government emplyees
-
ఆ ఎంపీడీవో నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ ఉద్యోగులే.. మరో చెల్లె, తమ్ముడు..
సాక్షి,భైంసా(అదిలాబాద్): భైంసా ఎంపీడీవోగా పనిచేస్తున్న అర్ల గంగాధర్ తోబుట్టువులంతా ప్రభుత్వ కొలువులు సాధించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లోని భాగ్యనగర్‌కాలనీలో అర్ల గంగాధర్ కుటుంబం నివసిస్తుంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన అర్ల గంగారం–లక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. ఇందులో పెద్దవాడైన గంగాధర్‌తోపాటు అందరినీ ఈ దంపతులు చదివించారు. అర్ల గంగారాం కోపరేటివ్ బ్యాంకులో పనిచేసేవారు. లక్ష్మి నిరక్ష్యరాసురాలు. అందరిలో పెద్దవాడైన గంగాధర్ 2001–05వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తర్వాత గ్రూప్–2 ఉద్యోగం సాధించాడు. 2017 మార్చి 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశాడు. ఆయన సహచరిని కరుణశ్రీ మల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గంగాధర్ అటు తర్వాత మళ్లీ ఎక్సైజ్‌శాఖలో కూడా కొలువు సాధించాడు. మూడు ఉద్యోగాలు సాధించిన గంగాధర్ తన తోబుట్టువులైన ఐదుగురు చెల్లెల్లు, ఒక తమ్ముడిని సైతం చదివించాడు. నలుగురు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించగా మరో చెల్లె, తమ్ముడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో ఉద్యోగం సాధిస్తామని చెబుతున్నారు. డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా నాలుగవ చెల్లె భాగ్యలక్ష్మి ఆదిలాబాద్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా కొలువు సాధించింది. ఎంతో కష్టపడి చదివి లెక్చరర్‌గా ఎంపికైంది. చిన్నతనం నుంచి అక్కయ్యలతో కలిసి చదివి తన ప్రతిభతో ఉద్యోగం సాధించింది. – భాగ్యలక్ష్మి, ఉమెన్స్ డిగ్రీ కళాశాల లెక్చరర్ ఆదిలాబాద్ ప్రైవేటు అధ్యాపకుడిగా గంగాధర్ తమ్ముడు శశిధర్ ఎంఏ బీఎడ్ పూర్తిచేశాడు. ఈయన ప్రైవేటు డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అన్నయ్య సహకారంతోనే చదువు పూర్తిచేశాడు. ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించి తీరుతానని చెబుతున్నాడు. కుటుంబంలో ఉన్నవారంతా ఉద్యోగాల్లో ఉన్నారని ఇక తాను కూడా ఉద్యోగం సాధిస్తానని చెబుతున్నాడు. – శశిధర్, ప్రైవేటు డిగ్రీ కళాశాల లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదవ చెల్లె ఉదయరాణి ఖమ్మం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షి యల్ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా రు. 2019లో జూనియర్ లెక్చరర్‌గా కొలువుసాధించిన ఉదయరాణి ఏడాదిలోనే మళ్లీ డిగ్రీ లెక్చరర్‌గా ఎంపికైంది. చదువులో చురుకుగా ఉండే ఉదయరాణి గ్రూప్–1కు సైతం సిద్ధమవుతుంది. – ఉదయరాణి, ఖమ్మం డిగ్రీ కళాశాల లెక్చరర్ కష్టపడితేనే ఫలితం మా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం. ఐదుగురు చెల్లెళ్లు్ల, తమ్ముడిని కష్టపడి ఉన్నత చదువులు చదివించాం. నలుగరు చెల్లెల్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఈ నోటిఫికేషన్లో నా తోబుట్టువుల్లో మిగిలి ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తారని నమ్మకం ఉంది. కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. ఎంత పోటీ ఉన్న ప్రతిభ ఉన్న వారికి కొలువులు వచ్చితీరుతాయి. – అర్ల గంగాధర్, ఎంపీడీవో భైంసా అంగన్వాడీ టీచర్‌గా గంగాధర్ మొదటి చెల్లె గంగామణి కుభీర్ మండలం చొండి అంగన్వాడీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఉపాధ్యాయురాలిగా అన్నింటిల్లోనూ ముందువరుసలో ఉంటుంది. ఆమె పనితీరుకు మెచ్చి ఐసీడీఎస్ అధికారులు, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం సన్మానించారు. కోచింగ్ ఇస్తూ రెండవ చెల్లె సంతోషిణి ఎంఏ బీఎడ్ పూర్తిచేసింది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న సంతోషిణి ప్రతిఏటా గురుకుల పాఠశాలలో నిర్వహించే ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇస్తుంది. సంతోషిణి వద్ద కోచింగ్ తీసుకున్న విద్యార్థులంతా ఉద్యోగాలు సాధించారు. – సంతోషిణి, ప్రైవేటు ఉపాధ్యాయురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా మూడవ చెల్లె లావణ్య ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. సొనాలలో కష్టపడి చదువుకున్న లావణ్య పెద్దన్న గంగాధర్ సహకారంతో ఉద్యోగాన్ని సాధించింది. అన్నయ్య చెప్పిన విధంగా నడుచుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ గ్రూప్–2కు సైతం సిద్ధమవుతుంది. – లావణ్య, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చదవండి: Pub Drugs Case: డ్రగ్స్ అమ్మేది వాళ్లే.. ఎమ్మెల్యే బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు -
ఉద్యోగుల మేలుకే ప్రభుత్వ ప్రాధాన్యం
సాక్షి, అమరావతి/ఆలూరు/కాకినాడ రూరల్/ఒంగోలు సబర్బన్/అద్దంకి: ఉద్యోగుల మేలుకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పలువురు మంత్రులు తెలిపారు. అందువల్ల ఉద్యోగులు ఆందోళనలు, సమ్మెలు విరమించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి సదా సిద్ధంగా ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ముఖ్య భాగమన్నారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. ఉద్యోగుల ఆందోళనలపై గురువారం పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎవరు ఏమన్నారంటే.. బాబు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులు. ఉద్యోగులు చర్చలకు రావాలని మంత్రుల కమిటీ కోరుతోంది. సీఎం జగన్ ఉద్యోగులందరినీ కుటుంబ సభ్యుల్లా చూస్తారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఉద్యోగులకు మేలు చేశారా? ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే పప్పుబెల్లాల్లా పంచుతున్నారంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. – కె.నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వం చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనడం అబద్ధం. ఉద్యోగులతో చర్చల కోసం సీఎం వైఎస్ జగన్ మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎక్కడా ఉద్యోగులను గృహనిర్బంధంలోకి తీసుకోలేదు. అయితే అనుమతి లేని సభలకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పాం. – మేకతోటి సుచరిత, హోం శాఖ మంత్రి మొండి వైఖరితో ఉన్నామనడం సరికాదు.. మేము మొండి వైఖరితో ఉన్నామని ఉద్యోగులు విమర్శించడం సరికాదు. కొత్త జీతాలు ప్రాసెస్ చేశాక వాటిని ఆపాలని చెప్పడం భావ్యం కాదు. ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఆయన ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను ఏం ఉద్ధరించారు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. – బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం.. చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. నూతన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. విద్యుత్ రంగం అప్పుల్లో ఉన్నా ఆ సంస్థల ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చాం. ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ఉద్యోగులకు మేలు చేస్తుంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది. – బాలినేని శ్రీనివాసరెడ్డి, అటవీ, ఇంధన శాఖ మంత్రి రోడ్డెక్కితే సమస్య పరిష్కారం కాదు.. ఉద్యోగులు పీఆర్సీని సమస్యగా భావిస్తున్నారు కాబట్టి వారి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందువల్ల మంత్రుల కమిటీ వద్దకు ఉద్యోగులు చర్చలకు రావాలి. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలనే కొందరు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలా జగన్ ప్రభుత్వం ఉద్యోగులను వెంటాడి వేధించేది కాదు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఉద్యోగుల్లో ఎవరికీ అన్యాయం జరగదు.. ఉద్యోగులకు మేలు చేసే సీఎం జగన్ మనకు ఉన్నారు. మీరంతా మా కుటుంబ సభ్యులు. ఎవరికీ అన్యాయం జరగదు. 2008, 2018 నాటి డీఎస్సీలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి వైఎస్ జగన్ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య ఉన్నా మంత్రుల కమిటీతో చర్చించండి. – ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు.. ఉద్యోగులు పట్టుదలకు పోవద్దు. ప్రభుత్వం అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. రెండేళ్లుగా కరోనాతో అన్ని వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ప్రభుత్వమే ఉద్యోగులకు మరింతగా మేలు చేస్తుంది. ఉద్యోగులంతా మా ప్రభుత్వంలో కుటుంబ సభ్యులే. – పి.విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉద్యోగులంటే సీఎంకు ప్రత్యేకమైన అభిమానం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలున్నాయని భావిస్తే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందువల్ల వారు నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో అర్థం లేదు. ఉద్యోగుల పక్షపాతి.. సీఎం వైఎస్ జగన్. ఉద్యోగులంటే సీఎంకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను నానా బాధలకు గురి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారు. – అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రి ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు నూతన పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగడం మంచిది కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. మొండిపట్టు పట్టడం తగదు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. – గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి -
కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!
ఒక పక్క కరోనా సమస్యతో ఆర్థిక సంక్షోభం. మరో వైపు ఉద్యోగులు తమ జీతాలు మరింత పెంచాల్సిందేనన్న డిమాండ్‌తో ఆందోళన. గత కొద్ది దశాబ్దాలలో ఇంత చిత్రమైన సమ్మె ఆలోచన జరిగి ఉండకపోవచ్చని అనుభవజ్ఞుల వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం హెచ్ఆర్ఎ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయిస్తే, దానిపై సమ్మెకు వెళ్లడమా? ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిందనీ, దేశంలో బాగా జీతాలు ఇచ్చే రాష్ట్రాలలో ఏపీ ఒకటి అనీ ఇదే ఎన్జీవో నేతలు అంగీకరిస్తూనే సమ్మె చేస్తామనడం విడ్డూరం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిమాండ్లు ఉండ వచ్చు. వేతన సవరణలో తమకు నష్టం జరిగిందని లెక్కలు వేసుకుని ఉండవచ్చు. ఉద్యోగులకు జీతాలు ఇరవైశాతం పెరుగుతాయని చీఫ్ సెక్రటరీతో సహా ఆర్థిక శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. అయినా ఉద్యోగ సంఘాల నేతలు కన్విన్స్ కాలేదు. ఏకంగా సమ్మె నోటీసు ఇచ్చారు. పీఆర్సీ జీఓలు రద్దు చేసేవరకు తాము మంత్రుల కమిటీతో చర్చలు జరపబోమని వారు అంటున్నారు. వాళ్ల సమస్యలను ప్రభుత్వానికి చెప్పవచ్చు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. వారి సహకారం లేకుండా ఏ ప్రభుత్వం తాను అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయ లేదు. ఇంటి అద్దె అలవెన్స్‌లో కొంత తగ్గిందన్నది వారి భావన. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ఉద్యోగులకు ఏడాదికి ఇరవై, ముప్పై వేల నష్టం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో వీరికి రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ఇరవై లక్షల నుంచి పాతిక లక్షల ప్రయోజనం కలుగుతుంది. దీని గురించి ఆలోచించరా! ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులు తప్ప మిగిలినవారు తాము ప్రమోషన్లు కోల్పోతామని బాధ పడుతున్నారని కొందరు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాతైనా ప్రమోషన్లు వస్తాయి కదా! అదే సమయంలో లక్షల రూపాయల అద నపు జీతం లభిస్తుంది కదా! కొందరు ఎన్జీవో నేతలు మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. వారు ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల పొడిగింపును వాడుకోకుండా వదిలేస్తారా? ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల పట్ల అభిమానంతో ఇరవై శాతం తాత్కాలిక భృతిని ఇరవై ఏడు శాతం చేశారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు వారి పని వారు చేసుకుని టైమ్ ప్రకారం ఇళ్లకు వెళ్లిపోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పనిభారం తగ్గింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో జన్మభూమి, ఇతర కార్యక్రమాల పేరుతో ఒక టైమ్ లేకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. సమ్మెకు వెళితే మీ సంగతి చూడవలసి వస్తుందని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు హెచ్చరించిన ఘట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాసిన ‘మనసులో మాట’ పుస్త కంలో లక్ష మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారనీ, వారిని ప్రూన్ చేయాలనీ రాసిన విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చదివి వినిపించారు. చంద్రబాబు యాభైకి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు. పైగా అది గొప్ప సంస్కరణగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడు తుండవచ్చు. ఇక తెలుగుదేశానికి మద్దతిచ్చే మీడియా వీలైనంతగా ఉద్యోగులను రెచ్చగొడుతోంది. ఇవే పత్రికలు తమ సంపాదకీయాలలో ఉద్యోగ వ్యయం తగ్గించాలని రాసిన విషయం మర్చిపోకూడదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కార్మిక సంఘాలను రద్దు చేస్తామని హెచ్చరిం చినా, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామని అన్నా ఆయనలోని సంస్కరణలు ఈ పత్రికలకు కనిపించేవి. ఇప్పుడు జీతాలు పెరుగుతున్నా, పెద్ద సంఖ్యలో ఉద్యో గాలు ఇచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ వ్యతిరేక ప్రభు త్వంగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాయి. కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. సుమారు ముప్పైవేల కోట్ల ఆదాయం తగ్గిందనీ, అయినా ఉద్యోగు లకు ఇరవై శాతం జీతాలు పెరుగుతున్నాయనీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో కొత్త జీతాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తమకు జీతాలు ఇంకా పెంచాలని అడిగితే బాగుంటుంది. అదే సమ యంలో సంక్షేమ కార్యక్రమాలను అప్పు చేసి అమలు చేయడం లేదా అని ప్రశ్నించవచ్చు. రెక్కాడితే గానీ డొక్కా డని బడుగు జీవులతో వీరిని పోల్చరాదు. కరోనాలో ఉపాధి కోల్పోయి, నానా తంటాలు పడుతున్న పేదలకు ప్రభుత్వ స్కీములు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నది వాస్తవం. గ్రామ, సచివాలయ వ్యవస్థల ద్వారా లక్షన్నర మందికి జగన్ ఉపాధి కల్పించారు. వారికి కూడా స్కేల్ వర్తింపజేయవలసి ఉంది. ఆ వ్యయాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచారు. ఉద్యోగులకు పెరిగిన జీతాల వల్ల 10,700 కోట్ల అదనపు భారం పడనుండగా, అవుట్ సోర్సింగ్ వారికి వేతనాలు పెంచడంతో మరో 780 కోట్ల అదనపు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి ఉద్యోగులు సహకరిస్తే అంతిమంగా వీరికే నష్టం జరుగుతుంది. వీటన్నిటి గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాలి. తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు డబుల్ గేమ్ ఆడుతూ ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్లు నటించ వచ్చు. కానీ ఉద్యోగులు భ్రమలలోకి వెళ్లకుండా ఉండాలి. అంతిమంగా ఒక మాట చెప్పాలి. లక్ష ఉద్యోగాలు తొలగిం చాలని చెప్పినవారికి మద్దతు ఇస్తారా? లక్ష ఉద్యోగాలు ఇచ్చినవారికి మద్దతు ఇస్తారా అన్నది ఉద్యోగ సంఘాలు తేల్చుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
మొత్తం నాలుగు రోజుల సెలవులు! అక్కడి ఉద్యోగులకు సర్కార్ బంపరాఫర్
సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?.. అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి. To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave. I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB — Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022 టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్‌ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్‌పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చదవండి: టెస్లాలో మనోడు.. తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర -
నిద్రమత్తు నుంచి తేరుకునేలోపు ఏసీబీ దాడులు.. ఆ ఇంట్లో ఎంత దొరికిందంటే!
సాక్షి, బెంగళూరు: తెల్లవారుజామునే లంచగొండి అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. నిద్రమత్తు నుంచి తేరుకునేలోపు ఇళ్లలో ఏసీబీ అధికారులు చొరబడ్డారు. అప్పుడప్పుడు జరిగినట్లు పారిపోయే అవకాశం కూడా లేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వేకువజామున 15 మంది అధికారులు, ఉద్యోగుల నివాసాలు, వారి సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఏకకాలంలో 60 చోట్ల సాగిన సోదాల్లో 408 మంది ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. కొంతకాలంగా నిఘా పెట్టిన ఏసీబీ.. విపరీతంగా ఆస్తులు ఆర్జించిన, లంచాలు తీసుకుంటున్న అధికారులను లక్ష్యంగా చేసుకుంది. విద్యుత్ ఉద్యోగి వద్ద విదేశీ నగదు ► బెళగావి హెస్కాంలో లైన్ మెకానిక్‌గా ఉన్న నేతాజీ హీరాజీ పాటిల్ నివాసంలో సోదాలు చేయగా విదేశీ కరెన్సీతో పాటు ప్లాటినం ఆభరణాలు లభ్యం అయ్యాయి. అనేకమంది అధికారుల ఇళ్లలో పెద్దమొత్తాల్లో నగదు, బంగారం, వెండి సొత్తు, ఆస్తి పత్రాలు బయటపడ్డాయి. వీటిలో లెక్కలు లేనివే అధికం. పలువురి వద్ద విలాసవంతమైన కార్లు, బైక్‌లు ఉన్నట్లు తేలింది. సోదాలు, బ్యాంకు ఖాతాల పరిశీలన ఇంకా కొనసాగుతోంది. దాడులు ఎవరెవరి మీద ► కేఎస్ లింగేగౌడ, ఈఈ, స్మార్ట్ సిటీ, మంగళూరు ► కె.శ్రీనివాస్, ఈఈ, హెచ్ఎల్బీసీ, మండ్య జిల్లా ► లక్ష్మీ నరసింహయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్, దొడ్డబళ్లాపుర ► వాసుదేవ, యోజనా వ్యవస్థాపక నిర్మాణ కేంద్రం, బెంగళూరు ► బి.కృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్, నందినీ డైరీ, బెంగళూరు ► టీఎస్ రుద్రేశప్ప, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ, గదగ్ జిల్లా ► ఏకే మస్తి, కోఆపరేటివ్ ఆఫీసర్, సవదత్తి, బైలహŸంగల, బెళగావి జిల్లా ► సదాశివ మారలింగణ్ణనవార్, ఇన్స్పెక్టర్, గోకాక్ ► నేతాజీ హీరాజీ పాటిల్, గ్రూప్ సి, బెళగావి ► కేఎస్ శివానంద, విశ్రాంత సబ్ రిజిస్ట్రార్, బళ్లారి ► రాజశేఖర్, ఫిజియోథెరపిస్ట్, యలహంక ఆస్పత్రి, బెంగళూరు ► మాయణ్ణ, ఎఫ్‌డీఏ, బీబీఎంపీ రోడ్డు పనులు, బెంగళూరు ► ఎల్సీ నాగరాజు, సకాల, బెంగళూరు ► జీవీ గిరి, గ్రూప్డి, బీబీఎంపీ, యశవంతపుర ► శాంతగౌడ బిరాదార్, పీడబ్ల్యూడీ ఇంజినీర్, కలబురిగి అక్రమాల ఆర్ఐకి షాక్ దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకా కసబా క్లస్టర్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మినరసింహయ్య ఇంట్లో, అతని బంధువుల ఇళ్లలో సోదాల్లో భారీగా బంగారు,వెండి ఆభరణాలు దొరికాయి. హెసరఘట్టలో అక్రమ ఆస్తి,పలు చోట్ల సైట్లు ఉన్నట్టు ధృవీకరించే పత్రాలు దాడిలో లభించాయని సమాచారం. విలేజ్ అకౌంటెంట్‌గా 15 ఏళ్ల కిందట ఉద్యోగంలో చేరారు. నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి కోట్ల విలువ చేసే ఇతరుల ఆస్తిని సొంతవాళ్లకు కట్టబెట్టినట్లు గతంలో కేసు నమోదైంది. ఆ ఇంట్లో 7 కేజీల పసిడి శివమొగ్గ: నగరానికి చెందిన గదగ జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రుద్రేశప్ప ఇంటిలో 7 కేజీల బంగారం, కట్టల కొద్దీ డబ్బులు లభించినట్లు సమాచారం. శివమొగ్గలో పలుచోట్ల ఆయన ఆస్తులపై దాడులు జరిగాయి. బంగారు బిస్కెట్లు, నెక్లెస్‌లు, లెక్కలేనన్ని ఉంగరాలు బయటపడ్డాయి. చింతామణి: పట్టణంలోని మాళపల్లి ప్రాంతంలో నివాసం వున్న కేఎంఎఫ్ మేనేజర్ కృష్ణారెడ్డి ఇంట్లో ఏసీబీ డీఎస్పీ సుధీర్, ఎస్ఐ మంజునాథ్ సోదాలు చేశారు. చదవండి: స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత.. -
Afghanistan: మహిళా సిబ్బంది ఇళ్ల వద్దే ఉండాలి
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు మునుపటి నిరంకుశ విధానాలను ఒక్కటొక్కటిగా తెరపైకి తెస్తున్నారు. రెండు రోజుల క్రితం మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు.. తాజాగా రాజధాని కాబూల్ పాలక సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. తాత్కాలిక మేయర్ హమ్దుల్లా నమోనీ ఆదివారం తన మొట్టమొదటి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘మహిళా సిబ్బందిని ప్రస్తుతానికి ఇళ్ల వద్దే ఉండిపోవాలని కోరాము. మరో ప్రత్యామ్నాయం లేనందున డిజైన్, ఇంజినీరింగ్ వంటి విభాగాలతోపాటు మహిళల టాయిలెట్ల వద్ద పనిచేసే వారిని మాత్రం విధులకు హాజరు కావాలని కోరాం’ అని అన్నారు. అయితే, మొత్తం సిబ్బందిలో ఎందరిని ఇళ్లకు పరిమితం చేసిందీ ఆయన వెల్లడించలేదు. కాబూల్ నగర పాలక సంస్థలో సుమారు 3 వేల మంది పనిచేస్తుండగా అందులో వెయ్యి మంది వరకు మహిళలున్నట్లు అంచనా. కాగా, తాలిబన్ల నిర్ణయంపై ఉద్యోగినులు కాబూల్‌లో ఆదివారం నిరసన తెలిపారు. తమ హక్కులను తాలిబన్లు లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛ లేని సమాజం మృత సమాజంతో సమానమన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాయబార కార్యాలయాలు, నేతల ప్రైవేట్ నివాసాల వద్ద ఉన్న భద్రతా వలయాలను తొలగిస్తున్నట్లు మేయర్ హమ్దుల్లా తెలిపారు. కాబూల్‌లో పౌరుల రక్షణకు తమదే బాధ్యతని చెప్పుకునేందుకు, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, మద్దతు చూరగొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. చదవండి: కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’ -
అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు.. సగం జీతం
భోపాల్: కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైన సంగతి తెలిసిందే. వేవ్ మీద వేవ్ ముంచుకొస్తూ.. జనాలను, ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దుబారా ఎక్కడవుతుందో గమనిస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహా.. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇస్తూ.. సగం జీతం ఇవ్వడానికి నిర్ణయించారు అదికారులు. ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేయకపోయినా సగం జీతం తీసుకునే పథకం ఇది. మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విధులకు హాజరు కాకుండా సగం జీతం తీసుకోవచ్చని చెబుతున్నారు. మిగతా సగం జీతాన్ని ప్రభుత్వం తన ఖాతాలో మిగుల్చుకుంటుంది. దీని వల్ల ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ పథకానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటున్నప్పటికి.. మన దేశంలో మాత్రం పనిలేకుండా సగం జీతం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. కరోనా వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఇప్పటికే 500కోట్ల రూపాయలు సమీకరించారు. -
ఆమె మెజిస్ట్రేట్, అతనో ఆర్మీ మేజర్.. వీరి పెళ్లి ఖర్చు కేవలం రూ.500
ముంబై: ఈ రోజుల్లో పెళ్లంటే అంగరంగ వైభవంగా ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ప్రజలు జరుపుకుంటున్నారు. ఇక ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే ఓ రేంజ్లో వాళ్ల వివాహ వేడుకలు ఉంటాయన్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో కొన్ని పెళ్లి వేడుకలు మీడియాను సైతం ఆకర్షిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా అసలు హంగామా లేకుండానే నిరాడంబరంగా ఇద్దరు ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ పెళ్లికి ఖర్చు కేవలం రూ.500 వివాహానికి విపరీతంగా ఖర్చులు పెడుతున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ ధార్ జిల్లాలో.. ఓ ఆర్మీ మేజర్ , సిటీ మెజిస్ట్రేట్లు చాలా సింపుల్‌గా వాళ్ల పెళ్లి తతంగాన్ని ముగించేశారు. ఇరుకుటుంబాల సమక్షంలో వీరివురు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎంత సింపుల్‌గా అంటే కేవలం దండలు, స్విట్లు కోసం రూ.500 ఖర్చు చేశారంతే. వధువు శివంగి జోషి ధార్ నగర మెజిస్ట్రేట్ కాగా, వరుడు అంకిత్ చతుర్వేది భారత సైన్యంలో మేజర్‌గా లడఖ్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరూ భోపాల్‌కు చెందినవారు. కాగా వీరివురి వివాహం రెండు సంవత్సరాల క్రితం నిశ్చయమైంది. అయితే మేజర్ అంకిత్ చతుర్వేది లడఖ్ లో పని చేస్తుండగా, శివంగి ధార్ జిల్లాలో సిటి మెజిస్ట్రేట్‌గా కరోనా అడ్డుకట్టకు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్న కారణంగా వీరి వివాహ తేది వాయిదా పడుతూ చివరకు ఇలా చేసుకున్నారు. వివాహం అనంతరం శివంగి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ఇంకా పూర్తిగా అంతమవలేదని, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలని అన్నారు. "వివాహానికి విపరీతంగా ఖర్చు చేయడం మాకు నచ్చలేదని, అందుకే మేమే ఇలా చేసుకున్నట్లు" ఆమె తెలిపారు. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు తీపికబురు!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని.. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు (కార్పొరేషన్లు), గ్రాంట్–ఇన్–ఇన్స్టిట్యూషన్లు, సొసైటీలు, యునివర్సిటీలు (నాన్ టీచింగ్ స్టాఫ్), రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని ఇతర సంస్థల్లో సైతం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఈ సంస్థలు తమ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అడాప్ట్ చేసుకున్నాయని సీఎస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కోసం తీసుకొచ్చిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ సూపర్‌అన్యూయేషన్) చట్ట సవరణ’గత మార్చి 30 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును సైతం అదే తేదీ నుంచి అమలుపర్చాలని ఆదేశించారు. ఆయా సంస్థల సర్వీసు రూల్స్‌కు ఈ మేరకు సవరణలు చేపట్టాలని కోరారు. ఇందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపునకు తీసుకున్న చర్యలపై నిర్దేశిత నమూనాలో రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించాలని సూచించారు. గత నెల 30 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించడంతో.. గత నెల 31న పదవీ విరమణ చేసిన పైన పేర్కొన్న సంస్థల ఉద్యోగుల సర్వీసు మరో మూడేళ్లు పెరిగింది. మళ్లీ వారు విధుల్లో చేరేందుకు అవకాశం లభించింది. -
తెలంగాణలో కొత్త చట్టం.. సంబరాల్లో ఉద్యోగులు!
హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తాజా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ–2021 .. మార్చి 30తో అమల్లోకి వచ్చి నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. దీంతో మార్చి 31తో పదవీ విరమణ చేయాల్సి ఉన్న వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ నిర్ణయంతో రానున్న మూడేళ్లలో 40 వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. -
రిటైర్మెంట్ వయసు పెంపుతో 43,811మందికి లబ్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 61 ఏళ్లకు పొడిగించడంతో 43,811 మందికి (2025 వరకు లెక్కిస్తే) ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కింది. వివిధ శాఖల్లో జనవరిలో 440 మంది, ఫిబ్రవరిలో 444 మంది పదవీ విరమణ పొందారు. ఈ నెలలో మరో 563 మంది రిటైర్ కావాల్సి ఉండగా సీఎం ప్రకటనతో వారు సర్వీసులో కొనసాగే అవకాశం దక్కింది. వారితో సహా ఈ ఏడాది పదవీ విరమణ పొందే వారు 7,954 మంది మరో మూడేళ్లు కొలువులో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది రిటైరయ్యే వారు, ఆ తరువాత ఏళ్లలో రిటైరయ్యే వారికి రిటైర్మెంట్ వయసు పెంపు ప్రయోజనం లభించనుంది. 2025 వరకు తీసుకుంటే మొత్తంగా 43,811 మందికి అదనంగా మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగే అవకాశం దక్కనుంది. మరోవైపు ఉద్యోగులు రిటైరయ్యాక లభించే రూ. 12 లక్షల గ్రాట్యుటీని రూ. 16 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో ఆ ప్రయోజనాలు సర్వీసులో ఉన్న అందరికీ లభించనున్నాయి. పీఆర్సీని 12 నెలల ముందు నుంచే అమలు చేస్తామని సీఎం పేర్కొనడంతో 2020 ఏప్రిల్ 1 నుంచి మార్చి 21 వరకు రిటైరైన 7,080 మంది పెన్షనర్లకు కూడా గ్రాట్యుటీ ప్రయోజనాలు అందనున్నాయి. వారికి అదనంగా రూ. 4 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. వాస్తవానికి పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. అయితే కటాఫ్‌గా దానినే తీసుకున్నా.. 2020 ఏప్రిల్ 1 నుంచే అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అంటే అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు బకాయిలను పెన్షన్‌లో జమ చేయనున్నారు. దీంతో పీఆర్సీ అమలు చేయాల్సిన 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31లోగా రిటైర్ అయిన దాదాపు 12,500 మందికి గ్రాట్యుటీ పెంపు రూపంలో అందాల్సిన రూ. 4 లక్షల అదనపు నగదు ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. -
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు
-
ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ (పీఆర్సీ) ప్రకటన కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ అమల్లోకి వస్తుందని తెలిపారు. అలానే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘కరోనాతో వేతన సవరణలో ఆలస్యం జరిగింది. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి. త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించింది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ఉద్యోగ సంఘాలతో స్వయంగా నేను కూడా చర్చించాను. 2014లో 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాం. ఈ సారి 30 శాతం ఫిట్మెంట్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచుతాం. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అలానే ‘‘హోంగార్డులు, వీఏవో, వీఆర్ఏ, ఆశావర్కర్లకు, అంగన్వాడీ, విద్యా వాలంటీర్లు, సెర్ప్ సిబ్బందికి పీఆర్సీ వర్తింప చేస్తాం. అలానే పెన్షనర్ల వయోపరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గిస్తాం. అర్హులైన ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు కల్పిస్తాం. దంపతులైన ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలకు ఆమోదం తెలుపుతున్నాం. మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేస్తాం అని కేసీఆర్ తెలిపారు. చదవండి: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు -
సర్కారు ఉద్యోగుల అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికార టీఆర్ఎస్ పారీ్టకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసి తమ అసమ్మతి తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు లభించాయి. ఉద్యోగుల సమస్యల పెండింగ్ వల్లే.. ఎన్నికల విధుల్లో ఉండే ఎన్నికల సిబ్బందితో పాటు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పనిచేసే సైనికులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కలి్పస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో వెనకబడిన అధికార టీఆర్ఎస్.. సాధారణ ప్రజానీకం ఈవీఎం/బ్యాలెట్ పేపర్ ద్వారా వేసే ఓట్లను దక్కించుకోవడంలో మాత్రం ముందంజలో ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీఎన్జీవోలు, ఎన్జీవోలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తితో ఉండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను దక్కించుకోవడంలో టీఆర్ఎస్ వెనకబడిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కొత్త పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విడుదలలో తీవ్ర జాప్యం, ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచకపోవడం, స్పౌజ్ కేటగిరీ కింద బదిలీలు చేపట్టకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చాలాకాలం నుంచి కోరుతున్నాయి. త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ గత మూడేళ్లలో పలుమార్లు హామీనిచి్చనా, నెరవేర్చలేకపోయారు. దీంతో ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావం ఏర్పడిందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఓట్ల నుంచి జీహెచ్ఎంసీ వరకు.. ఇక 2018లో జరిగిన శాసనసభ మధ్యంతర ఎన్నికల్లో మొత్తం 95,689 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా, అత్యధికంగా కాంగ్రెస్ పారీ్టకి 38,918, టీఆర్ఎస్కు 32,880, బీజేపీకు 9,567 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమికి వచ్చిన మొత్తం పోస్టల్ ఓట్ల సంఖ్య 46,651 కావడం గమనార్హం. అయితే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తంగా 46.87 శాతం ఓట్లను సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 28.43 శాతం ఓట్లతో 19 సీట్లు, బీజేపీ 6.98 శాతం ఓట్లతో కేవలం ఒకే సీటును గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పోలైన 906 పోస్టల్ ఓట్లలో బీజేపీకు 515 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు కేవలం 218 ఓట్లు మాత్రమే లభించాయి. ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా అసమ్మతి తెలియజేస్తున్నా, ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ(కరువు భత్యం)ల చెల్లింపులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డీఏల చెల్లింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కార్యాచరణను ప్రకటించింది. దాని ప్రకారం జూలై 2018 నాటి మొదటి డీఏను 2021 జనవరి జీతాల్లో చెల్లించాలని ఆదేశించింది. మొదటి డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 1035 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఇక జనవరి 2019 నాటి రెండో డీఏను 2021 జూలై జీతాల్లో చెల్లించాలని ఆదేశించగా.. దీని ద్వారా 2074 కోట్ల అదనపు భారం పడనుంది. (చదవండి: కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు నిలిపివేత) జూలై 2019 నాటి మూడో డీఏను 2022 జనవరి నుంచి చెల్లించాలని ఆదేశించారు. ఇక మూడో డీఏ చెల్లింపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై 3802 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. మొదటి డీఏ బకాయిలను జీపీఎఫ్‌లో 3 ఇన్స్టాల్మెంట్స్లో జమ చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంతో 4.49 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 3.57 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం డీఏల చెల్లింపుకు ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. వాయిదా పడ్డ జీతాలను కూడా నవంబర్ 1 నుంచి చెల్లించనున్నారు అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని ప్రశంసించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న సరే సీఎం జగన్ఉ ద్యోగులకు మేలు చేయడం ఆనందంగా ఉంది అన్నారు రెవిన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. వాయిదా పడ్డ జీతాలను, పెండింగ్ డీఏలను చెల్లించేందుకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సీఎం జగన్ ఉద్యోగులకు మేలు చేశారన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం సంతోషం అన్నారు. -
దండం పెడ్తాం.. మా ఉద్యోగాలు కాపాడండి
సాక్షి, ఖిల్లాఘనపురం (వనపర్తి) : మీకు దండం పెడతా.. హరితహారం పనులకు వచ్చి మా ఉద్యోగాలు కాపాడండి అంటూ షాపురం పంచాయతీ కార్యదర్శి రవితేజ, సర్పంచ్ బాలాంజనేయులతో కలిసి కూలీలకు చేతులెత్తి మొక్కారు. గ్రామాల్లో మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు కంచే ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించడం, ఇటీవల పలువురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు లోనైన పంచాయతీ కార్యదర్శి మంగళవారం ఉదయం గ్రామం నుంచి ఇతర పనులకు ట్రాలీ ఆటోపై వెళ్తున్న కూలీలను అడ్డుకుని హరితహారం పనులకు రావాలని కోరారు. -
సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగుల హర్షం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుకు సంబంధించి విధివిధానాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్ సమావేశాంలోనే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుసుకోవడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇంత త్వరగా తమ సమస్యలు పరిష్కరిస్తారని అనుకోలేదని ఆనందం వెలిబుచ్చుతున్నారు. (చదవండి : ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగులు పట్ల తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ అని, ఆయనకు ఉద్యోగులు అందరు రుణపడి ఉంటారన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, ఆశావర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపునకు, సామాజిక పింఛన్లను రూ.2,250 పెంపు, జనవరి 26 నుంచి అమ్మఒడి లాంటి కీలక పథకాలకు ఆమోద ముద్ర వేసింది. -
సీపీఎస్ రద్దు తో భరోసా!
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగం ఆర్థిక భద్రతకు సూచిక. కుటుంబానికి ఆర్థిక, సామాజిక భరోసా. అయితే, ఇది 2004కు ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి మాత్రమే. 2003లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పేరుతో ఈ ఆసరాపై దెబ్బకొట్టింది. దీంతో 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి ఆర్థిక భద్రత ఎండమావిలా మారింది. సమ న్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనకు విరుద్ధమైన దీనిని రద్దు చేసి అందరికీ పాత పింఛను విధానం వర్తింపజేయాలని సీపీఎస్ పరిధిలో ఉన్న ఉద్యోగులు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు మాత్రం ససేమిరా అంగీకరించలేదు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం... మన ప్రభుత్వం రాగానే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానం అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. పింఛను అనేది ఉద్యోగులకు సర్కారు పెట్టే భిక్ష కాదు. అది వారి హక్కు, ప్రభుత్వ బాధ్యత. న్యాయస్థానాలు, ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న మాట ఇది. ఒకేచోట ఒకేవిధమైన పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి ఆర్థిక భరోసా ఇస్తూ, మరికొందరికి నిరాకరించడం అన్యాయమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇది సమన్యాయ సూత్రాలకు, సమాన పనికి సమాన వేతనం నిబంధనలకు వ్యతిరేకం. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలోని 1.86 లక్షల ఉద్యోగ కుటుంబాలకు జరుగుతున్న అన్యాయం. అందుకే సీపీఎస్ స్థానంలో అందరికీ పాత పెన్షన్ విధానం అమల్లోకి తేవాలని ఉద్యోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ డిమాండ్‌తో ధర్నాలు, నిరాహార దీక్షలు, ఛలో అసెంబ్లీ తదితర ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు. ప్రభుత్వ అణచివేతను చవిచూశారు. అయినా పోరాట బాట వీడలేదు. సీపీఎస్ కింద పనిచేస్తూ... మరణించిన ఉద్యోగుల కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఆసరాలేక పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఉద్యోగం చేస్తూ చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (పేరు మార్చాం) రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య ప్రసన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలను చదివించడం కూడా ఇబ్బందిగా ఉందని ఆమె వాపోతున్నారు. ప్రసన్నలాంటి కుటుంబాలు ఇలా ఎన్నో ఉన్నాయి. పాత పెన్షన్ విధానంలోని ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మరణించినా వారి జీవిత భాగస్వామికి (భర్త లేదా భార్య) జీవితాంతం పింఛను వస్తుంది. సీపీఎస్ పరిధి ఉద్యోగి మరణిస్తే వారి జీవిత భాగస్వామికి నయా పైసా పింఛను రాదు. వేర్వేరు పెన్షన్ విధానాలెందుకు? ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాంటి సామాజిక, ఆర్థిక భద్రత ఉంటుందో పదవీ విరమణ తర్వాత కూడా అలాగే ఉండాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులకు గతంలో ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కల్పించారు. ప్రభుత్వ నిధులతోనే ఉద్యోగులకు పింఛను ఇవ్వడం ఇందులో భాగమే. 2003లో చంద్రబాబు కేంద్రంలో మద్దతిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రతైన పింఛనుకు గండికొడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానం అమల్లోకి తేనున్నట్లు నోటిఫై చేసింది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్తింపజేసింది. దీనిప్రకారం ఈ తేదీకి ముందు చేరినవారికి పాత పెన్షన్, తర్వాత చేరినవారికి కంట్రిబ్యూటరీ పింఛను వర్తిస్తుంది. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బిల్లు ఆమోదించింది. ఉద్యోగుల మూల వేతనంలో పది శాతాన్ని ప్రభుత్వం మినహాయించుకుని అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి, దానిని స్టాక్ మార్కెట్లో పెట్టి ఆ మొత్తంపై వచ్చే రాబడిని పెన్షన్‌గా ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. ఇది రెండో రకం పింఛను విధానం. పింఛన్లు ఎందుకు ఇవ్వాలంటే! వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనను పిల్లలు పట్టించుకోకపోతే వారి సంగతేమిటి? పనిచేయలేని వయసులో జబ్బులు వస్తే వైద్యానికి డబ్బు సంపాదించలేరు. వారు మంచానపడి చిక్కిశల్యమై పోవాల్సిందేనా? ఇది మంచి సమాజానికి సంకేతం కాదు. ఈ ఉద్దేశంతోనే సామాజిక భద్రతా పింఛన్ విధానాన్ని గతంలో అమలు చేశారు. అల్పాదాయ కుటుంబాల్లోని పేదలు, ఇతర వర్గాలకే సామాజిక భద్రతలో భాగంగా పింఛన్లు ఇస్తున్నప్పుడు దశాబ్దాల తరబడి ప్రత్యక్షంగా సేవలందించి వృద్ధాప్యంలో రిటైరైన ఉద్యోగులకు ఇదే తరహాలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కచ్చితంగా ఉందని మానవ వనరుల అభివృద్ధి శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తమకూ పెన్షన్ ఇవ్వాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులు చేస్తున్న డిమాండును ముఖ్యమంత్రి చంద్రబాబు అయిదేళ్లుగా ఆమోదించలేదు. అసలీ డిమాండ్ అసంబద్ధమైనదా? అనే ప్రశ్నకు ఔనని కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. దీన్నిబట్టి సీపీఎస్ అమలు న్యాయమైనదే అని తెలుస్తోంది. అయినా ఐదేళ్లుగా అమలు చేయకుండా కాలయాపన చేశారు. సాకులతో బాబు కాలయాపన సీపీఎస్ రద్దు చేయాలని నాలుగేళ్లుగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా పోలీసులతో లాఠీచార్జి చేయించారు. మహిళలని కూడా చూడకుండా దారుణంగా కొట్టించారు. ఛలో అసెంబ్లీ ప్రకటించిన ఉద్యోగులను తీవ్రవాదులన్నట్లుగా చితకబాదించారు. ఉద్యోగుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఓ దశలో సమస్యలు చెప్పేందుకు వెళ్లిన సీపీఎస్ ఉద్యోగులకు మొదట ఇది కేంద్ర ప్రభుత్వ పరిధి అంశమంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉందని ఆధారాలు సహా చెప్పడంతో ఎన్నికలు ఉన్నాయనగా గతేడాది నవంబరులో సాధ్యాసాధ్యాలను పరిశీలనకంటూ కమిటీ వేశారు. ఇప్పటికీ ఈ కమిటీ రిపోర్టు రాలేదు. దీనినిబట్టి కాలయాపన చేసేందుకే కమిటీ వేశారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పెన్షన్ విధానం అమలు చేయాలో నిర్ణయించుకునే అధికారం స్థానిక ప్రభుత్వాలకే ఉంది. అయితే, తమ ఉద్యోగులకు పాత పింఛను అమలు చేస్తామని ముందుగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తద్వారా పడే ఆర్థిక భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబుకు సీపీఎస్ రద్దు చేయాలనే చిత్తశుద్ధి లేదు. అందుకే అనుమతి కోసం చొరవ చూపలేదు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలపై కొండంత ఆశ సగటు ఉద్యోగులంతా విరమణ తర్వాత తమ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరిస్థితులపై ఒకింత ఆందోళనగా ఉంటారు. వారి జీవనం సాఫీగా సాగడానికి పింఛనే ఆధారం కాబట్టి ఎంతో ఆశతో లెక్కలేసుకుంటారు. గ్రాట్యుటీ సొమ్ముతో ఇల్లు కొనుక్కోవాలని, ఆడ పిల్లల పెళ్లి చేయాలని భావిస్తుంటారు. వారు ఆర్థికంగా తట్టుకోవడం చాలా కష్టం. పెద్ద జబ్బులు చేసినా, కుటుంబంలో ఏదైనా ఉపద్రవం వచ్చినా తట్టుకుని నిలదొక్కుకునేందుకే పెన్షన్ విధానాన్ని గత ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. వైఎస్ జగన్ హామీతో పెరిగిన విశ్వాసం మన ప్రభుత్వం రాగానే సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమల్లోకి తెస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో రాష్ట్రంలోని 1.86 లక్షల సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు ఆయనను కలిసి తమ కష్టాలను వివరించి న్యాయం చేయాలని కోరారు. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను కచ్చితంగా రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమల్లోకి తెస్తాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. ‘సీపీఎస్ రద్దు చేయాలి, పెన్షన్ భిక్ష కాదు– మా హక్కు’ అనే నినాదాలున్న ఫ్లకార్డులు పట్టుకుని కొన్ని జిల్లాల్లో సీపీఎస్ ఉద్యోగులు జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న జగన్ కుటుంబ పోషకులైన ఉద్యోగులను కోల్పోయి ఆర్థికంగా, సామాజికంగా చిక్కుల్లో పడ్డ కుటుంబాలకు సొంతంగా కొంత ఆర్థిక సాయం చేశారు. ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని, 11వ పీఆర్సీని త్వరగా అమలు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగ సభలో జగన్ వాగ్దానం చేశారు. మాట ఇస్తే తప్పని వైఎస్ కుటుంబ చరిత్రను గుర్తుచేసుకుంటూ, జగన్ అధికారంలోకి వస్తారని సీపీఎస్ రద్దు చేస్తారని ఉద్యోగులు విశ్వాసంతో ఉన్నారు. రెండింటి మధ్య తేడా ఇది... పాత పింఛను విధానం జీపీఎఫ్ ఖాతాలో మెచ్యూరిటీ మొత్తానికి ఆదాయ పన్ను ఉండదు. విరమణ తర్వాత ఉద్యోగులకు డీఏ పెరిగితే ఆ మేరకు రిటైర్డు ఉద్యోగులకు డీఆర్ పెరుగుతుంది. పింఛనును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లిస్తుంది. ఉద్యోగి ఒక్క రూపాయి కూడా జమ చేయాల్సిన పనిలేదు. సీపీఎస్ విధానం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉండదు. పింఛను గ్యారంటీ ఉండదు. ఇది స్టాక్‌మార్కెట్ రాబడిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగి మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కోసం చెల్లించాలి. -
ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు, అడ్వాన్సు ఇలా..
నిడమర్రు : వాహనాలు, కంప్యూటర్ వంటివి కొనుగోలుకు, వివాహం, ఉన్నత చదువుల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు అడ్వాన్స్, అప్పుల రూపంలో కొంత మొత్తం అందిస్తుంది. దీనికోసం రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా జీవో నంబర్ 167 విడుదల చేసింది. ఆర్పీఎస్ 2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ రుణాలు, అడ్వాన్సులు పొందేందుకు అర్హులు. ఏ అవసరాలకు రుణాలు ఇస్తారు.. వాటివడ్డీ, వాయిదాలు తదితర వివరాలు తెలుసుకుందాం. కార్ అడ్వాన్స్ ♦ బేసిక్ పే రూ.37,100 అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు, 15 నెలల బేసిక్ పే లేదా రూ.6 లక్షలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీనిని 65 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. మోటర్ సైకిల్ అడ్వాన్స్ ♦ బేసిక్ పే రూ.22,460 కంటే ఎక్కువ పొందుతున్న ఉద్యోగులు దీనికి అర్హులు. ఏడు నెలల బేసిక్ పే లేదా రూ.80 వేలు.. ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీన్ని 16 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. మోపెడ్ అడ్వాన్స్ ♦ రెండేళ్ల సర్వీసు ఉండాలి. బేసిక్ పే రూ.16,400 అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. దీనికి 7 నెలల బేసిక్ పే లేదా రూ.35 వేలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. 16 ♦ వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. సైకిల్ అడ్వాన్స్ ♦ కార్, మోటర్ సైకిల్ కోసం అడ్వాన్స్ తీసుకున్నవారు మినహాయించి, అందరూ అర్హులు. నగదు రూ.10 వేలు అడ్వాన్స్‌గా 5.5 శాతం వడ్డీతో 4 వాయిదాల్లో చెల్లించాలి. వివాహ అడ్వాన్స్ ♦ పురుష ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు, క్లాస్–4 ఉద్యోగులకు 15 నెలల బేసిక్ పే లేదా రూ.75 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో, 10 వాయిదాల్లో చెల్లించాలి. ♦ మహిళా ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు క్లాస్–4 ఉద్యోగినులకు అయితే 15 నెలల బేసిక్ పే లేదా రూ.లక్ష.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. ♦ మిగతావారికి, 15 నెలల బేసిక్ పే లేదా రూ.2 లక్షలు.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. కంప్యూటర్ ♦ బేసిక్ పే రూ.16,400 లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.50 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి. పండుగ అడ్వాన్స్ ♦ స్కేల్ రూ.26,600–రూ.77,030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.7,500 చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఆప్కో దుస్తుల కొనుగోలుకు ♦ అప్కో దుకాణాల్లో దుస్తుల కొనుగోలుకు గెజిటెడ్ అధికారులు రూ.7.500, నాన్ గెజిటెడ్ అధికారులు రూ.6 వేలు, క్లాస్–4 ఉద్యోగులకు రూ.4,500 అడ్వాన్స్‌గా ఇస్తారు. ఎటువంటి వడ్డీ లేకుండా అందరూ 10 వాయిదాల్లో చెల్లించాలి. ఉన్నత చదువుల కోసం ♦ నాన్ గెజిటెడ్ మరియు క్లాస్–4 ఉద్యోగులకు రూ.7,500 ఇస్తారు. వడ్డీ లేకుండా దీన్ని 10 వాయిదాల్లో చెల్లించాలి. -
ఎట్టకేలకు..!
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో సంచలనం సృష్టించిన బెల్లంపల్లికి చెందిన రూ.100 కోట్ల విలువైన భూముల మాయ వ్యవహారంపై కోర్టు స్పందించింది. అ వకతవకల వ్యవహారంలోప్రభుత్వ ఉద్యోగులపై పోలీసు కేసుకు ఆదేశించింది. తప్పుడు జీవోలు, నకిలీ పత్రాలు సృష్టించడం, ఫోర్జరీ చేయడం, అవకతవకలకు పాల్పడటం, వంచనకు గురి చేయడం వంటి పలు ప్రధాన సెక్షన్లతో సస్పెన్షన్‌కు గురైన బి.విశ్వంభర్(కౌటాల తహశీల్దార్), రోహిత్‌దేశ్‌పాండే (జైనూర్ డిప్యూటీ తహశీల్దార్), ముడిమడుగుల వెంకట్రావ్ (మందమర్రి వీఆర్వో), మణిరాజ్ (మండల సర్వేయర్ నెన్నెల), రాంనర్సయ్య (రిటైర్డ్ డీఎఫ్‌వో, బెల్లంపల్లి)పై కేసు నమోదు చేయాల్సిందిగా బెల్లంపల్లి పోలీసులకు ఆసిఫాబాద్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సదరు ప్రభుత్వ రెవెన్యూ అధికారులపై బెల్లంపల్లి టూటౌన్లో శనివారం కేసు నమోదైంది. సదరు ఉద్యోగులపై ఐపీసీ 200, 409, 468, 471, 482, 488, 420, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి టూటౌన్ ఎస్‌హెచ్‌వో మహేశ్‌బాబు దర్యాప్తు చేస్తున్నారు. వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. బెల్లంపల్లిలోని కాల్టెక్స్ భూముల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. 2012 ఆగస్టు 6వ తేదీన ‘భూమాయ’, 2012 ఆగస్టు 12వ తేదీన ‘భూకైలాస్’ శీర్షికలతో జిల్లా టాబ్లాయిడ్లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కన్నాల శివారులోని సర్వే నంబర్ 108, 109, 110/1, 111లలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న నలుగురితో సహా పరాయి దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరుపై సు మారు 248.28 ఎకరాల భూములు ఉన్నట్లు సదరు రెవెన్యూ ఉద్యోగులు 2011 జనవరి 13వ తేదీన ప్రొసిడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రకారం బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి మొదలుకుని ప్రభుత్వాస్పత్రి వరకు ఉన్న భూములన్నీ సదరు వ్యక్తులవేనని రెవెన్యూ అధికారులు ప్రొ సిడింగ్స్లో స్పష్టంగా పేర్కొన్నారు. డీఎఫ్‌వో కార్యాలయం, టూటౌన్, ట్రాన్స్‌కో, బీఎస్ఎన్ఎల్, ఇతర స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న భూములన్నీ కూడా ప్రొసిడింగ్స్‌లో జారీ చేసి వ్యక్తులవేనని సుస్పష్టం చేయడంతో ఒక్కసారిగా కల కలం రేగింది. దీంతో ‘సాక్షి’లో వచ్చిన వార్తా కథనాల క్లిప్పింగ్‌లను ఆధారం చేసుకొని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్‌బాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుకు స్పందించిన కలెక్టర్ బెల్లంపల్లిలోని కాల్టెక్స్ భూముల అక్రమాలపై విచారణ చేయాల్సిందిగా అప్పటి అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటయ్య (ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు)ను ఆదేశించారు. ఈ మేరకు అడిషనల్ జాయింట్ కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదికను సమర్పించారు. అడిషనల్ జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రూ.100 కోట్ల విలు వ చేసే భూముల అక్రమాల డొల్లతనం బయటపడింది. ఈ మేరకు కలెక్టర్ నలుగురు రెవె న్యూ ఉద్యోగులపై వేటు వేశారు. బెల్లంపల్లిలో అప్పట్లో పనిచేసిన తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేశ్‌బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే, వీఆర్వో ముడిమడుగుల వెంకట్రావ్‌ను సస్పెండ్ చేశారు. కోర్టు ఆదేశాలతో... కాల్టెక్స్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడిన వైనాన్ని బెల్లంపల్లికి చెందిన కొందరు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టులో ఫిటిషన్ వేయడంతో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్న ట్లు గుర్తించి సదరు కోర్టు తొలుత దిగువ స్థాయి కోర్టుకు వెళ్లాల్సిందిగా పిటిషన్‌దారులకు సూ చించింది. దీంతో సదరు పిటిషన్‌దారులు ఆసిఫాబాద్‌లోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లా రు. ఫిటిషన్ను స్వీకరించిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కేసు పూర్వపరాలను పరిశీలించి భూముల అక్రమాలకు పాల్పడిన నలుగురు రెవెన్యూ ఉద్యోగు లు, ఆ భూముల వ్యవహారంలో ఉద్యోగులకు సహకరించిన రిటైర్డ్ డీఎఫ్‌వోపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కలెక్టర్ స్పందించడంతో... భూముల మాయపై కలెక్టర్ అహ్మద్‌బాబు సీరి యస్‌గా స్పందించడంతోనే అక్రమార్కుల గుట్టు రట్టైంది. సకాలంలో స్పందించిన కలెక్టర్ అడిషనల్జాయింట్ కలెక్టర్‌తో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల భూ భాగోతం బట్టబయలైంది. దీంతో రూ.100 కోట్లకుపైబడి విలువ చేసే భూములు బినామీల పరం కాకుండా నిలిచిపోయాయి. భూముల అక్రమాలను సహించలేని కలెక్టర్ చివరికి రెవెన్యూ ఉద్యోగులను సస్పెన్షన్ చేసి అక్రమార్కులకు దడ పుట్టించారు.