విదేశీ పర్యటనల పేరుతో ఇప్పటికే ప్రజా ధనాన్ని మంచి నీళ్లలా దుర్వినియోగం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్వదేశంలో తన లగ్జరీ కోసం చేస్తున్న ఖర్చు కూడా భారీ స్థాయిలోనే ఉంది. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబుకు అయిన హోటల్ బిల్లు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 8.7 లక్షలట. అయితే ఆ మొత్తాన్ని సిగ్గు-ఎగ్గు లేకుండా ప్రభుత్వమే చెల్లించడం ఇక్కడ గమనార్హం.