
ముంబై: ఈ రోజుల్లో పెళ్లంటే అంగరంగ వైభవంగా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ప్రజలు జరుపుకుంటున్నారు. ఇక ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే ఓ రేంజ్‌లో వాళ్ల వివాహ వేడుకలు ఉంటాయన్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో కొన్ని పెళ్లి వేడుకలు మీడియాను సైతం ఆకర్షిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా అసలు హంగామా లేకుండానే నిరాడంబరంగా ఇద్దరు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది.
ఈ పెళ్లికి ఖర్చు కేవలం రూ.500
వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ధార్ జిల్లాలో.. ఓ ఆర్మీ మేజర్ , సిటీ మెజిస్ట్రేట్‌లు చాలా సింపుల్‌గా వాళ్ల పెళ్లి తతంగాన్ని ముగించేశారు. ఇరుకుటుంబాల సమక్షంలో వీరివురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్‌గా అంటే కేవలం దండలు, స్విట్లు కోసం రూ.500 ఖర్చు చేశారంతే. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్‌గా లడఖ్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరూ భోపాల్‌కు చెందినవారు.
కాగా వీరివురి వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. అయితే మేజర్ అంకిత్ చతుర్వేది లడఖ్ లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌గా కరోనా అడ్డుకట్టకు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్న కారణంగా వీరి వివాహ తేది వాయిదా పడుతూ చివరకు ఇలా చేసుకున్నారు. వివాహం అనంతరం శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. "వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు" ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment