సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుకు సంబంధించి విధివిధానాల కోసం కమిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్ సమావేశాంలోనే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుసుకోవడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఇంత త్వరగా తమ సమస్యలు పరిష్కరిస్తారని అనుకోలేదని ఆనందం వెలిబుచ్చుతున్నారు.
(చదవండి : ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్ 27 శాతం పెంపు)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులు పట్ల తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేత వెంకటరామిరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ అని, ఆయనకు ఉద్యోగులు అందరు రుణపడి ఉంటారన్నారు. కాగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ పెంపు, ఆశావర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపునకు, సామాజిక పింఛన్లను రూ.2,250 పెంపు, జనవరి 26 నుంచి అమ్మఒడి లాంటి కీలక పథకాలకు ఆమోద ముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment