Help Make BJP And India Strong: భారతీయ జనతా పార్టీకి "మైక్రో డొనేషన్స్" ద్వారా సహాయం చేయాలని బీజేపీ మద్దతుదారులను కోరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌లో ..." నేను భారతీయ జనతా పార్టీ ఫండ్‌కి రూ. 1,000 విరాళం ఇచ్చాను. ఎల్లప్పుడూ దేశానికి మొదటి స్థానం ఇవ్వాలనేది నా కోరిక. మా క్యాడర్ ద్వారా జీవితాంతం నిస్వార్థ సేవ చేసే సంస్కృతి మీ సూక్ష్మ విరాళం ద్వారా మరింత బలోపేతం అవుతుంది. బీజేపీని బలోపేతం చేయడంలో సహాయపడండి.
(చదవండి: ప్రపంచపు తొలి డ్యూయల్ మోడ్ వాహనం
అలాగే భారతదేశాన్ని బలంగా తయారు చేయడంలో సహాకరించండి ' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అంతేకాదు బీజేపీ నిధికి మోదీ విరాళంగా ఇచ్చిన రసీదు కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ జెపి నడ్డా కూడా పార్టీ ఫండ్‌కు రూ. 1,000 విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు నడ్డా ట్విట్టర్‌లో... నేను నమో యాప్ అనే 'డొనేషన్' మాడ్యూల్‌ని ఉపయోగించి బీజెపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. అంతేకాదు రిఫరల్ కోడ్‌ని ఉపయోగించి ఈ ప్రజా ఉద్యమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా కనెక్ట్ చేయవచ్చు" అని ట్విట్ చేశారు. అయితే ఈ విరాళాలు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా బీజేపీ ఈ భారీ డ్రైవ్‌ని ప్రారంభించింది. పైగా సూక్ష్మ విరాళాలు రూ. 5 నుండి రూ. 1,000 వరకు ఉండవచ్చు అని నడ్డా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!)
Comments
Please login to add a commentAdd a comment