
వనపర్తి : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం వినియోగించే. వస్తువులు, వాహనాల ధరలను ఇటీవల అధికారులు ఖరారు చేశారు. గతంలో కంటే.. ఈ ధరలు పెరిగినట్లు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాహనాలు, హోర్డింగ్‌లు, మైక్ సెట్లు, స్పీకర్లు, మౌత్‌పీస్ తదతర వస్తువులతో పాటు నాలుగు, మూడు, రెండు చక్రాలను ఉపయోగిస్తారు. ఈ మేరకు ఏది ఉపయోగిస్తే ఎంత ధర నిర్ణయిస్తారనే విషయాన్ని పలు వ్యాపార సంస్థల కొటేషన్లు స్వీకరించిన అధికారులు తుది ధరలు ఖరారు చేశారు. ఈ ధరల పట్టిక ప్రకారం.. అభ్యర్థుల లెక్కలు పరిశీలించే నోడల్ అధికారి, కమిటీ సభ్యులు వారి ఎన్నికల ఖర్చు నమోదు చేస్తారు.
గతంతో పోలిస్తే ఎక్కువే..
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఒక్కో అభ్యర్థి పోలింగ్ పూర్తయ్యే నాటికి రూ. 28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్ణయించిన ధరల కంటే ప్రస్తుతం నిర్ణయించిన ధరలు ఎక్కువేనని తెలుస్తోంది. కాగా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన మరునాటి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇతర బీఎల్‌ఎఫ్, స్వతంత్య్ర అభ్యర్థులు కొన్ని రోజులుగా ప్రచారం చేస్తుండగా.. మహాకూటమి నుంచి టికెట్లు ఖరారు అనుకున్న వారు మాత్రం గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
ఎక్కడ సభ, సమావేశాలు నిర్వహించినా లెక్కలోకే...
అభ్యర్థులు సభలు, సమావేశాలు ఎక్కడ నిర్వహించినా అక్కడ ఏర్పాట్ల ఖర్చు మొత్తం సదరు అభ్యర్థి పద్దులోకే వస్తుంది. ఇక్కడ ఉపయోగించిన వస్తువులు, స్పీకర్లు, కుర్చీలు, టేబుళ్లు, ఫంక్షన్ హాల్, వాహనాలు, భోజనాలు, టీ, టిఫిన్స్‌తో సహా అన్ని ఖర్చులు నమోదు చేస్తాం. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతిరోజూ అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ కలిపి జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తాం.
– స్వామి, ఎన్నికల ఖర్చుల విభాగం నోడల్ అధికారి, వనపర్తి
మైక్రోఫోన్‌తో కూడిన లౌడ్‌స్పీకర్ (ఒక్క రోజుకు)
100 వాట్స్ రూ.700
250 వాట్స్ రూ.1,700
వేదిక ఏర్పాటు కోసం (ఒక్క రోజుకు)
4 ఫీట్లు రూ.120
6 బై 120 రూ.750
36 బై 36 టెంట్ రూ.2,000
18 బై 36 టెంట్ రూ.800
క్లాత్ జెండాలు
ప్రతీ ఫీటు రూ.65
ప్లాస్టిక్ జెండాలు
ప్రతి కేజీకు రూ.400
హ్యాండ్ బిల్లు పేపర్స్
వెయ్యికి రూ.900
పోస్టర్లు
వెయ్యికి రూ.7,600
పది వేలకు రూ.3,900
యాభై వేలకు రూ.3,200
లక్షకు రూ.3,050
హోర్డింగ్స్
20 బై 30 రూ.11,500
20 బై 20 రూ.9,800
ఉడెన్ కటౌట్
ప్రతీ స్వే్కర్ ఫీట్‌కు రూ.95
క్లాత్, ప్లాస్టిక్ కటౌట్లు ప్రతీ స్క్వేర్ ఫీట్‌కు రూ.70
వీడియో క్యాసెట్లు, సీడీలు
ప్రతి నెలా రూ.10వేలు
లోకల్ చానల్ (ప్రతి రోజు) రూ.750
ఆడియో క్యాసెట్లు, సీడీలు
ఒక్క రికార్డ్‌కు రూ.5,500
ఆటోలో ఆడియో ప్రచారం (ఒక్క రోజుకు) రూ.2,400
ఆర్చీలు వంద స్వే్కర్ ఫీట్లు రూ.95
వాహనాలు
జీపు, టెంపో, ట్రక్కర్ (డీజిల్ లేకుండా ఒక్కరోజుకు) రూ.1,600
సుమో, క్వాలిస్, ఇన్నోవా (డీజిల్ లేకుండా ఒక్క రోజుకు) రూ.2,000
కార్లు (డీజిల్ లేకుండా ఒక్క రోజుకు) రూ.1,500
మూడుచక్రాల వాహనాలు (ఒక్కటి) రూ.1.200
సైకిల్, రిక్షాలు రూ.600
హోటల్ రూంలు, గెస్ట్ హౌస్‌లు
డీలక్స్ ఏసీ గది (ఒక్క రోజుకు) రూ.1,350
నార్మల్ నాన్ ఏసీ గది (ఒక్క రోజుకు) రూ.800
ఫర్నీచర్ (ఒక్క రోజుకు)
ప్లాస్టిక్ చైర్ రూ.7
వీఐపీ చైర్ రూ.60
సోఫా రూ.500
టేబుల్ రూ.90
Comments
Please login to add a commentAdd a comment