతో అనుసరించే ఎత్తుగడల నుంచి మాత్రం రెండువేల రూపాయల నోటు తొలగిపోదు. లోపాయకారీగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కేవలం పాలకపక్ష నాటకంగా పైకి కనిపించినా, పరోక్షంగా ప్రతిపక్షాల ప్రయోజనాలు నెరవేర్చడంలో కూడా ‘రెండు వేల నోటు’ ఉపయోగపడుతుందని మరచిపోరాదు. గతంలో రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు వల్ల ‘నల్ల ధనం, నకిలీ నోట్లు’ చలామణీ నుంచి తప్పుకున్న దాఖలాలు లేవు. అలాగే విదేశీ బ్యాంకుల్లో ఏళ్ల తరబడిగా తలదాచుకుంటున్న భారత పెట్టుబడి దారుల దొంగ డబ్బును దేశానికి తీసుకొచ్చి, భారత ప్రజలకు లక్షలు, కోట్లు పంచిపెడతానన్న ప్రధాన మంత్రి మాట ‘నీటి మూట’గా ఎలా మారిందో ప్రజలు చూశారు. ఈ సందర్భంగా నాటి రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్ పాలకుల నిర్ణయాల్ని నిరసించి, ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం’లోకి పాలకులు నెట్టబోతున్నారని ప్రజల్ని హెచ్చరించి మరీ గవర్నర్ పదవికి రాజీనామా చేసి అమెరికాలో కొలువుకి ‘చెక్కేయ’వలసి వచ్చింది. రాజన్ హెచ్చరికలు దేశానికి ముందస్తు మెలకువలయ్యాయి. అయినా పాలకులలో చలనం లేదు. సుప్రీం కోర్టు కూడా ‘ఆరేళ్ల తర్వాత ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పలేమన్న’ తీవ్ర నిరాశను బాహాటంగానే వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు స్వతం త్రంగా, ఎలాంటి ‘ఉచ్చులు’ లేకుండా బతకవచ్చునో జూలియస్ నైరేరి అధ్యక్షతన ఏర్పడిన ‘సౌత్ కమిషన్’ నిరూపించింది (1990 రిపోర్టు). కాంగ్రెస్ హయాంలో ప్రధాని హోదాలో నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆ రిపోర్టును ఆహ్వానించి కూడా ఆచరణలో అమలు చేయలేకపోయారు. ఇదిలా ఉండగా – ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అన్నార్తులైన ప్రజాబాహుళ్యంపై ఎక్కుపెట్టిన దారి దోపిడీ పద్ధతుల వల్ల ఆయా ఖండాల ప్రజలు ఎలా ఆర్థికంగా కునారిల్లి పోయారో ఆ సంస్థల ఆదేశంపై వాటి తరఫున ఆ దేశాలలో పని చేసిన వైస్ ప్రెసిడెంట్ డేవిసన్ బుధూ తన అనుభవాలను అమితమైన దుఃఖంతో అక్షరబద్ధం చేశారు. ‘‘ఈ ఖండాలలో కోటానుకోట్ల పేద ప్రజలు పట్టెడన్నం కోసం మాడుతున్నారు. అన్నార్తుల రక్తంతో తడిసిన మా అధికారుల చేతులను కడగటానికి ప్రపంచంలో ఉన్న సబ్బులన్నీ చాలవు’’ అని ప్రకటించారు! ‘రూ. 2000’ పెద్ద నోటును సర్క్యులేషన్ నుంచి కట్టడి చేసినంత మాత్రాన రూ. 2లు కూడా చేతిలో ఆడని అసంఖ్యాక సామాన్య కష్టజీవులకు కలిగే ప్రత్యేక లాభం ఏముంటుంది? కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తగా కేంద్ర పాలకులు కొత్త వేషానికి గజ్జె కట్టారు. కర్ణాటక తాజా ఎన్నికల్లో రెండువేల రూపాయల కట్టలు ప్రాణం పోసుకున్నందువల్ల 2024 ఎన్నికల నాటికన్నా ఈ కట్టల్ని ‘కట్టడి’ చేయాలన్నది కేంద్ర పాలకుల ఎత్తుగడ! అసలు ‘మంచి పాలన’ పేరిట దేశ రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే ప్రపంచ బ్యాంకు విధాన ఒరవడిలో పెట్టుబడి విధానాల్ని ఆశ్రయించే దేశాల పాలకులందరిదీ ఇదే తంతు అని నిశితమైన ఆర్థిక వ్యవహారాల నిపుణులలో ఒకరైన సంజీవి గుహన్ ఖండించవలసి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ చరిత్రకారులైన ఎడ్వర్డ్ మాసన్, రాబర్ట్ ఆషర్ అభిప్రాయం కూడా అదే! అంతేగాదు, బీజేపీ పాలకుల నిర్ణయాలను ‘ఆదర్శం’గా భావించిన ఒక ‘నేత’ మరొక అడుగు ముందుకు వేసి – ప్రతిపక్షాల కూటమికి తనను రథసారథిని చేస్తే మొత్తం ఎన్నికల ఖర్చంతా తానే భరిస్తానని అన్నట్టుగా ఓ ఇంగ్లిష్ ఛానల్లో బాహాటంగా ప్రకటించడంతోనే – రెండు వేల రూపాయల నోటుకు ‘వేటు’ పడిందని కొల్లలుగా ప్రకటనలు వెలువడజొచ్చాయి. ఈ సందర్భంగా రాజకీయ పాలకుల, నాయకుల తప్పిదాలకు మూలాన్ని కనుగొనే యత్నంలో ఐన్‌స్టీన్‌కూ, సోషలిస్టు నాయకుడు రావ్‌ుమనోహర్ లోహియాకూ మధ్య సాగిన ఒక ఆసక్తికరమైన సంభా షణను గమనించాలి. ఐన్‌స్టీన్: ‘రాజకీయులు చేసే తప్పిదాలు వాళ్ల లోని చెడ్డ తలంపుల వల్లగాక, అమాయకత్వం నుంచి పుట్టే లక్షణంగా మనం భావించవచ్చా?’ లోహియా: ‘అసలు రహస్యం – రాజకీయవేత్తలకు తమ అమా యక మనస్తత్వం నుంచి బయటపడటం ఇష్టం ఉండదు. అది రోగ నివారణకి అందనంత పెద్ద జబ్బు. ఆ జబ్బే వారిని పీడిస్తుండే పెద్ద రోగం. ఈ రోగం నుంచి బయట పడటం ఇష్టం లేనందుననే చాలా మంది రాజకీయులకు దేశ సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు గాక ఉండదు’! ఆర్థిక నిపుణులైన శుభదారావు నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్థికవేత్తల బృందం (క్వాంట్ ఎకో) వివరించినట్టుగా, పన్నుల ఎగ వేతకు వీలుగా దొంగచాటుగా అట్టిపెట్టుకోవడానికి ఈ 2000 లాంటి పెద్ద నోట్లు సంపన్నుల వద్ద మేట వేసుకున్నాయి. అవి ఇప్పుడు కోట్లాది విలువ చేసే లోహ సంపద పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. గతంలో బ్యాంకుల వద్ద పొద్దుగూకులు పెద్ద నోట్లు మార్చుకోవడానికి పడిగాపులు పడి 125 మంది సాధారణ ఖాతాదార్ల ప్రాణాలు ‘హరీ’ అన్నాయి. ఈసారి ‘భాగోతం’ ఎలా ముగుస్తుందో రేపటి ‘వెండి తెర’పై చూడాల్సిందే! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
2050 కల్లా రెండో పెద్ద ఎకానమీ
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2050 కల్లా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించగలదని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు భారత్‌కి 58 ఏళ్లు పట్టగా, రెండో ట్రిలియన్కు చేరేందుకు 12 సంవత్సరాలు పట్టింది. మూడో దానికి చేరేందుకు అయిదేళ్లు మాత్రమే పట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక, ఆర్థిక సంస్కరణల వేగం ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్ద కాలంలో దేశ జీడీపీ ప్రతి 12–18 నెలలకు 1 ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందుతుంది. తద్వారా 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారగలదు. స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చు‘ అని ఆయన చెప్పారు. 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ కార్యక్రమంలో ప్రసంగించిన సందర్భంగా అదానీ ఈ విషయాలు తెలిపారు. భారత్ ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎకానమీ 23 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45–50 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. సూపర్‌పవర్‌లపై తొలగిన అపోహలు.. ఇటీవలి సంక్షోభాలతో అంతర్జాతీయంగా నెలకొన్న అనేక అపోహలు తొలగిపోయాయని అదానీ చెప్పారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామిక సూత్రాలను చైనా పాటించక తప్పదు, ప్రపంచవ్యాప్తంగా సెక్యులరిజం సూత్రాలు ఒకే రకంగా ఉంటాయి, యూరోపియన్ యూనియన్ ఎప్పటికీ కలిసే ఉంటుంది, అంతర్జాతీయంగా రష్యా పాత్ర తగ్గిపోతుంది వంటి అనేక అపోహలను ఇటీవలి సంక్షోభాలు తుడిచిపెట్టేశాయని అదానీ చెప్పారు. అలాగే ఏక ధృవ, ద్వి ధృవాల కాలంలో ప్రపంచానికి కష్టం వస్తే సూపర్ పవర్లు రంగంలోకి దిగి చక్కబెట్టేయగలవన్న అపోహలు కూడా పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. తొమ్మిది రోజులకో యూనికార్న్ .. భారత్ సామర్థ్యాలను వివరిస్తూ .. 2021లో దేశీయంగా ప్రతి 9 రోజులకి ఒక స్టార్టప్ సంస్థ యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్) హోదా దక్కించుకుందని అదానీ చెప్పారు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ అన్నింటినీ కలిపినా ఆరు రెట్లు అధికంగా భారత్ రియల్ టైమ్‌లో 48 బిలియన్ల ఆర్థిక లావాదేవీలు నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లు దాటగలవని అదానీ తెలిపారు. -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్‌లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది. -
ఎకానమీ గాడిన పడుతోంది..!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకించి కార్పొరేట్ రికవరీ విస్తృత ప్రాతిపదికన ఉండడం సంతృప్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కంపెనీల రుణ నాణ్యతా అవుట్‌లుక్‌ను ప్రస్తుత ‘జాగరూకతతో కూడిన ఆశావాదం’ నుంచి ‘పాజిటివ్’కు మార్చుతున్నాం. ఫైనాన్షియల్ రంగం మినహా 43 రంగాలను అధ్యయనం చేయడం జరిగింది. ఆయా రంగాలు అన్నింటిలో పురోగమన ధోరణి కనిపిస్తోంది. వీటిలో నిర్మాణం, ఇంజనీరింగ్, పునరుత్పాదక ఇంధనంసహా 28 రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నాం. మిగిలినవి ఆ స్థాయిలో 85 శాతానికి చేరుకుంటాయి. భారత్ కార్పొరేట్ రంగం మూలాలు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ సవాళ్లు లేకుండా ఉంటే దేశీయ డిమాండ్ మరింత పెరుగుతుంది. అంతర్జాతీయ సానుకూల అంశాలు కూడా దీనికి తోడవుతాయి. స్టీల్ ఇతర మెటల్స్, ఫార్మా, రసాయనాల రంగాల్లో డిమాండ్ బాగుంటుంది. కాగా ఆతిథ్యం, విద్యా సేవలు ఇంకా మెరుగుపడల్సి ఉంది. ఫైనాన్షియల్ రంగం కూడా 2020తో పోల్చితే ప్రస్తుతం బాగుంది. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు దీనికి కారణం. మొండి బకాయిల తగ్గింపు చర్యల ఫలితాలు సానుకూలంగా కనబడుతున్నాయి. రుణ లభ్యత మరింత మెరుగుపడే వీలుంది. జూన్ త్రైమాసికంలో 20 శాతం వృద్ధి: ఇక్రా భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ పటిష్టంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) ఎనామనీ వృద్ధి 20 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నాం. అయితే దీనికి గత ఏడాది ఇదే కాలంలో లో బేస్ (24 శాతం క్షీణత) ప్రధాన కారణం. ఎకానమీ 20 శాతం పురోగమించినప్పటికీ, విలువల్లో కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకోడానికి ఇంకా సమయం పడుతుంది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, ఎగుమతులు, వ్యవసాయ రంగం నుంచి డిమాండ్ వంటి అంశాలు ఎకానమీ విస్తృత ప్రాతిపదికన రికవరీకి దోహదపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యయాలు నిర్మాణ రంగం పురోగతికి దోహదపడతాయి. ఈ రంగం జూన్ త్రైమాసికంలో కోవిడ్–19 ముందస్తు స్థాయికి చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. వస్తువుల ఉత్పత్తి వరకూ సంబంధించిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి) జూన్ త్రైమాసికంలో 17 శాతం వరకూ ఉంటుందని విశ్వసిస్తున్నాం. ప్రీ కోవిడ్ ముందు పరిస్థితిని పోల్చితే 2021–22 తొలి త్రైమాసికంలో జీడీపీ, జీవీఏలు దాదాపు 9 శాతం క్షీణతలోనే ఉంటాయని భావిస్తున్నాం. పంట దిగుబడులు బాగుండే పరిస్థితులు కనిపిస్తుండడం హర్షణీయ పరిణామం. ఇది గ్రామీణ డిమాండ్ పటిష్టంగా ఉండడానికి దోహదపడుతుంది. -
భారత్ ఎకానమీపై ఎస్అండ్పీ వైఖరి మార్పు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీపై అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) కేవలం 15 రోజుల్లోనే తన వైఖరిని మార్చుకుంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ క్షీణ రేటును 9 శాతం నుంచి 7.7 శాతానికి మెరుగుపరిచింది. డిమాండ్ ఊహించినదానికన్నా ముందుగానే మెరుగుపడుతుండడం, కోవిడ్–19 కేసుల తగ్గుముఖ ధోరణి దీనికి కారణంగా మంగళవారం తెలిపింది. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10 శాతం ఉంటుందని పేర్కొంది. కరోనాను ఇంకా జయించలేనప్పటికీ, దానితో కలిసి జీవించడం భారత్ నేర్చుకుంటోందని తెలిపింది. భారత్‌లో సేవలకన్నా, వస్తువులకు డిమాండ్ బాగుందని పేర్కొన్న ఎస్అండ్పీ, రికవరీలో ఈ అంశమూ కీలకపాత్ర పోషించిందని తెలిపింది. సెలవులకు బయటకు వెళ్లకపోవడం, బయటి ఆహార పదార్థాల తీసుకోవడంపై వ్యయాలు తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో మిగిలిన డబ్బులో కొంతభాగం వస్తువుల కొనుగోళ్లకు మరికొంత పొదుపులకు ప్రజలు కేటాయిస్తారని పేర్కొన్న రేటింగ్ సంస్థ, భారత్‌లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. ద్విచక్ర వాహనాలు, కార్ల కొనుగోళ్లు గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. అయితే వైరెస్ సెకండ్‌వేవ్ సమస్యలు, వ్యాక్సిన్ ఇంకా లభ్యంకాని పరిస్థితులు, వ్యయాలపై ప్రభుత్వానికి పరిమితులు ఆర్థిక వ్యవస్థకు అవరోధాలని పేర్కొంది. 15 రోజుల క్రితం అభిప్రాయం చూస్తే... కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో మొదటి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ఈ పరిస్థితుల్లో పలు ఆర్థిక, రేటింగ్, విశ్లేషణా సంస్థలు క్షీణ అంచనాలను 8 శాతం నుంచి 15 శాతం వరకూ లెక్కగట్టాయి. అయితే రెండవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలతలో కనిపిస్తున్న పురోగతి నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్, అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం మూడీస్ తమ తొలి అంచనాలను మార్చుకున్నాయి. జూలై– సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాలు (నవంబర్ 27) వెలువడ్డానికి ముందే – గోల్డ్‌మన్ శాక్స్ తన క్రితం భారీ 14.8 శాతం క్షీణ అంచనాలను 10.3 శాతానికి సవరించింది. దీనిని మూడీస్ అనుసరిస్తూ, తన తొలి అంచనా 11.5 శాతం నుంచి 10.6 శాతానికి తగ్గించింది. అనుకున్నట్లుగానే నవంబర్ 27వ తేదీన వెలువడిన సెప్టెంబర్ గణాంకాలు అంచనాలకన్నా మెరుగ్గా వెలువడ్డాయి. క్షీణత 7.5 శాతానికి కట్టడి జరిగింది. త్రైమాసికాల పరంగా చూస్తే, జీడీపీ విలువల్లో వృద్ధి 22 శాతంపైగా నమోదయ్యింది. ఈ సందర్భంలో నవంబర్ 30వ తేదీన ఎస్అండ్పీ ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థపై ఒక నివేదికను విడుదల చేస్తూ, భారత్ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు తమ వైఖరిని మార్చుకోబోమని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవవత్సరం (2020 ఏప్రిల్–2021 మార్చి) తమ క్షీణ అంచనాను 9 శాతంగానే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇంకా కరోనా కష్టాలు కొనసాగుతున్నాయని, స్థూల దేశీయోత్పత్తిపై ఇవి ప్రభావం చూపడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సూచించింది.అయితే ఫిచ్ (క్షీణత 10.5 శాతం నుంచి 9.4 శాతానికి), ఏడీబీ (–9 శాతం నుంచి – 8 శాతానికి) ఆర్బీఐ ( క్షీణత 9.5 శాతం నుంచి 7.5 శాతానికి)సహా ఎస్అండ్పీ పరిశోధనా విభాగం క్రిసిల్ (– 9 శాతం నుంచి – 7.7 శాతానికి )సైతం క్షీణ అంచనాలను తగ్గించాయి. ఈ నేపథ్యంలోనే పక్షం రోజుల్లో ఎస్అండ్పీ కూడా భారత్ ఎకానమీపై తన వైఖరి మార్చుకుంది. -
15 నెలల్లో కోవిడ్ ముందు స్థాయికి ఎకానమీ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికి కోవిడ్–19 ముందస్తు స్థాయికి మెరుగుపడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 8%లోపే ఉంటుందన్నది కూడా తమ అంచనా అని ఒక వార్తా సంస్థతో పేర్కొన్నారు. భారత్ రికవరీ ఊహించినదానికన్నా వేగంగా ఉందన్నారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియ పెట్టుబడుల ఉపసంహరణ నిరంతర ప్రక్రియని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేకంగా దృష్టి సారించిందనీ, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్ఈ)తన వాటా అమ్మకం ద్వారా రూ.1.20 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో వాటాల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల సమీకరణ లక్ష్యం. బ్యాంకింగ్ సేవల విస్తరణ జరగాలి బ్యాంకింగ్ సేవల విస్తరణ మరింతగా జరగాలని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జీడీపీలో ప్రైవేటు రుణ నిష్పత్తి ప్రస్తుతం 50 శాతంగానే ఉన్నదని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నిష్పత్తి 100 శాతానికిపైగా ఉందని అన్నారు. వ్యవసాయ రంగం గురించి ఆయన మాట్లాడుతూ, రసాయనాల రహిత సహజ సాగు కార్యక్రమాల పురోగతిపై నీతి ఆయోగ్ దృష్టి సారిస్తోందన్నారు. ఈ దిశలో ముందడుగు వేయడానికి తన వంతు కృషి చేస్తుందన్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయాలు భారీగా తగ్గుతాయని అన్నారు. అలాగే పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వివరించారు. వ్యవసాయ రంగంలో పోటీతత్వం, అలాగే రైతుల ఆదాయాల పెరుగుదల వంటి అంశాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్ కోసం స్వీయ నియంత్రణ సంస్థ నీతి ఆయోగ్ సిఫార్సు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ రంగానికి సంబంధించి ఒక స్వీయ–నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. దీని పర్యవేక్షణ బాధ్యతలను స్వతంత్ర బోర్డుకు అప్పగించాలని సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు మాత్రమే ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్ ఆడేలా, మైనర్లను దూరంగా ఉంచేలా ఆంక్షలు ఉండాలని ఒక ముసాయిదా నివేదికలో పేర్కొంది. గవర్నెన్స్, చట్టాలు, పాలన తదితర రంగాల్లో పేరొందిన వ్యక్తులను స్వతంత్ర పర్యవేక్షణ బోర్డులో నియమించాలని అందులో సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఇటీవలి నివేదిక ప్రకారం ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య 2016 జూన్‌తో పోల్చితే, 2019 డిసెంబర్ నాటికి 212 శాతం వృద్ధి చెంది 9 కోట్ల మందికి పెరిగింది. 2023 నాటికి దీని ద్వారా 150 కోట్ల మేర ఆన్లైన్ లావాదేవీలు జరగొచ్చని అంచనా. -
ఊహించినదానికన్నా వేగంగా రికవరీ
న్యూఢిల్లీ: కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనావేస్తోంది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6 శాతం అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. కఠిన, దీర్ఘకాల లాక్డౌన్ అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇబ్బందులు... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని కూడా ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనావేసింది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత దీనికి కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి–మార్చి) కూడా ద్రవ్యోల్బణం ఆరు శాతం కన్నా పైనే ఉంటుందని విశ్లేషించింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రెపో మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని వారు అభిప్రాయడ్డారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్ రిటర్న్స అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. -
రాజన్ వ్యాఖ్యలు సరికాదు
గుడ్డివాళ్లు, ఒంటికన్ను రాజు కాకుండా మంచి పదాలు వాడాల్సింది: నిర్మలా న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గుడ్డివాళ్ల లోకంలో ఒంటికన్ను రాజులా ఉందన్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలను కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. భారత ఆర్థిక వ్యవస్థను వర్ణించడానికి రఘురామ్ రాజన్ మంచి మాటలు వాడి ఉండివుంటే బావుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెరుగుతున్నాయని, తయారీ రంగం పుంజుకుం టోందని, ద్రవ్యోల్బణం, కరంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉన్నాయని వివరించారు. రాజన్ చెప్పాలనుకున్న భావాన్ని మంచి పదాలు, మాటలతో చెబితే బావుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థ ఆశావహంగా ఉందని వర్ణించే రాజన్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుడ్డివాళ్ల లోకంలో ఒంటి కన్ను రాజులా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని వ్యాఖ్యానించారు.