నిడమర్రు : వాహనాలు, కంప్యూటర్ వంటివి కొనుగోలుకు, వివాహం, ఉన్నత చదువుల ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు అడ్వాన్స్, అప్పుల రూపంలో కొంత మొత్తం అందిస్తుంది. దీనికోసం రాష్ట్ర ఆర్థిక శాఖ తాజాగా జీవో నంబర్ 167 విడుదల చేసింది. ఆర్‌పీఎస్ 2015 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ రుణాలు, అడ్వాన్సులు పొందేందుకు అర్హులు. ఏ అవసరాలకు రుణాలు ఇస్తారు.. వాటివడ్డీ, వాయిదాలు తదితర వివరాలు తెలుసుకుందాం.
కార్ అడ్వాన్స్
♦ బేసిక్ పే రూ.37,100 అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులకు, 15 నెలల బేసిక్ పే లేదా రూ.6 లక్షలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీనిని 65 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి.
మోటర్ సైకిల్ అడ్వాన్స్
♦ బేసిక్ పే రూ.22,460 కంటే ఎక్కువ పొందుతున్న ఉద్యోగులు దీనికి అర్హులు. ఏడు నెలల బేసిక్ పే లేదా రూ.80 వేలు.. ఇందులో ఏది తక్కువ ఉంటే అంత అడ్వాన్స్ ఇస్తారు. దీన్ని 16 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి.
మోపెడ్ అడ్వాన్స్
♦ రెండేళ్ల సర్వీసు ఉండాలి. బేసిక్ పే రూ.16,400 అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. దీనికి 7 నెలల బేసిక్ పే లేదా రూ.35 వేలు..ఇందులో ఏది తక్కువ ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. 16 ♦ వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి.
సైకిల్ అడ్వాన్స్
♦ కార్, మోటర్ సైకిల్ కోసం అడ్వాన్స్ తీసుకున్నవారు మినహాయించి, అందరూ అర్హులు. నగదు రూ.10 వేలు అడ్వాన్స్‌గా 5.5 శాతం వడ్డీతో 4 వాయిదాల్లో చెల్లించాలి.
వివాహ అడ్వాన్స్
♦ పురుష ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు, క్లాస్–4 ఉద్యోగులకు 15 నెలల బేసిక్ పే లేదా రూ.75 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో, 10 వాయిదాల్లో చెల్లించాలి.
♦ మహిళా ఉద్యోగులు, వారి పిల్లల వివాహాలకు క్లాస్–4 ఉద్యోగినులకు అయితే 15 నెలల బేసిక్ పే లేదా రూ.లక్ష.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు.
♦ మిగతావారికి, 15 నెలల బేసిక్ పే లేదా రూ.2 లక్షలు.. ఇందులో ఏది తక్కువగా ఉంటే అంత మొత్తం చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి.
కంప్యూటర్
♦ బేసిక్ పే రూ.16,400 లేదా అంతకంటే ఎక్కువ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.50 వేలు చెల్లిస్తారు. దీన్ని 5.5 శాతం వడ్డీతో చెల్లించాలి.
పండుగ అడ్వాన్స్
♦ స్కేల్ రూ.26,600–రూ.77,030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ పొందుతున్నవారు అర్హులు. వీరికి రూ.7,500 చెల్లిస్తారు. దీన్ని 10 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.
ఆప్కో దుస్తుల కొనుగోలుకు
♦ అప్కో దుకాణాల్లో దుస్తుల కొనుగోలుకు గెజిటెడ్ అధికారులు రూ.7.500, నాన్ గెజిటెడ్ అధికారులు రూ.6 వేలు, క్లాస్–4 ఉద్యోగులకు రూ.4,500 అడ్వాన్స్‌గా ఇస్తారు. ఎటువంటి వడ్డీ లేకుండా అందరూ 10 వాయిదాల్లో చెల్లించాలి.
ఉన్నత చదువుల కోసం
♦ నాన్ గెజిటెడ్ మరియు క్లాస్–4 ఉద్యోగులకు రూ.7,500 ఇస్తారు. వడ్డీ లేకుండా దీన్ని 10 వాయిదాల్లో చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment