ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నిర్మాత భారీ విరాళం | Producer kalaipuli s thanu Funds Rs 15 lakh to Film Federation of India | Sakshi
Sakshi News home page

ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నిర్మాత భారీ విరాళం

Published Tue, Aug 10 2021 8:15 AM | Last Updated on Tue, Aug 10 2021 8:26 AM

Producer kalaipuli s thanu Funds Rs 15 lakh to Film Federation of India - Sakshi

సాక్షి, చెన్నై: ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఆ సంస్థ అధ్యక్షుడు, నిర్మాత కలైపులి ఎస్‌.ధాను 15 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సమావేశానికి తొలిసారి తాను అధ్యక్షుడి హోదాలో పాల్గొన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సినిమాటోగ్రఫీ యాక్ట్‌ సవరణ తదితర అంశాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో నిర్మాత హీరాచంద్, రవికొట్టారకర, సి.కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, టిపి.అగర్వాల్‌ పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement