కూటి కోసం కోటి విద్యలు అన్నారు. అయితే ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతుందని గణాంకాలు చెబుతున్నాయి. దేశీయంగా కుటుంబాలు ఆహారంపై సగటున చేసే వ్యయాలు 1947 నాటితో పోలిస్తే తొలిసారిగా సగానికి పైగా తగ్గినట్లు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) ఒక వర్కింగ్ పేపర్‌లో వెల్లడించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు నెలవారీగా చేసే మొత్తం వ్యయాల్లో ఆహారానికి వెచ్చించేది భారీగా తగ్గింది. అట్టడుగున ఉండే 20 శాతం మంది విషయంలో ఇది మరింత గణనీయంగా ఉంది. అన్ని రాష్ట్రాల్లోని వారికి, ముఖ్యంగా అట్టడుగు 20 శాతం కుటుంబాలపై ప్రధానంగా లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత పాలసీలు సమర్ధమంతంగా అమలవుతుండటాన్ని ఇది ప్రతిఫలిస్తోందని వర్కింగ్ పేపర్ పేర్కొంది.
వివిధ వర్గాల్లో తృణధాన్యాల వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి తగు సాగు విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వివరించింది. 2011–12 నాటి వినియోగ ధోరణులను 2022–23తో పోలుస్తూ ఈ పేపర్ సమగ్రంగా విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment