స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే రిస్క్ చాలా ఎక్కువ. కనుక స్వల్ప కాల పెట్టుబడులకు ఇవి అనుకూలంగా ఉండవు. కానీ, దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించగలిగే వీలుంటే ఈ పథకాలు అద్భుతమైన రాబడులతో ఇన్వెస్టర్లకు సంపద తెచి్చపెడతాయి. ఉదాహరణకు పదేళ్ల కాలం కోసం స్మాల్‌క్యాప్ పథకాన్ని ఎంచుకుని ప్రతీ నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుందాం. పదేళ్లకు మీ పెట్టుబడులను తీసుకునే సమయంలో మార్కెట్లు ఏదేనీ కారణంతో భారీగా పతనం అయితే.. అప్పుడు పెట్టుబడులను మరో ఏడాది రెండేళ్ల పాటు కొనసాగించే వెసులుబాటు ఉన్న వారే ఈ పథకాల వైపు చూడాలి.
ఎందుకంటే మార్కెట్ల కరెక్షన్లలో ఎక్కువగా నష్టపోయేవి స్మాల్‌క్యాప్ స్టాక్స్. ఆ సమయంలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే రాబడులను పెద్ద మొత్తంలో కోల్పోవాల్సి వస్తుంది. ప్రతీ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి కొంత మొత్తాన్ని స్మాల్‌క్యాప్ పథకాలకు కేటాయించుకోవడం ద్వారా మెరుగైన రాబడులు వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగంలో దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ (గతంలో రిలయన్స్ స్మాల్‌క్యాప్ ఫండ్) పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.
రాబడులు
ఈ పథకం డైరెక్ట్ ప్లాన్‌లో గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులు ఉన్నాయంటే పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్ల కాలంలో ఏటా 32 శాతం రాబడిని తెచి్చపెట్టింది. అదే ఐదేళ్లలో ఏటా 29 శాతం, ఏడేళ్లలో 23.6 శాతం, పదేళ్లలో 28 శాతం చొప్పున రాబడులు అందించిన చరిత్ర ఈ పథకానికి ఉంది. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్‌ఐ సూచీ రాబడితో పోలిస్తే ఈ పథకమే ఎంతో మెరుగ్గా ఉండడాన్ని గమనించొచ్చు. బీఎస్‌ఈ 250 స్మాల్‌క్యాప్ టీఆర్‌ఐతో పోల్చినప్పుడు వివిధ కాలాల్లో గరిష్టంగా 10 శాతం వరకు అధిక రాబడులను అందించింది. స్మాల్‌క్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూసినా సరే నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్ పథకంలోనే 8 శాతం వరకు అధిక రాబడి ఉంది.
పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో
స్మాల్‌క్యాప్ పథకం అయినప్పటికీ పెట్టుబడుల్లో స్మాల్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు వెయిటేజీ ఇవ్వడాన్ని గమనించొచ్చు. భవిష్యత్తులో మలీ్టబ్యాగర్ కాగల కంపెనీలను గుర్తించడంలో ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పథకం ఎంచుకున్న కంపెనీల్లో చాలా వరకు తర్వాతి కాలంలో మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ కంపెనీలుగా మారినవి ఉన్నాయి. అందుకే మిడ్‌క్యాప్‌లోనూ గణనీయంగా పెట్టుబడులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.46,044 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
స్మాల్ క్యాప్ పథకం అయినప్పటికీ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 37 శాతం పెట్టుబడులే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలలో 44 శాతం, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 19 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. ఈ పథకం నిర్వహణలో 202 స్టాక్స్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ పథకం కావడం, భారీ పెట్టుబడుల నిర్వహణ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీల్లో 18.79 శాతం ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 12.42 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 8 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment