
సాక్షి, ఖిల్లాఘనపురం (వనపర్తి) : మీకు దండం పెడతా.. హరితహారం పనులకు వచ్చి మా ఉద్యోగాలు కాపాడండి అంటూ షాపురం పంచాయతీ కార్యదర్శి రవితేజ, సర్పంచ్ బాలాంజనేయులతో కలిసి కూలీలకు చేతులెత్తి మొక్కారు. గ్రామాల్లో మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు కంచే ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్వేతామహంతి ఆదేశించడం, ఇటీవల పలువురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆందోళనకు లోనైన పంచాయతీ కార్యదర్శి మంగళవారం ఉదయం గ్రామం నుంచి ఇతర పనులకు ట్రాలీ ఆటోపై వెళ్తున్న కూలీలను అడ్డుకుని హరితహారం పనులకు రావాలని కోరారు.