PM Shehbaz Sharif Says Global Lenders Have Money To Fund Wars But Not Cash-Strapped Pakistan - Sakshi
Sakshi News home page

యుద్ధానికి సై అంటారు, మమ్మల్ని పట్టించుకోరు.. ఆదుకోండి ప్లీజ్‌!: పాక్‌ ప్రధాని

Published Fri, Jun 23 2023 4:19 PM | Last Updated on Fri, Jun 23 2023 5:07 PM

PM Shehbaz Sharif Says Global Lenders Have Money To Fund Wars But Not Cash Strapped Pakistan - Sakshi

పాకిస్థాన్‌లో నగదు నిల్వలు అడుగంటిపోయాయి. ఐఎమ్‌ఎఫ్‌ నుంచి రావాల్సిన నగదు అందకపోవడంతో ఆ దేశం పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్యారిస్ వేదికగా స్పందించారు. 'యుద్దాలకు ఇవ్వడానికి ప్రపంచ రుణదాతల దగ్గర డబ్బులు ఉంటాయి.. కానీ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు ఇవ్వడానికి మాత్రం ఉండవు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యారిస్‌లో రెండు రోజులపాటు జరుగుతున్న గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్‌లో ఈ మేరకు ఆయన మాట్లాడారు. 

'యుద్ధం జరుగుతున్న దేశానికి ఏమైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలకు కూడా కావాల్సినవన్నీ సమకూర్చుతారు. వేల మంది ప్రాణాలను రక్షించడానికి మాత్రం నిధులను ఇవ్వడానికి వెనకంజ వేస్తారు. పాకిస్థాన్ విషయానికి వచ్చే సరిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి సంపన్న దేశాలు. మా దేశంలో ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది' అని షరీఫ్ ఆవేదన వ‍్యక్తం చేశారు. 

గతేడాది వరదలతో నష్టపోయిన పాక్‌ను రక్షించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి వేల కోట్లు సొంత జేబు నుంచి ఖర్చు చేశామని షెహబాజ్ షరీఫ్ గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్ చర్చలు జరుపుతుంది. ప్రధానంగా వాతావరణ విపత్తుల కారణంగా చితికిపోయిన దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటుంది.

జూన్ చివరి నాటికి ఐఎమ్ఎఫ్‌ నుంచి పాక్‌కు రావాల్సిన 6.5 బిలియన్ డాలర్ల రుణ కార్యక్రమం గడువు ముగుస్తుంది. గత సంవత్సరం నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న 1.1 బిలియన్ డాలర్ల రుణాన్నైనా విడుదల చేయాలని ఐఎమ్‌ఎఫ్‌కు షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి నిలిచిపోయిన నిధులపై ప్రశ‍్నించగా తనను పాక్ ఆర్థిక మంత్రి చెంపపై కొట్టాడని ఓ విలేఖరి ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: State Dinner Menu: వైట్‌ హౌస్‌లో మోదీకి అదిరే ఆతిథ్యం.. డిన్నర్‌ మెనూలో ఏముందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement