Lyca Productions Subakaran donates Rs 50 lakh to TN Producers Council - Sakshi
Sakshi News home page

Lyca Productions: నిర్మాతల సంఘానికి లైకా ప్రొడక్షన్స్‌ అధినేత భారీ విరాళం

Published Thu, Mar 30 2023 8:08 AM | Last Updated on Thu, Mar 30 2023 11:43 AM

Lyca Production Founder Subakaran Donates Rs 50 Lakhs to Producers Council - Sakshi

భారీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత సుభాస్కరన్‌ ఇటీవల మణిరత్నం మద్రాస్‌ టాకీస్‌ సంస్థతో కలిసి పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌– 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్‌ మొదలగు ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది.

వీటితో పాటు మరిన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా మణిరత్నం దర్శకత్వంలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన పొన్నియిన్‌ సెల్వన్‌– 2 చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తరపున తమిళ నిర్మాతల సంఘానికి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ చెక్కును లైకా సంస్థ అధినేత సుభాస్కరన్‌ నిర్మాతల సంఘం అధ్యక్షుడు మురళి రామస్వామికి అందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement